జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్

జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్ (ఆంగ్లం Jenifer Emmanuel) (జననం 2000 జనవరి 11) భారతీయ చలనచిత్ర నటి, మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు భాషా చిత్రాలలో నటిస్తుంది.

జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్
జననం2000 జనవరి 11
ముంబై
క్రియాశీల సంవత్సరాలు2020 - ప్రస్తుతం

జననం, విద్య మార్చు

ఆమె మహారాష్ట్రలోని ముంబైలో 2000 జనవరి 11న జన్మించింది. ఆమె ఇంగ్లీష్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ చేసింది. జ‌ర్న‌లిజంలో డిప్లొమాతో పాటు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్న‌ది.

కెరీర్ మార్చు

మోడలింగ్‌లో తన వృత్తిని ప్రారంభించిన జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్ రుచీ పాస్తా మసాలా యాడ్, సన్‌టీవీ ఛానెల్ యాడ్, టైమెక్స్ యాడ్ మొదలైన వివిధ టీవీసీలలో నటించింది. అలాగే సర్ద్ హవా (2021), దారు 2 పెగ్ (2020) వంటి కొన్ని మ్యూజిక్ వీడియోలలో నటించింది. 2021లో ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాయ్స్ చిత్రంతో తన నటనా వృత్తిని ప్రారంభించింది, ఆ తర్వాత నచ్చింది గర్ల్ ఫ్రెండూ (2022) వంటి కొన్ని చిత్రాలలో నటించింది.[1]

మూలాలు మార్చు

  1. "jennifer emmanuel : వాళ్లతో పోలిక ఆనందమే". web.archive.org. 2023-01-15. Archived from the original on 2023-01-15. Retrieved 2023-01-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)