జెన్నిఫర్ వింగెట్

భారతీయ చలన చిత్ర పరిశ్రమ నటి
(జెన్నిఫర్‌ వింగెట్‌ నుండి దారిమార్పు చెందింది)

జెన్నిఫర్‌ వింగెట్‌ ఒక భారతీయ సినీ, టెలివిజన్ నటి. పలు హిందీ సుప్రసిద్ద ధారావాహికలలో నటించింది.

జెన్నిఫర్‌ వింగెట్‌
సరస్వతీచంద్ర హిందీ టెలివిజన్ ధారావాహిక ప్రారంభోత్సవం సందర్భంగా జెన్నిఫర్ వింగెట్
జననం
జెన్నిఫర్‌ వింగెట్‌

(1985-05-30) 1985 మే 30 (వయసు 39)[1]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1997–ఇప్పటివరకు
జీవిత భాగస్వామి[3]

వివరాలు

మార్చు
  • ఈవిడ పుట్టింది, పెరిగింది ముంబైలోనే. తల్లి ప్రభ. గృహిణి. తండ్రి హేమంత్‌ వింగెట్‌. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగి. ఆమెకు ఒక అన్న మోసెస్‌ వింగెట్‌. ఇదీ జెన్నిఫర్‌ కుటుంబం. ఈవిడ చదివింది. బీకామ్‌ డిగ్రీ..
  • ‘అకేలే హమ్‌ అకేలే తుమ్‌’ సినిమాతో బాలనటిగా నటనా కెరీర్ ప్రారంభం అయినా, నటిగా పరిచయమైంది మాత్రం ‘షకలక బుమ్‌ బుమ్‌’ టీవీ సీరియల్‌తో. తర్వాత ‘కుసుమ్‌’, ‘కసౌటీ జిందగీ కే’ వంటి సీరియళ్లతోనూ ప్రేక్షకులకు దగ్గరైంది. ‘దిల్‌ మిల్‌ గయే’తో ప్రాచుర్యం పొందింది. మనసుల్లో ముద్ర వేసింది మాత్రం సంజయ్‌లీలా భన్సాలీ ‘సరస్వతీచంద్ర’ సీరియల్‌లో కుముద్‌ పాత్రతో.
  • ‘సరస్వతిచంద్ర’ ప్రధాన పాత్ర‌ కోసం జెన్నిఫర్‌నే మొదట ఎంపిక చేసుకున్నప్పటికీ కాంట్రాక్ట్‌ కుదరక ఆమెను తప్పించాడు సంజయ్‌లీలా. చాలా మందిని వెదికి మళ్లీ జెన్నిఫర్‌నే తీసుకున్నాడు. ఆమె తప్ప ఆ పాత్రకి ఇంకెవరూ న్యాయం చేయలేరని. అతను అనుకున్నట్టుగానే జెన్నిఫర్‌తో ఆ సీరియల్‌ పేరు పొందింది. ఆ సీరియల్‌తో జెన్నిఫర్‌ అందరి అభిమానం పొందింది.
  • ‘నటి ‌ కాకపోయి ఉంటే ఎయిర్‌హోస్టెస్‌ అయ్యేదాన్ని’ అంటుంది జెన్నిఫర్‌ వింగెట్‌.
  • వెబ్‌ సిరీస్‌ ఎంట్రీ.. ‘డామేజ్డ్‌ 2’, ‘కోడ్‌ ఎమ్‌’తో. ‘ఫిర్‌ సే’ అనే వెబ్‌ మూవీలోనూ హీరోయిన్‌గా నటించింది కునాల్‌ కొహ్లీ పక్కన. అయితే ఇది 2015లో ఫీచర్‌ ఫిల్మ్‌గానే థియేటర్‌లలో విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల 2018లో నేరుగా నెట్ ఫ్లిక్స్లో విడుదలైంది.
  • ఫిట్‌నెస్‌ పట్ల చాలా శ్రద్ధ జెన్నిఫర్‌కు. వ్యాయామంతోనే ఆమె రోజు, కూరగాయల జ్యూస్‌తో ఆమె డైట్‌ ప్రారంభమవుతుంది.  
  • అభిరుచులు.. పెంపుడు కుక్కతో ఆడుకోవడం, షాపింగ్‌ చేయడం.
  • డ్రీమ్‌రోల్‌.. ‘బ్లాక్‌’ సినిమాలో రాణీ ముఖర్జీ ధరించిన పాత్ర.

మూలాలు

మార్చు
  1. "Jennifer Winget Birthday Bumps: 10 Things to know about the Indian TV star!". India.com. 30 May 2014. Retrieved 16 October 2014.
  2. "Jennifer Winget gears up for cinematic debut with Kunal Kohli's 'Phir Se'". The News Reports. Archived from the original on 18 March 2015. Retrieved 20 December 2014.
  3. Bajwa, Dimpal (9 December 2014). "Karan Singh Grover confirms divorce with Jennifer Winget on Twitter". Indian Express. Retrieved 15 December 2014.