జేమ్స్ బైరాన్ డీన్ (ఫిబ్రవరి 8, 1931 – సెప్టెంబర్ 30, 1955) అమెరికాకు చెందిన ఒక నటుడు మరియు ఒక సాంస్కృతిక చిహ్నం. ఆతను నటించినవాటిలోనే అత్యధిక ప్రబలమైన రెబెల్ వితౌట్ ఎ కాస్ అనే చిత్ర శీర్షిక మాదిరాగానే అతని జీవితం ఉండేది. ఆ చిత్రములో, జిం స్తార్క్ అనే యవ్వనంలో ఉన్న ఒక మనశ్శాంతి లేని లాస్ అన్జేలేస్ యువకుడు వేషం పోషించాడు. అతను పోషించిన మరో రెండు ప్రముఖ వేషాలు: ఈస్ట్ అఫ్ ఈడెన్ చిత్రములో ఒక ఒంటరివాడు వేషం మరియు జయంట్ చిత్రములో ఒక మండిపడే రైతు వేషం. డీన్ యొక్క కీర్తి మరియు ప్రఖ్యాత ఈ మూడు చిత్రాలు మీదే ఆధారపడింది. తార వేషంలో అతను నటించినవి ఈ మూడు చిత్రాలే. ఒక కార్ ప్రమాదంలో చిన్నతనంలోనే అతను మరణించడం మూలాన ఒక లెజెండ్ గా అతని కీర్తి స్థిరపడింది.

James Dean
James Dean in East of Eden trailer 2.jpg
as Cal Trask in East of Eden (1955)
జన్మ నామంJames Byron Dean
జననం (1931-02-08) 1931 ఫిబ్రవరి 8
మరణం 1955 సెప్టెంబరు 30 (1955-09-30)(వయసు 24)
మూస:City-state, U.S.
ఇతర పేర్లు Jimmy Dean
క్రియాశీలక సంవత్సరాలు 1951–1955

మరణాంతరం ఉత్తమ నటుడుగా అకాడమి అవార్డ్ కు ప్రతిపాదన పొందిన ఏకైక వ్యక్తి అతనే. అంతే కాక, మరణాంతరం కూడా ఉత్తమ నటుడి అవార్డుకు రెండు మార్లు ప్రతిపాదించబడిన ఏకైక నటుడు ఇతడు. 1999లో, అమెరికన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ తమ AFI వారి 100 సంవత్సరాలు…100 తారలు జాబితాలో డీన్ ను 18వ స్థానంలో పెట్టారు.[1]

బాల్య జీవితంసవరించు

జేమ్స్ డీన్ ఫిబ్రవరి 8, 1931 నాడు మారియన్, ఇండియాన లోని సెవెన్ గబ్లేస్ అపార్ట్మెంట్ ఇంటిలో వింటన్ డీన్, మిల్డ్రెడ్ విల్సన్ కు జన్మించాడు. ఆరు సంవత్సరాల తరువాత అతని తండ్రి వ్యవసాయాన్ని మానేసి ఒక దంత టెక్నీషియన్ గా స్థిరపడటానికి కలిఫోర్నియా లోని సాన్టా మోనికా అనే ఊరికి జేమ్స్, అతని కుటుంబ సబ్యులు వెళ్ళారు. ఆ కుటుంబం అక్కడ పలు సంవత్సరాలు గడిపింది. జిమ్మి తన తల్లికి చాలా దగ్గరగా ఉండేవాడు. మైకేల్ డిఎంజెలిస్ ప్రకారం, ఆమె "మాత్రమే అతన్ని అర్ధం చేసుకునే వ్యక్తి" గా ఉన్నారు".[2] అతను లాస్ ఏంజెలెస్ లోని బ్రెంట్వుడ్ పరిసర ప్రాంతంలోని బ్రెంట్వుడ్ పబ్లిక్ స్కూల్ లో, తన తొమ్మిదో వయస్సులో తల్లి కాన్సర్ వ్యాధితో చనిపోయేవరకు, చదివాడు.

కొడుకును చూసుకోలేక, వింటన్ డీన్, జేమ్స్ ను ఫేర్మౌంట్, ఇండియానా లో ఉన్న తన సోదరి ఓర్టేన్స్, ఆమె బర్త మార్కస్ విన్స్లో దగ్గిరకు పంపాడు. అక్కడ జేమ్స్ ఒక క్వేకర్ వాతావరణంలో పెరిగాడు. డీన్ మేదడిస్ట్ ప్యాస్టర్ అయిన రెవ్. జేమ్స్ డివీర్డ్ యొక్క స్నేహం పొంది అతని సలహాలు పాటించేవాడు. డీన్ యొక్క ప్రారంభ దశలో డివీర్డ్ ప్రభావం ఉండేది. ముఖ్యంగా బుల్ ఫైటింగ్, కార్ రేసింగ్, నాటక రంగం వంటి అంశాల మీద ఎక్కువ భవిష్యత్తులో ఆసక్తి కలగడానికి అతనే కారకుడు. బిల్లి జే. హార్బిన్ ప్రకారం, "డీన్ కు తన ప్యాస్టర్ తో చాల సన్నిహిత సంబంధం ఉండేది....ఇది హాయ్ స్కూల్ లో సీనియర్ సంవత్సరములో ఉన్నప్పుడు మొదలయి పలు సంవత్సరాలు ఉంది"[3]. ఉన్నత పాఠశాలలో డీన్ యొక్క మొత్తం ప్రదర్శన సుమారుగానే ఉండేది. అయితే, క్రీడలలో మంచి ప్రదర్శన చూపించి, స్కూల్ బేస్బాల్, బ్యాస్కెట్బాల్ జట్టులలో ఆడేవాడు. నాటకం గురించి చదివేవాడు. ఫోరేన్సిక్స్ లో పోటి చేసి, ఇండియాన హై స్కూల్ ఫోరెన్సిక్ అసోసియేషన్ తరపున పాల్గొనేవాడు. ఫేర్ మౌంట్ హాయ్ స్కూల్ నుండి పట్టం తీసుకున్న తరువాత, మే 16, 1949లో డీన్ కాలిఫోర్నియాకు వెళ్లి తన బీగిల్ మాక్స్, తండ్రి మరియు సవితి తల్లి తో కలిసి నివసించాడు. అతను సాంటా మోనికా కాలేజీ (SMCC) లో చేరి ప్రీ-లా చదివాడు. డీన్ UCLA[4] కు బదిలీ అయి, మేజర్ ను నాటకానికి మార్చుకున్నాడు. దీని మూలాన తండ్రితో విభేదం వచ్చింది. అతను సిగ్మ న్యు సహోదర సంఘం లో చేరుతాని మాట ఇచ్చాడు కాని ఎప్పుడు చేరలేదు.

UCLA లో ఉన్నప్పుడు, అతను 350 నటులతో పోటి పడి, మాక్బెత్ లో మాల్కం పాత్రను గెలుచుకున్నాడు . ఆ సమయములో, జేమ్స్ వెయిట్మోర్ యొక్క నటనా వర్క్ షాప్ లో చేరి నటించడం మొదలుపెట్టాడు. జనవరి 1951లో, UCLA లో చదువు మానేసి, నటనా వృత్తికి పూర్తి సమయం కేటాయించాడు.[5]

నటనా జీవితంసవరించు

డీన్ యొక్క తొలి టెలివిజన్ పాత్ర ఒక పెప్సి కోలా టెలివిజన్ వ్యాపార ప్రకటన.[6] కాలేజి మానేసి, పోరోటి స్థాయి నటుడుగా మారాడు. హిల్ నెంబర్ వన్ అనే ఒక ఈస్టర్ టెలివిజన్ విశేష కార్యక్రమలో, జాన్, ది బెలవడ్ డిసైపిల్ పాత్ర పోషించాడు. ఫిక్స్డ్ బయోనేట్స్! , సైలర్ బివేర్ , హస్ ఎనిబడి సీన్ మై గాల్? అనే మూడు చిత్రాలలో నడచి వెళ్తున్న చిన్న వేషాలు వేశాడు. ఈ మూడు చిత్రాలలో అతను మాటలాడిన చిత్రం పారామౌంట్ కామడి అయిన సైలర్ బివేర్ . దీంట్లో డీన్ మార్టిన్ మరియు జెర్రీ లూయిస్ నటించారు; డీన్ ఒక బాక్సింగ్ శిక్షణ ఇచ్చే పాత్ర పోషించాడు. హాలీవుడ్ లో పనులు దొరకడానికి కష్టపడుతూ ఉన్న సమయములో డీన్ CBS స్టూడియోస్ లోని ఒక పార్కింగ్ లాట్ లో సహాయకుడుగా పనిచేశాడు. అప్పుడు ఒక ప్రకటనా ఏజేన్సి లో రేడియో డైరెక్టర్ అయిన రోజర్స్ బ్రాకెట్ ను కలిసాడు. అతను డీన్ కు వృత్తి సలహాదారుడుగా మారి, డీన్ కు ఉండడానికి ఒక స్థలము ఇచ్చాడు.[7][8]

అక్టోబర్ 1951లో, నటుడు జేమ్స్ వెయిట్మోర్ మరియు తన గురువు రోజర్స్ బ్రాకెట్ సలహా మేరకు, డీన్ న్యూ యార్క్ మహానగరానికి వచ్చాడు. న్యూ యార్క్ లో అతను బీట్ ది క్లాక్ గేం షా కు ఒక స్టంట్ టేస్టర్ గా పని చేశాడు. ది వెబ్ , స్టూడియో ఒన్ , లక్స్ వీడియో థియేటర్ వంటి అనేక CBS టెలివిజన్ సిరీస్ లలో అతను నటించాడు. తరువాత ప్రతిష్టాత్మకమైన యాక్టర్స్ స్టూడియో లో ప్రవేశం పొంది, లీ స్ట్రాస్బెర్గ్ క్రింద మేతడ్ యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఈ గొప్ప సాధనకు గర్వించి, డీన్ తన కుటుంబానికి 1952లో రాసిన ఉత్తరంలో " నాటక రంగంలో అత్యుత్తమ స్కూక్ ఈ స్టూడియో. ఇక్కడ మార్లోన్ బ్రాండో, జూలీ హారిస్, ఆర్థర్ కెన్నెడీ, మిల్డ్రెడ్ డన్నోక్....వంటి గొప్ప నటులు ఉన్నారు. అతి స్వల్ప మందికే దీంట్లో ప్రవేశం లభిస్తుంది... ఒక నటుడు కు ఇదే అత్యుత్తమ అవకాశం. దీంట్లో చేరిన వారిలో అతి చిన్న వయస్సుగలవారిలో నేను ఒకడ్ని."[7] అతను వృత్తిలో అబివృద్ది సాధించడం ప్రారంభించాడు. 1950ల తొలి దశలో వచ్చిన క్రాఫ్ట్ టెలివిజన్ థియేటర్ , రాబర్ట్ మోంట్గోమేరి ప్రేసేన్ట్స్ , డెన్జెర్ ,జెనెరల్ ఎలెక్ట్రిక్ ధియేటర్ వంటి టెలివిజన్ కార్యక్రమాలలో అతను నటించాడు. ఆమ్నిబస్ (గ్లోరి ఇన్ ది ఫ్లవర్ ) అనే CBS సిరీస్ లో మనశ్శాంతి లేని ఒక యువకుడి పాత్ర పోషించాడు. ఇటువంటి పాత్రలోనే తరువాత చాలా ప్రాబల్యమైన రెబెల్ వితౌట్ ఎ కాస్ అనే చిత్రంలో అధ్బుతమైన పాత్ర పోషించాడు (ఈ వేసవిలో, 1953 కార్యక్రమం లోని "క్రేజీ మాన్, క్రేజీ అనే పాట చాలా ప్రబల్యమయింది. ఈ కార్యక్రమమే రాక అండ్ రోల్ సంగీతం వాడిన మొట్ట మొదటి TV కార్యక్రమం."). 1954లో అతను పోషించిన "బచిర్" అనే ఒక నీతిలేని ఉత్తర ఆఫ్రికా యువకుడు వేషం అతనికి మంచి పేరు తెచ్చింది. ఈ నాటకం, అందరే గైడ్ రచించిన ది ఇమ్మారలిస్ట్ అనే పుస్తకాన్ని అనుసరించి తీసినది.[9] ఈ నాటకములో డీన్ నటన చూసి అతనికి హాలివుడ్ నుంచి పిలుపులు వచ్చాయి.

ఈస్ట్ అఫ్ ఈడెన్ సవరించు

1953లో, దర్శకుడు ఎలియా కజాన్ పాల్ ఆస్బార్న్ తీస్తున్న ఒక చిత్రములో ఒక భావభరితమైన సంక్లిష్ట పాత్రలో నటించడానికి ఒక నటుడు కోసం అన్వేషిస్తున్నాడు. ఈ చిత్రం జాన్ స్టీన్బెక్ యొక్క 1952 నవలైన ఈస్ట్ అఫ్ ఈడేన్ అనే పుస్తకము యొక్క చిత్ర అనుసరణ. ఈ పెద్ద నవల ట్రాస్క్ మరియు హమిల్టన్ కుటుంబాలు మూడు తరాల గురించిన కథ. ఈ కథలో ముఖ్యంగా 1800ల మధ్యనుండి 1910ల వరకు కలిఫోర్నియా లోని సాలినాస్ వ్యాలీ లో జరిగే చివరి రెండు తరాల గురించిన కథకే ప్రాముఖ్యత ఉంటుంది.

అయితే, చిత్రం కాల్ ట్రాస్క్ పాత్ర మీదే కేంద్రీకరించబడింది; మొదట్లో, తన కవల సోదరడు ఆరోన్ కంటే ఒంటరిగా, భావోద్వేగ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిగా ఉంటాడు. అయితే, త్వరలోనే ఎక్కువ ప్రపంచ జ్ఞానం కలిగిన, వ్యాపార నేర్పులు తెలిసిన మరియు భక్తిగల తరచూ నిరశన వ్యక్తం చేస్తున్న వ్యక్తి అయిన తండ్రి (ఈ పాత్రను రేమండ్ మాసి పోషించాడు) కంటే ఎక్కువ వివేకవంతుడైన వ్యక్తిగా మారుతాడు. ఇతను కూరగాయల రేఫ్రిజేరేషన్ ను కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. తనకు దూరమైనా తన తల్లిని కాల్ కలుస్తాడు. అప్పుడు ఆమె ఒక వేశ్యా గృహం నడుతున్న ఒక మేడం (జో వాన్ ఫ్లీట్) "నాకు ఆ పాత్రకు ఒక బ్రాండో కావాలి" అని ఎలియా కజాన్ కాల్ పాత్ర గురించి చెప్పాడు. ఒస్బార్న్ డీన్ పేరును ప్రతిపాదిస్తే, డీన్ స్తీన్బెచ్క్ ను కలిశాడు; భవిష్యత్తులో నోబల్ బహుమతి అందుకున్న స్టీన్బెక్ కు దైర్యంగల డీన్ ను వ్యక్తిగతంగా నచ్చలేదు. కాని ఆ పాత్రకు డీన్ ఖచ్చితంగా సరిపోతాడు అని అనుకున్నాడు. ఆ తరువాత అ పాత్రకు పెద్దగా ప్రాబల్యం చెందని ఆ యువ నటుడును నియమించే ప్రక్రియ మొదలు పెట్టాడు; ఏప్రిల్ 8, 1954 నాడు డీన్ న్యూ యార్క్ నగరాన్ని వదిలి లాస్ ఏంజెల్స్ కు షూటింగ్ కొరకు బయిలుదేరాడు.[10][11][12]

ఈ చిత్రంలో డీన్ ప్రదర్శన రాబోయే రెబల్ వితౌట్ ఎ కాస్ చిత్రంలో జిం స్టార్క్ పాత్రలో అతని నటనను సాటి చెప్పింది. రెండూ కూడా చింత, విచారంతో కూడిన ముఖ్య పాత్రలు. అపార్ధం చేసుకోబడిన అప్రాచ్యులు. ఇద్దరూ ఒక తండ్రి లాంటి వ్యక్తి నుండి ఆమోదానికోసం తపిస్తూ ఉంటారు.

చిత్రంలో డీన్ ప్రదర్శనలో చాలా భాగం స్క్రిప్ట్ లో లేనిది. చిక్కుడు తోటలో అతని నృత్యం, ఒక ట్రైన్-కార్ పైకప్పులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు గర్భములోని బిడ్డ మాదిరిగా పటుకోవడం (ప్రక్కన ఉన్న పట్టణంలో తన తల్లిని వెతికి తిరిగి వస్తున్నప్పుడు) వంటి సన్నివేశాలు. చిత్రంలో అత్యంత ప్రబలమైన ఇంప్రోవైసేషన్ దృశ్యం: కాల్ తండ్రికి $5,000 కానుకగా ఇచ్చినప్పుడు, దానిని అతను నిరాకరిస్తున్న దృశ్యం. (తండ్రికి వ్యాపారంలో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసేందకు ఇస్తాడు) కథ ప్రకారం, అప్పుడు తన తండ్రి నుండి కాల్ పారిపోవాలి. కాని డీన్ సహజంగా మేసి వైపు తిరిగి ఏడ్చి అతన్ని వాటేసుకుంటాడు. ఈ దృశ్యం మరియు దానికి మేసి యొక్క అదిరి పోయిన ప్రతిస్పందన, ఈ రెండిటిని కజన్ చిత్రంలో అలాగే అట్టిపెట్టుకున్నారు.

ఈ పాత్రకోసం అతనికి 1955 అకాడమి అవార్డ్ లో మరణాంతరం ఉత్తమ నటుడు పురస్కారం లభించింది. అకాడమి అవార్డ్ చరిత్రలోనే ఇదే మొట్ట మొదటి మరణాంతరం నటనకు ఇచ్చిన ప్రతిపాదన. 1929లో అనధికారంగా (జీన్ ఈగిల్స్ ఉత్తమ నటి గా ప్రతిపాదించబడింది. అయితే, అప్పుడు ఎంపిక నియమాలు వేరేగా ఉండేవి.)

రెబల్ వితౌట్ ఎ కాస్సవరించు

 
రెబల్ వితౌట్ ఎ కాస్ చిత్రం ట్రైలేర్ లో డీన్

డీన్ ఈడెన్ లో తన పాత్ర తరువాత త్వరలోనే రెబెల్ వితౌట్ ఎ కాస్ లో ప్రధాన పాత్ర వహించాడు. ఆ చిత్రం యుక్తవయస్కులలో బహుళ ప్రజాదరణ పొందింది. టీనేజ్ యాన్గ్స్ట్ యొక్క ఖచ్చితమైన ప్రతిరూపంగా ఈ చిత్రాన్ని గురించి పేర్కొంటారు. యువ నటులు నటాలీ వుడ్, సాల్ మినియో, మరియు డెన్నిస్ హొప్పర్ కూడా నటించిన మరియు నికొలాస్ రే చే దర్శకత్వం వహించబడిన చిత్రమిది.

=== జేయన్ట్ ===

జేయన్ట్ అను 1956 లో డీన్ మరణానంతరం విడుదలైన చిత్రంలో, డీన్ ఒక సహాయక పాత్రధారుడిగా ఎలిజబెత్ టైలర్ మరియు రాక్ హడ్సన్ తో కలసి నటించాడు. జిమ్ స్టార్క్ మరియు కాల్ ట్రాస్క్ వలె మూసపాత్రదారుడి గా పేరుపడడాన్ని నివారించటానికి అతను ఆ పాత్ర చేయటంలో ఇష్టం చూపించాడు. ఆ చిత్రంలో, అతను జెట్ అనే టెక్సాస్ లోని ఒక ధనవంతుడైన చమురు వ్యాపారిగా నటించాడు. అతని పాత్ర గుర్తు ఉంచుకోదగినది ఎందువలనంటే అందులోని ఒక దృశ్యంలో అతని పాత్ర ముసలితనంలో ఎలా అగుపిస్తుందో అలా కనపడటానికి అతను తన జుట్టుకు రంగు వేసుకుని, కొంత భాగం జుట్టును క్షవరం చేయించుకుని తలకట్టు వెనుకకు జరిగినట్లుగా భ్రమింపచేశాడు.

జైంట్ డీన్ యొక్క చివరి చిత్రం అయింది. ఆ చిత్రం ఆఖరిలో, డీన్ ఒక తాగుబోతు వలె ఒక విందులో ప్రసంగించవలసివస్తుంది; ఈ దృశ్యాన్ని థ 'లాస్ట్ సప్పర్' గా పిలుస్తారు ఎందుకంటే అది అతను హటాత్మరణం ముందు చేసిన ఆఖరి దృశ్యం. డీన్ ఆ చిత్రం విడుదల కాక ముందే మరణించటంతో, అతను చేసిన ఆ దృశ్యంలో వీపరీతంగా గొణిగినట్లు మాట్లాడటంతో, అతని తోటి నటులు మరల రికార్డు చేయవలసి వచ్చింది.

1956 అకాడమీ అవార్డులలో, డీన్ జైంట్ లోని తన పాత్రకు మరణానంతరం రెండవ సారి అత్యుత్తమ నటునిగా అకాడమీ అవార్డుకు ప్రతిపాదనను అందుకున్నాడు.

రేసింగ్ వృత్తి మరియు 'లిటిల్ బాస్టర్డ్'సవరించు

ఈస్ట్ అఫ్ ఈడెన్ లో డీన్ కు పాత్ర లబించినప్పుడు, పంద్యానికి సిద్ధం చేసిన ఒక ఎర్ర రంగు MG TD ను కొన్నాడు. ఆ వెంటనే, ఒక తెల్ల రంగు ఫోర్డ్ కంట్రీ స్కొయర్ వుడీ స్టేషను వేగన్ ను కొన్నాడు.

డీన్ తన MG ను ఒక పోర్ష్ 356 స్పీడ్స్టర్ (చాసిస్ నంబర్: 82621) మార్చ్ 1955లో పాం స్ప్రింగ్స్ రోడ్ రేసస్ లో, ఒక డ్రైవర్ అనర్హుడు అయిన తరువాత, డీన్ రెండవ స్థానంలో వచ్చాడు; మే 1955లో బకర్స్ ఫీల్డ్ లో మూడవ స్థానంలో వచ్చాడు. తరువాత అదే నెలలో, సాంటా మోనికా రోడ్ రేసస్ లో నాల్గవ స్థానంలో వెళ్తూ ఉండగా, ఇంజిన్ చెడి పోవడంతో వైతొలిగాడు.

రెబల్ వితౌట్ ఎ కాస్ చిత్రీకరణ సమయములో, తన 356 స్పీడ్స్టర్ ను ఒక పోర్ష్ 550 స్పైడర్ తో మార్పిడి చేసుకున్నాడు. మొత్తం మీద 90 స్పైడర్ బండ్లె తయారీ చేయబడ్డాయి. జయంట్ చిత్రీకరణ సమయములో ఒప్పందం ప్రకారం అతను పందాలలో పాల్గొనకుండా నిషేదించబడ్డాడు. ఆ చిత్రీకరణ ముగిసిన తరువాత, మరల పంధయాలలో పాల్గొనడానికి ఈ అడ్డంకి లేకపోయింది. పోర్ష్ ను తాత్కాలికంగానే పెట్టుకున్నాడు. దానికంటే మెరుగైన లోటస్ Mk.X డెలివరి ఆలస్యం అయింది. ఈ లోపల సాలినాస్, కలిఫోర్నియా లో జరిగే పందాలలో పాల్గొనడానికి అతనికి ఒక కారు అవసరమైంది.

డీన్ యొక్క 550 ను జార్జ్ బారిస్ కావలసిన విధముగా మార్చాడు. ఇతనే, బాట్మొబైల్ ను కూడా రూపకల్పన చేసాడు. డీన్ యొక్క పోర్ష్ ముందు, వెనుక మరియు పక్కన 130 అనే నంబర్ వ్రాయబడింది. కర్ సీటింగ్ లో ఒక టార్టాన్ ఉండేది, వెనుక చక్రం లో రెండు ఎర్ర గీతలు ఉండేవి. జయంట్ చిత్రంలో అతనికి భాషా శిక్షణ ఇచ్చిన బిల్ హిక్మన్ ఈ కారుకు 'లిటిల్ బాస్టార్డ్' అని ముద్దుపేరు పెట్టాడు. కార్ పెయింటర్ మరియు పిన్ స్ట్రిపేర అయిన డీన్ జేఫ్రీస్ ను కార్ మీద లిటిల్ బాస్టర్డ్ అని పెయింట్ చేయమని అడిగాడు. ఒక రెస్టారంట్ బయట అలెక్ గిన్నస్ ను డీన్ పరిచయం చేసుకుని, తన స్పైడర్ ను ఒక సారి చూడమని కోరాడు. అది ఒక 'దుష్ట' కారులాగా గినస్కికి అనిపించి, డీన్ తో ఈ విధంగా చెప్పాడు : 'ఈ కారులో ఎక్కుతే వచ్చే వారం ఈ పాటికి మరణించి ఉంటావు' డీన్ మరణానికి ఏడు రోజుల ముందు సెప్టెంబర్ 23, 1955 నాడు ఇది జరిగింది.[13][14]

మరణంసవరించు

సెప్టెంబర్ 30, 1955 నాడు డీన్ మరియు మెకానిక్ రోల్ఫ్ వుతేరిచ్ ఇద్దరు సాలినాస్, కలిఫోర్నియా లో జరగబోయే ఒక క్రీడా కారుల పందెంలో పాల్గొనడానికి కాంపిటిషన్ మోటార్స్ నుండి బయిలుదేరారు. ఆ రోజు ప్రొద్దునే ఆ పందాన్ని తన పోర్స్చ్ 550 స్పైడర్ కారును సిద్ధం చేశారు. పోర్ష్ ను తన క్రొత్త ఫోర్డ్ కౌంటి స్కొయర్ స్టేషను వేగన్ తో లాగి తీసుకు వెళ్దామని ముందుగా అనుకున్నాడు. దాంట్లో హిక్మాన్ మరియు డీన్ రేసులలో పాల్గొనడం గురించి ఒక కథనం చేస్తున్న ఫోటోగ్రాఫర్ సాన్ఫోర్డ్ రోత్ ఇద్దరూ వెళ్ళవలసి ఉంది. ఆఖరి నిమిషములో, కారు తో ఆలవాట కావడానికి మరింత సమయం కావాలనే ఉద్దేశంతో డీన్ స్పైడర్ ను నడిపాడు. 3:30 p.m. సమయంలో మేట్లేర్ స్టేషను, కేర్న్ కౌంటీ లో 55 mph (89 km/h) జోన్ లో కారు నడిపినందుకు 65 mph (105 km/h) డీన్ కు టికట్ ఈయబడింది. ఫోర్డ్ నడుపుతున్న డ్రైవర్ కు కూడా 20 mph (32 km/h) వేగ పరిమితి దాటినందుకు టికట్ ఇవ్వబడింది. ట్రైలర్ ను తీసుకువెళుతున్న అన్ని వాహనాలకు మాదిరిగానే ఆ వేగ పరిమితి 45 mph (72 km/h) ఉంది. తరువాత, ఫోర్డ్ కంటే బాగా ముందుకు వెళ్లి పోయి, లాస్ట్ హిల్స్ లోని బ్లాక్వేల్స్ కార్నర్ లో ఇంధనం కోసం ఆగారు. అప్పుడు తోటి పోటీదారుడు అయిన లాన్స్ రేవెంట్లో ను కలిశారు.

చోలెం, కలిఫోర్నియా సమీపంలోని యు.ఎస్. రూట్ 466 (తరువాత స్టేట్ రూట్ 46) కు పశ్చిమ దిశగా డీన్ కారును నడుపుతూ ఉన్నప్పుడు, ఎదురు దిశనుండి ఒక నలుపు-తెలుపు రంగుల 1950 ఫోర్డ్ కష్టం ట్యూడర్ కూపే వచ్చింది. ఆ కారును 23 సంవత్సరాలు వయస్సు గల కాల్ పోలి విద్యార్థి అయిన డోనాల్డ్ టర్నప్సీడ్ స్టేట్ రూట్ 41 కు రావడానికి ప్రయత్నించి డీన్ రావడం చూడకుండా ఆ లేనులోకి క్రాస్ చేశాడు. రెండు కార్లు దాదాపు డీ కొట్టుకున్నాయి. అక్టోబర్ 1, 2005 నాటి లోస్ ఏంజెలెస్ టైమ్స్ కథనం ప్రకారం,[15] కలిఫోర్నియా హైవే పాట్రోల్ అధికారి రాన్ నెల్సన్, అతని భాగస్వామి ఇద్దరూ పాసో రోబెల్స్ లో కాఫీ విరామం ముగిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రమాద స్థలానికి రమ్మని కబురు వచ్చింది. వారు వచ్చేసరికి, స్పృహలో లేని, కాని భారంగా ఊపరి పీల్చుకుంటున్న డీన్ ను ఒక ఏంబులన్స్ లో ఎక్కిస్తూ ఉన్నారు. వుతేరిచ్ కారు నుండి బయట విసిరేయబడ్డాడు. దవడ విరిగి పోయి గాయాలు ఏర్పడినా ప్రాణంతో బయటపడ్డాడు. డీన్ ను పాసో రోబిల్స్ వార్ మెమోరియల్ హాస్పిటల్ కు తీసుకువెళ్ల బడ్డాడు. 5:59 p.m. గంటకు అత్యవసర విభాగ వైద్యుడు డీన్ మరణించినట్లుగా ప్రకటించారు. అతని ఆఖరి మాట, ప్రమాదానికి కొంత ముందు: "ఆ వ్యక్తి ఆపవలసింది.... మనల్ని చూసే వాడు."[16]

 
46 మరియు 41 రహదారుల కూడలి, ఈనాటి దృశ్యం

పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం, డీన్ తల ఎదురు కారు యొక్క ముందు గ్రిల్ కు కొట్టుకుంది. ఈ తాకిడి, ఆ తరువాత ఏర్పడిన క్రాష్ వలన డీన్ మెడ విరిగి, దవడ, చేతులు కాళ్ళలో పలు ఫ్రాక్చర్లు ఏర్పడి లోపలి భాగాలలో పెద్ద గాయాలు ఏర్పడ్డాయి. ప్రమాదం జరిగి పది నిమిషాల తరువాత ఏంబులన్స్ లో మరణించినట్లు నమ్మబడుతుంది. వేరొక కారులో పందానికి వస్తున్న ఒక ఫోటోగ్రాఫర్ మిత్రుడు, డీన్ కార్లో మరణిస్తూ ఉండగా ఫోటోలు తీశాడని చాలా సంవత్సరాలు పుకార్లు పుట్టాయి. అయితే అటువంటి ఏ ఫోటోలు బయటకు రాలేదు.

ప్రమాద సమయములో డీన్ అతివేగంగా కారు నడుపుతున్నాడనే మాట అతను మరణించి దశాబ్దాల పాటు చెప్పబడుతూ ఉంది. అయితే దీనికి బిన్నంగా, నెల్సన్ ఈ విధంగా చెప్పారు: "డీన్ శరీరం ఉన్న స్థితి బట్టి అతను సుమారు 55 mph (88 km/hr) వేగములోనే వెళుతూ ఉండి ఉంటాడని చెప్పవచ్చు".[15] టర్నప్సీడ్ కు నుదురు, ముక్కు భాగాలలో గాయాలు ఏర్పడ్డాయి. ప్రమాదానికి ఇతని మీద పోలీసు చర్య తీసుకోలేదు. ప్రమాదము జరిగిన వెంటనే అతన్ని తులరే అడ్వాన్స్-రిజిస్టర్ పత్రిక ప్రశ్నించింది. అప్పడు తాను డీన్ కారు వస్తున్నా విషయాన్ని చూడలేదు అని చెప్పాడు. కాని దాని తరువాత, ఈ విషయము గురించి బహిరంగంగా మాట్లాడటానికి నిరాకరించాడు. తరువాత అతను ఒక విద్యుత్ సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారాన్ని నిర్వహించాడు. 1995లో, ఊపిరితిత్తుల కాన్సర్ తో మరణించాడు.[17] వుతేరిచ్, అనేక సార్లు ఆత్మహత్య యత్నాలు చేసి, 1981లో జర్మనిలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదములో మరణించాడు.

జయంట్ చిత్రాన్ని తీస్తున్న సమయములో రెబల్ వితౌట్ ఎ కాస్ చిత్రాన్ని ప్రాబల్యం చేయడానికి నటుడు గిగ్ యంగ్ తో ఒక చిన్న బేటిని డీన్ చిత్రీకరించాడు. ఇది వార్నేర్ బ్రోస్. ప్రేసేన్ట్స్ [18] లో ఒక సన్నివేశము కొరకు తీయబడింది. దీంట్లో, "మీరు కాపాడే ప్రాణం మీదే కావచ్చు" అనే ప్రబల వాక్యానికి బదులుగా "మీరు కాపాడే ప్రాణం నాదే కావచ్చు" అని అడ్-లిబ్ చేసాడు.[sic][19] డీన్ హటాత్తుగా మరణం వలన స్టూడియో దానిని మరల చిత్రీకరించవలసి వచ్చింది. ఈ సన్నివేశం ఎప్పటికి బయట ప్రసారణ చేయబడలేదు. అయితే గతములో అనేక మంది ఈ చిత్రీకరణ గురించి, ఒక ప్రజా సేవ ప్రకటన అని పొరపాటుగా ప్రస్తావించారు. (ఈ భాగాన్ని రెబల్ వితౌట్ ఎ కాస్ యొక్క 2001 VHS మరియు 2005 DVD విడుదల లో చూడవచ్చు).

స్మారక చిహ్నంసవరించు

దస్త్రం:JamesDeanMemorialCholame.jpg
చాలెం లో ఉన్న జేమ్స్ డీన్ స్మారక చిహ్నం. ఈ చెట్టుకు సుమారు 900 యార్డులు తూర్పు దిశలో డీన్ మరణించాడు.

ఫైర్మౌంట్, ఇండియానా లోనని పార్క్ సిమెట్రీలో జేమ్స్ డీన్ పాతిపెట్టబడ్డాడు. 1977 లో చోలెం, కలిఫోర్నియా లో ఒక డీన్ స్మారక చిహ్నం నిర్మించబడింది. ఒక స్వర్గ చెట్టు చుట్టూ ఉన్న ఈ అందమైన శిల్పం కాంక్రీట్ మరియు స్టెయిన్లెస్ స్టీల్ తో చేయబడింది. ఈ చెట్టు చొలెం పోస్ట్ ఆఫీస్ ముందు ఉంది. ఈ శిల్పం జపాన్ లో తయారీ చేయబడి, చోలెం కు తరలించబడింది. ఈ శిల్పంతో పాటు ఈ ప్రాజెక్ట్ యొక్క ఉపకారి అయిన సిటా ఒనిషి కూడా వచ్చారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం, ఒనిషి ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. ఇది, ప్రస్తుతం కొన్ని వీధి గుర్తులు మరియు మెరుస్తున్న పసుపు సిగ్నల్ లు సమీపంలో ఉంది. ప్రమాదం జరిగిన అసలు కూడలి ఇప్పుడు పచ్చని పోలముగా ఉంది. రెండు వీధులకు మార్పులు చేసి ఈ కూడలిని సురక్షితం చేశారు. సెప్టెంబర్ 2005లో, చోలెంలోని 41 మరియు 46 వ రహదారుల కూడలిని (సాన్ లూయిస్ ఒబిస్పో కౌంటి), 50వ వర్ధంతి సందర్పముగా జేమ్స్ డీన్ మెమోరియల్ హైవే అని పేరు పెట్టారు. (కూడలి యొక్క మ్యాపులు35°44′5″N 120°17′4″W / 35.73472°N 120.28444°W / 35.73472; -120.28444)

చోలెం లోని జాక్ రాంచ్ కేఫ్ గోడలో కొన్ని డీన్ ఫోటోలు ఉన్నాయి గాని స్మారక చిహ్నము ఏమి లేదు.

శిల్పములో జీన్ పుట్టిన మరియు మరణించిన గంటలు మరియు తేది వివరాలు చెక్కబడి ఉన్నాయి. దీనితో పాటు, డీన్ అత్యంత సన్నిహితుడైన స్క్రీన్ రచయిత విల్లియం బాస్ట్ చేతి వ్రాతలు ఉన్నాయి. దాంట్లో డీన్ కు ఇష్టమైన అంటోయిన్ డి సెయింట్ ఎక్సుపెరి తీసిన ది లిటిల్ ప్రిన్స్ చిత్రంలోని మాటలు —"వాట్ ఈస్ ఎసెన్షియల్ ఈస్ ఇన్విసిబిల్ టు ది ఐ." అనే మాటలను బాస్ట్ వ్రాశాడు.

వ్యక్తిగత జీవితంసవరించు

విల్లియం బాస్ట్ జీన్ యొక్క అత్యంత సన్నిహత స్నేహితులలో ఒకరు. దీనిని డీన్ కుటుంబసభ్యులు కూడా అంగీకరించారు.[20] డీన్ జీవిత చరిత్రను మొట్ట మొదటి రచించిన బాస్ట్ (1956)[21] UCLA లో డీన్ కు రూంమేట్ గా ఉన్నాడు. తరువాత న్యూ యార్క్ లో కూడా రూంమేటుగా ఉన్నాడు. డీన్ యొక్క చివరి ఐదు సంవత్సరాల కాలములో డీన్ తో బాగా సన్నిహతంగా ఉన్నాడు. డీన్ మరణానంతరం, తానూ డీన్ ఇద్దరూ ప్రేమికులమని చెప్పాడు.[22]

డీన్ వృత్తి తోలి దశలో, వార్నర్ బ్రదర్స్ తో ఒప్పందంలో సంతకం చేసిన తరువాత, వాళ్ళ ప్రజా సంబంధాల విభాగం వారు డీన్ కు పలువురు యువ నటీమణులతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఈ నటీమణులందరూ కూడా డీన్ యొక్క హాలివుడ్ ఏజెంట్ అయిన డిక్ క్లేటన్ యొక్క వాడుకదారులే. స్టూడియో ప్రెస్ విడుదలలో డీన్ ను ఇద్దరు నటులు రాక్ హడ్సన్ మరియు టాబ్ హంటర్ లతో కలిపాయి. వీళ్ళను 'అర్హతగల బ్రహ్మచారులగా' వర్ణించి, ఒకే స్త్రీ తో పూర్తిగా ఉండి పోవడానికి సమయం దొరకని వారు వీరు అని వ్రాశాయి" 'తమ చిత్ర రిహర్సాల్ లు తమ వివాహ రిహర్సల్ లకు అడ్డం వస్తున్నాయని వీరు చెపుతున్నారు.'"[23][23]

డీన్ కు ఒక యువ ఇటలీ నటీమణి పియర్ ఎంజలి తో ఉన్న సంబంధమే చాలా ఎక్కువగా చెప్పబడింది. ఆమె ది సిల్వర్ చాలిస్ చిత్ర షూటింగ్ లో ప్రక్కనే ఉన మరో వార్నేర్ సెట్టులో ఉన్నప్పుడు ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. వీరు ప్రేమ కానుకగా నగలను ఇచ్చిపుచ్చుకునేవారు.[24] ఈ సంబంధం ఎంజేలి తల్లికి ఆమోదయోగ్యంగా లేదని చెప్పుకునేవారు. ఎందుకంటే డీన్ ఒక రోమన్ కేథలిక్ కాదు కనుక. ఈస్ట్ అఫ్ ఈడెన్ దర్శుకుడు ఎలియా కజన్ తన స్వీయచరిత్రలో ఈ విధముగా వ్రాశాడు: డీన్ కు స్త్రీలతో ఎటువంటి విజయము కలిగి ఉండదు అనే భావన సరి కాదు. అదే సమయములో డీన్, ఏంజెలి మధ్య "ప్రేమ" ఉండేది. వాళ్ళు ఇద్దరూ డీన్ డ్రెస్సింగ్ రూంలో శృంగారంలో ఉన్నప్పుడు నేను విన్నాను. కొంత కాలం డీన్-ఏంజెలి ప్రేమ గురించిన కథలను డీన్ స్వయంగా ప్రోత్సాహించాడు. పత్రికలలో గాసిప్ వ్రాసే అనేక విలేకర్లకు మరియు తోటి-తార జూలీ హారిస్ కు తానూ ఏంజెలి తో పిచ్చి ప్రేమలో ఉన్నట్లు డీన్ చెప్పాడు. అక్టోబర్ 1954లో, ఇటలి-అమెరికా గాయకుడు విక్ డమోన్ తో తన వివాహ నిశ్చితార్ధాన్ని ఏంజలి హటాత్తుగా ప్రకటించింది. ఈ వార్తకు డీన్ అసహనం ప్రకటించారు.[25] మరుసటి నెలలో ఏంజలి డామోన్ ను వివాహం చేసుకుంది. డీన్ లేదా అతని లాగా దుస్తులు దరించిన ఒక వ్యక్తి వీధికి అవతల నుండి ఒక మోటార్ సైకిల్ లో ఆ వివాహాన్ని చూశాడని గాసిప్ కాలంలో వ్రాశారు. అయితే, ఈ విషయం గురించి బాస్ట్ డీన్ ను అడిగినప్పుడు, అంత 'తెలివిలేని' పనిని తను చేయనని చెప్పాడు. పాల్ అలెక్సాన్డర్ మాదిరిగా బాస్ట్ కూడా డీన్ ఎంజలి సంబంధం కేవలం ప్రచారానికోసమే అని నమ్మాడు.[26][27] ఈ సంబంధం గురించి పియర్ ఏంజెలి తన శేష జీవితంలో ఒకే ఒక సారి మాత్రమే మాట్లాడింది. బీచిలో డీన్ తో తన ప్రేమ సమావేశాల గురించి ఒక బేటిలో వివరంగా వర్ణించింది. అయితే ఇవి ఊహాగానము వలె అనిపించేవి.[28] బాస్ట్ కూడా అలాగే భావించాడు.[29]

తనకు డీన్ కు స్వల్ప కాలం న్యూ యార్క్ లో ప్రేమవ్యవహారం ఉండిందని నటి లిజ్ షెరిడన్ చెప్పింది. ఈ విషయాన్ని వివరంగా తన చరిత్రలో వ్రాసిన ఆమె, డీన్ కు రోజర్స్ బ్రాకెట్ తో శృంగార వ్యవహారం ఉండేదని వ్రాసింది. అలాగే, ఈ విషయం తనకు నచ్చలేదని వ్రాసింది.[30] అయితే, ఇది ఒక నిజమైన ప్రేమ కాకపోవచ్చని బాస్ట్ అభిప్రాయపడుతున్నాడు. డీన్, షేరిడియన్ కలిసి ఎక్కువ సమయం గడపలేదని పేర్కున్నాడు.[7]

డీన్ ఆ డ్రాఫ్ట్ ను నివారించటానికి తాను ఒక స్వలింగసంపర్కుడిగా నమోదు చేసుకున్నాడు. ఆ రోజులలో అది ఒక మానసిక రుగ్మత గా US ప్రభుత్వముచే నిర్ణయించబడినది. తన ఉద్ధ్యేశము గురించి ప్రశ్నించగా అతను, "ఏది ఏమైనా నేను ఒక చేయి వెనుకకు కట్టబడి ఉంచుకుని జీవితంలో ప్రయాణం చేయను." అని అన్నట్లు చెప్పబడింది.[31]

ఉత్తరదాయిత్వంసవరించు

ఉన్నతమైన హొదా మరియు ప్రాచుర్యములో ఉన్న సంస్కృతిపై ప్రభావముసవరించు

డీన్ యొక్క ప్రధాన చిత్రాల కాలంలో అమెరికాకు చెందిన యువత తమను అతనితో పోల్చుకుని, అతని పాత్రలను అనుకరించారు. ముఖ్యంగా రెబల్ వితౌట్ ఎ కాస్ లో : ఒక యుక్తవయస్కుడి వలె, స్నేహితులతో సహా ఎవరూ కూడా అతనిని అర్ధం చేసుకోలేని పరిస్థితిలో ఇరుక్కుని ఉన్నట్లున్న పాత్ర. జో హైయామ్స్ అంటారు డీన్ " రాక్ హడ్సన్ మరియు మోంట్ గోమరీ క్లిఫ్ట్ వంటి అరుదైన నటులలో ఒకడని, అతని నుండి స్త్రీలు, పురుషులు కూడా సమానంగా సమ్మోహితులవుతారని అన్నారు. మార్జోరీ గార్బార్ ప్రకారం, ఈ నైపుణ్యం "పేరు పెట్టలేని ఒక అదనపు అర్హత అదే అతనిని నటశ్రేష్టుడు చేస్తుంది."[32] డీన్ యొక్క ఐకాన్ స్థాయి ఆ కాలంలోని మనశ్శాంతి లేకుండా తిరుగుతున్న యువజనుల[33] యొక్క సామాజిక స్పృహకు మరియు తెర మీద డీన్ ప్రదర్శించిన యెన్డ్రోగైని భావానికి అద్దం పట్టిందని ప్రజల యొక్క భావన.[33] రెబల్ వితౌట్ ఎ కాస్ లో తెలివితప్పిన సాల్ మినియో పై డీన్ చూపించిన ప్రేమ అనుబూతి స్వలింగ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. గే టైమ్స్ పాటకుల అవార్డ్స్ డీన్ ను పురుష స్వలింగ ఐకాన్ అని ప్రశంసించింది."[34]

అనేక పాటలలో డీన్ పేరు వస్తుంది. వాటిలో కొన్ని: దట్ హ్యాండ్సం డెవిల్ యొక్క "జేమ్స్ డీన్", ది ఈగిల్స్ యొక్క "జేమ్స్ డీన్", ది బీచ్ బాయ్స్ యొక్క "ఎ యంగ్ మాన్ ఈస్ గాన్", లేడి గాగా యొక్క "స్పీచ్లెస్", డేవిడ్ ఎసేక్స్ యొక్క "రాక్ ఆన్", డాన్ మక్లీన్ యొక్క "అమెరికన్ పై", బిల్లీ జోయల్ యొక్క "వీ డింట్ స్టార్ట్ ది ఫయర్", స్యుడ్ యొక్క "డాడీస్ స్పీడింగ్", R.E.M. యొక్క "ఎలేక్ట్రోలైట్", సెల్ఫ్ యొక్క "ఫ్లిప్-టాప్ బాక్స్", లో రీడ్ యొక్క "వాక్ ఆన్ ది వైల్డ్ సైడ్", పెర్ఫెక్ట్ యొక్క "బ్లా బ్లా బ్లా" (బ్లా బ్లా బ్లా), నికెల్బ్యాక్ యొక్క "రాక్స్టార్", LFO[35] యొక్క "గర్ల్ ఆన్ టివి", బ్లాక్ వీల్ బ్రిడ్స్ యొక్క "హలో మై హీట్" మరియు పార్షియా యొక్క "Chciałbym umrzeć jak జేమ్స్ డీన్" (అర్ధం. ఐ విష్ టు డై లైక్ జేమ్స్ డీన్). అంతే కాక, టెలివిజన్ కార్యక్రమాలు, చిత్రాలు, పుస్తకాలు మరియు నవలలలో అతను తరచూ ప్రస్తాపించబడుతాడు. Degrassi: The Next Generation లో ఒక ఎపిసోడ్ లో, లిబెర్టి అనే పాత్ర తిరుగుబాటు మనస్తత్వం కలిగిన శాన్ కేమరాన్ ను జేమ్స్ డీన్ తో పోల్చుతాడు. హ్యాప్పీ డేస్ అనే సిట్కాంలో ఫోన్జీ తన బీరువాలో తన అద్దం దగ్గర డీన్ యొక్క చిత్రపటాన్ని పెట్టుకుంటాడు. గ్రీస్ చిత్రంలో కూడా రిజ్జో యొక్క గోడలో డీన్ యొక్క చిత్రపటం ఉంటుంది. హారి టర్టిల్డోవ్ వ్రాసిన హోంవార్డ్ బౌండ్ అనే ప్రత్యామ్నాయ చరిత్ర పుస్తకంలో డీన్ కారు ప్రమాదంలో మరణించడం లేదు. సేవింగ్ ప్రైవేట్ రయాన్ ఆధారంగా రెస్క్యూయింగ్ ప్రైవేట్ రాన్ఫాల్ అనే చిత్రంతో సహా మరిన్ని చిత్రాలలో నటించినట్టు వ్రాశారు.

డీన్ యొక్క ఎస్టేటు ఇంకా కూడా దాదాపుగా $5,000,000 సంవత్సరానికి సంపాదిస్తున్నట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.[36]

శృంగార విషయాల గురించి ఊహాగానాలుసవరించు

ఈనాడు డీన్ ను ఒక చిహ్నంగా పరిగణిస్తున్నారంటే దానికి కారణం అతను తన జీవితంపై చేసిన పరిశోధన, అందులో అతని ద్వివిధ శృంగారతత్వం కూడా ఉన్నది.[34] డీన్ కు స్త్రీలు మరియు పురుషులతో శృంగార సంబంధాల గురించి ఎన్నో సంఘటనలు చెప్పబడ్డాయి.

విల్లియం బాస్ట్, డీన్ యొక్క ఆత్యంత సన్నిహిత స్నేహితులలో ఒకరు,[20] డీన్ యొక్క మొదటి జీవితచరిత్ర రచయిత (1956).[37] అతను ఇటీవల తన మొదటి పుస్తకములో క్రొత్త విషయాలను బట్టబయలు చేసి, దానిని ప్రచురించాడు. సంవత్సరాల తరబడి ప్రశ్నగా మిగిలిన విషయమైన అతనికి డీన్ కు మధ్య గల శృంగార సంబంధాన్ని[38][39], చివరకు అతను ఒప్పుకున్నాడు.[22] అతని రెండవ పుస్తకములో, బాస్ట్ వారికి తటస్థపడిన క్లిష్టమైన పరిస్థితులను వివరించి, డీన్ యొక్క ఇతర స్వలింగసంపర్క సంబంధాలను కూడా వెల్లడి చేశాడు. ముఖ్యంగా ఆ నటుడి స్నేహితుడైన రోజర్స్ బ్రాకెట్ తో స్నేహము, డీన్ ను ఉత్సాహపరచిన రేడియో నిర్మాత అయిన అతడు, ఇతని వృత్తిలో సహాయపడి, మంచి ఉపయోగకరమైన వృత్తిపరమైన పరిచయాలను కలిగించాడు.[40]

బాస్ట్ బైపోలార్ డిప్రెషన్ డీన్ లో ఉన్నట్లు, అదీ అతని విపరీత ప్రవర్తనకు మరియు మనఃస్థితిలో పెనుమార్పులకు కారణమని తెలిపాడు.[41] వారి సంబంధము గురించి అతనిచ్చిన వివరణలో, డీన్ విపరీతమైన కోరిక కలిగి ఉండి (బాస్ట్ వైపు) మరియు అతని నిరాకరణ నుండి తనను రక్షించుకోవటానికి అవసరం ఏర్పడి లేక ఏదైనా బలహీనతను బయల్పరుచుకోవటానికి ఇష్టము లేకపోవటం చేత ఇబ్బందులపాలయిన వ్యక్తిత్వమును ప్రతిబింబించాడు. జాన్ హౌలేట్ ప్రకారం, డీన్ డిస్లేక్సియా తో కూడా బాధపడుతున్నట్లు, అది అతని మేధోపరమైన భయాలను మరింత పెంచిందని తెలిపాడు.[42] అతని మరణానికి కొలది కాలం ముందు, డీన్ తన పెంపుడు పిల్లి అయిన మార్కస్ ను కూడా ఇచ్చివేసి, ఇలా అన్నాడు: "నేను అనుకుంటున్నాను, నేను ఒక రాత్రి బయటకు వెళ్లి మరల తిరిగి ఇంటికి రానని."[43] బాస్ట్ కూడా డీన్ విపరీతంగా తాగుడికి మరియు మత్తుమందులకు రెబల్ వితౌట్ ఎ కాస్ చిత్రం నిర్మిస్తున్నపుడు అలవాటు పడటం చూశాడు.[44]

పత్రికావిలేఖరి 0}జో హయామ్స్ ప్రకారం డీన్ కు సంబంధించిన ఏ స్వలింగ సంపర్కం అయినా, ఖచ్చితంగా "వ్యాపారం కొరకే", వృత్తిపరంగా అతని ఎదుగుదల అవసరానికి మాత్రమే. వాల్ హాల్లీ గమనించినదాని ప్రకారం, హాలేవుద్ జీవితచరిత్ర రచయిత లారెన్స్ J.క్విర్క్, గే హాలీవుడ్ రచయిత మైక్ కొన్నోల్లీ "ఆత్యంత ప్రాచుర్యం చెందిన యువ నటులు, రాబర్ట్ ఫ్రాన్సిస్, గై మాడిసన్, అంతోనీ పెర్కిన్స్, నిక్ ఆడమ్స్ మరియు జేమ్స్ డీన్ వంటివారికి కూడా అపవాదు అంటింది."[45] అయినా కూడా, ఆ "వ్యాపారం మాత్రమే" అను నినాదం బాస్ట్[22] మరియు ఇతర డీన్ జీవితచరిత్ర రచయితలచే వాదించబడింది.[46] డీన్ తో తన సంబంధం బాస్ట్ చెప్పిన వివరణ మాత్రమే కాక, డీన్ యొక్క తోటి బైకేర్ మరియు "నైట్ వాచ్" సభ్యుడు జాన్ గిల్మోర్ తాను మరియు డీన్ కలసి స్వలింగాసంపర్కనా విధానాల గురించి న్యూయార్క్ లో "పరిశోధించారని", మరియు అప్పటికే ఇరవైలలో ఉన్న డీన్, దీనిని ఒక "వ్యాపారమార్గంగా" తాను వృత్తిలో ఎదగటానికి ఎంచుకున్నాడని భావించాడు.[47]

తనే ఒక స్వలింగ సంపర్కి అయిన చిత్రకథ రచయిత మరియు 1950ల మరియు 1960ల గే సమాజంలో ఒకరైన గావిన్ లాంబెర్ట్, డీన్ ను ఒక స్వలింగ సంపర్కి అని చెప్పాడు. రెబెల్ దర్శకుడు నికోలస్ రే కూడా డీన్ ఒక స్వలింగ సంపర్కి అని చెప్పాడు.[48] అంతే కాక, విల్లియం బాస్ట్ మరియు జీవితచరిత్ర రచయిత పాల్ అలెక్జాండర్ కూడా డీన్ ఒక స్వలింగ సంపర్కి అనే నిర్ణయానికి వచ్చారు. డీన్ "ఖచ్చితంగా బైసెక్సువల్" అనే నిర్ణయానికి జాన్ హౌలేట్ వచ్చాడు.[26][49][50] డీన్ యొక్క ఈ శృంగారతత్వాన్ని "ప్రయోగాత్మకం" అని జార్జ్ పెర్రీస్ స్వీయచరిత్ర చెప్పుతుంది.[51] అయినా, డీన్ కు పెస్టార్ డి వీర్డ్ తో ఉన్న సంబంధంలో శృంగారం కూడా ఉండేది అని హ్యామ్స్ మరియు పాల్ అలెక్సాండర్ పేర్కున్నారు.[26][52] గే బార్లు, అలవాట్లు గురించి డీన్ కు తెలుసు అని బాస్ట్ కూడా చెపుతున్నాడు.[53] వీటి మూలాన, రాబర్ట్ అల్డ్రిచ్ మరియు గేరి వోతేర్స్పూన్ రహించిన హూ ఇస్ హూ ఇన్ కాన్టెంపరరి గే అండ్ లెస్బియన్ హిస్టరీ: ఫ్రం వరల్డ్ వార్ II టు ది ప్రెసెంట్ డే (2001) అనే పుస్తకములో జేమ్స్ డీన్ ను కూడా చేర్చారు .

థ "కర్స్" ఆఫ్ "లిటిల్ బాస్టర్డ్"సవరించు

డీన్ మరణానంతరం, అతని పోర్ష్ 550 స్పైడర్ శాపగ్రస్తమైనట్లుగా ఒక "కథనం" సృష్టించబడినది. అతని మరణానంతరం అది అనేకమంది మరణానికి మరియు గాయపడడానికి కారణంగా భావించబడినది.

ఈ కథ యొక్క కథనం ఈ క్రింది విధంగా ఉంటుంది:

ప్రముఖ కార్ కస్టమైజేర్ అయిన జార్జ్ బ్యారిస్ ఈ శిధిలాలను $2,500 కు కొన్నాడు. అయితే, అది ట్రైలర్ నుండి జారిపడి ఒక మెకానిక్ కాలు విరిగింది. దానికి కొలది రోజుల ముందే, బ్యారిస్ ఇంజన్ ను ట్రోయ్ మఖేన్రి కు డ్రైవ్-ట్రైన్ ను విల్లియం ఎస్చ్రిడ్ కు అమ్మాడు. వీళ్ళిద్దరూ, ఒక రేసింగ్ పోటీ లో పాల్గొన్నప్పుడు, ట్రాయ్ మక్ హెన్రి అతని వాహనం అదుపు తప్పి, ఒక చెట్టుకు గుద్దుకొని, అతను అక్కడికక్కడే చనిపోతాడు. విల్లియం ఎస్క్రిడ్ వాహం ఒక మలుపులో తిరుగుతున్నప్పుడు బోర్లాపడి, అతనికి పెద్ద గాయాలు ఏర్పడుతాయి. తరువాత బారిస్ రెండు టైర్లను అమ్మాడు, ఆ రెండూ సరిగ్గా పని చేయలేదు. డీన్ కు జరిగిన ప్రమాదంలో టైర్లను దెబ్బ తినలేదు. అయితే, ఆ రెండూ ఒకే సారి పేలి పోయి కొనుక్కున్న వారి వాహనం రోడ్డు నుండి దారి తప్పుతుంది. తరువాత, కారు నుండి భాగాలను దొంగిలించడానికి ప్రయత్నించిన ఇద్దరు యువ భవిష్యత్తు దొంగలకు గాయాలు ఏర్పడుతాయి. ఒక వ్యక్తి పోర్ష్ నుండి స్టియరింగ్ వీల్ ను దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు అతని చెయ్యి విరిగి పోతుంది. తరువాత, రక్తపు మరకలతో ఉన్న ముందు సీటును దొంగిలించడానికి ప్రయత్నించిన మరొక వ్యక్తికి కూడా దెబ్బ తగులుతుంది. ఇంకా తట్టుకోలేక బారిస్ "లిటిల్ బాస్టార్డ్" ను వదిలేశామని అనుకుంటాడు. కాని కలిఫోర్నియా హైవే పాట్రోల్ (CHP) ఆ శిధిలమైన కారును తమకు ఇచ్చేయమని, తాము దాన్ని రహదారి సురక్షిత ప్రదర్శనకు వాడతామని అడిగారు.CHP ఈ కారును ప్రదర్శిస్తున్న తొలి ప్రదర్శనలోనే సమస్యలు వచ్చాయి. స్పైడర్ ను భద్రపరిచిన గ్యారేజ్ లో అగ్ని ప్రమాదం ఏర్పడి అన్ని నాశనమయి పోతాయి. అయితే, కారుకు మాత్రం ఎటువంటి హాని జరగలేదు. సాక్రమెంటో హై స్కూల్ లో జరిగిన రెండవ ప్రదర్శనలో కారు క్రింద పడడంతో ఒక విద్యార్థి నడుము విరుగుతుంది. "లిటిల్ బాస్టార్డ్" ను రవాణా చేస్తున్న సమయములో అనేక సార్లు సమస్యలు వచ్చాయి. సాలినాస్ కు తీసుకు వెళ్తున్నప్పుడు, ఈ వాహనాన్ని తీసుకువెళ్తున్న ట్రక్ అదుపు తప్పి, డ్రైవర్ బయట పడతాడు. అప్పుడు, క్రిందకు జారి పడిన పోర్ష్ క్రింద నలిగిపోతాడు. రెండు వేరువేరు సందర్భాలలో, ఒక్క సారి ఒక ఫ్రీవేలో, మరొక సారి వోరేగాన్ లో, కారు ట్రక్కుల నుండి బయట పడుతుంది. ఎవరికీ గాయాలు అవ్వలేదు గాని మరొక వాహనము యొక్క ముందు అద్దం వోరేగాన్ లో ముక్కలయిపోతుంది. ఈ కారు చివరిగా CHP ప్రదర్శన లాగా వాడబడింది 1959లో. 1960లో జార్జ్ బ్యారిస్ కు తిరిగి ఇవ్వడానికి తీసుకు వెళ్తున్నప్పుడు, ఆ కారు మర్మమైన రీతిలో మాయమయింది. అప్పటినుండి ఆ కారును ఎవరు చూడలేదు.[54][55]

ఈ కథలన్నిటిని ధృవీకరించడం లేదా నిరాకరించడం అసాధ్యం. కాని వీటిలో అనేక అవాస్తవాలు ఉన్నాయి. బ్యారిస్ శిధిలమైన 550ను కొన్న మొదటి వ్యక్తి కాదు. ట్రాయ్ మాక్ హెన్రీ మరియు విల్లియం ఎస్చ్రిడ్ అనే వైద్యులు భీమా సంస్థనుండి నేరుగా ఆ కారును కొన్నారు. వీళ్ళిద్దరికీ అది వరకే 550 స్పైడర్ కార్ల సొంతదారులు. వాళ్ళు డ్రైవ్ ట్రైన్, స్తియరింగ్, ఇతర మెకానికల్ భాగాలను స్పెర్స్ లాగా వాడటానికి కోసం ఉపయోగించుకొని, తరువాత షెల్ ను మాత్రం జార్జ్ బారిస్ కు అమ్మారు.[56] విల్లియం ఎస్చ్రిడ్ ఇంజన్ ను తన లోటస్ పందెం కారులో వాడాడు.[57] పమొన 1956లో జరిగిన రేసులో ట్రాయ్ మాక్ హెన్రి మరణించాడు. అతను నడిపిస్తున్న 550 యొక్క స్టియరింగ్ లోని పిట్మాన్ అర్మ్ లోపము వలన ఇది జరిగింది. కాని ఇది "శపించబడ్డ" కారు భాగము కాదు.

డీన్ యొక్క స్పైడర్ కు సంబందించిన ఆఖరి వస్తువు తమ దగ్గిర ఉన్నట్లు రోస్కో, ఈలినొఇస్ లోని హిస్టోరిక్ ఆటో అట్రాక్షన్స్ పేర్కొన్నారు. (ఒక చిన్న కొన్ని స్కయర్ ఇంచు సైజులో) అయితే, ఇది వాస్తవం కాదు. ఇతర పెద్ద భాగాలు ఇంకా ఉన్నట్లు సమాచారం ఉంది. వోలో ఆటో మ్యూజియం లో వెనుక తలుపు ప్రదర్శించబడుతూ ఉంది.[58] స్వర్గీయ డా. ఎశ్రిచ్ కొడుకు వద్ద ఇంకా ఇంజన్ (#90059) ఉన్నట్లు వార్తలు ఉన్నాయి. చివరిగా, కారు సేకరణ చేసే జాక్ స్టైల్స్ వద్ద పోర్ష్ (#10046) యొక్క ట్రాన్స్ఎక్సిల్-గియర్బాక్స్ అసెంబ్లీ ఉన్నట్లు రిపోర్ట్ ఉంది.[59]

ఫిల్మోగ్రఫీసవరించు

చలన చిత్రాలుసవరించు

ఏడాది చిత్రం పాత్ర గమనికలు
1951 ఫిక్స్డ్ బయోనెట్స్! డాగీ

గుర్తింపులేనిది

2003 సైలర్ బివేర్ బాక్సింగ్ అప్పోనేన్ట్స్ సెకండ్

గుర్తింపులేనిది

హ్యాస్ ఎనిబడి సీన్ మై గాల్? యూత్ అట్ సోడా ఫోన్టన్

గుర్తింపులేనిది

1953 ట్రబిల్ అలాంగ్ ది వే

ఎక్స్‌ట్రా! గుర్తింపులేనిది

2003 ఈస్ట్ అఫ్ ఈడెన్ కాల్ ట్రాస్క్

ప్రతిపాదన– ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు
ప్రతిపాదన– ఉత్తమ విదేశీ నటుడిగా BAFTA అవార్డు
ఉత్తమ విదేశీ నటుడిగా జుస్సి అవార్డు

రెబల్ వితౌట్ ఎ కాస్ జిం స్టార్క్
ప్రతిపాదన– ఉత్తమ విదేశీ నటుడిగా BAFTA అవార్డు
1956 జయంట్ జెట్ రింక్ ఉత్తమ నాటకీయ నటుడుగా గోల్డెన్ గ్లోబ్ విశేష సాధన అవార్డు


ప్రతిపాదన– ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు

రంగస్థలంసవరించు

బ్రాడ్వేసవరించు

బ్రాడ్వే-కానివిసవరించు

టెలివిజన్సవరించు

జీవితచరిత చిత్రాలుసవరించు

 • జేమ్స్ డీన్: పోర్ట్రైట్ అఫ్ ఎ ఫ్రెండ్ aka జేమ్స్ డీన్ (1976)[60]
 • సెన్స్ మెమోరీస్ (PBS అమెరికన్ మాస్టర్స్ టెలివిజన్ జీవితచరిత) (2005)[61]
 • ఫారేవేర్ జేమ్స్ డీన్ (1988), వార్నేర్ హోమ్ వీడియో (1995)[62]
 • జేమ్స్ డీన్ ( ఒక కల్పనా జీవితచరిత్ర చిత్రం) (2001)
 • జేమ్స్ డీన్ – క్లైనెర్ ప్రిన్జ్, లిటిల్ బాస్టర్డ్ aka జేమ్స్ డీన్ – లిటిల్ ప్రిన్స్, లిటిల్ బాస్టర్డ్ , జర్మన్ టెలివిజన్ బయోగ్రఫీ, విల్లియం బాస్ట్, మార్కస్ విన్స్లో జూనియర్, రాబర్ట్ హేల్లెర్ లతో భేటిలతో సహా(2005)[63]
 • జేమ్స్ డీన్: ది ఫైనల్ డే విల్లియం బాస్ట్, లిజ్ షెరిడన్ మరియు మైల నుర్మి లతో భేటీలు. డీన్ యొక్క బైసేక్సువాలిటి బహిరంగంగా చర్చించబడింది. నేకడ్ హాలివుడ్ ది ఆక్స్ఫోర్డ్ ఫిలిం కంపని, BBC తో కలిసి తీసిన టెలివిజన్ మినిసిరేస్. USలో ఎ&E నెట్వర్క్, 1991. లో ప్రసారణ చేయబడింది[64]
 • లివింగ్ ఫెమస్లి: జేమ్స్ డీన్ , ఆస్ట్రేలియన్ టెలివిజన్ బయోగ్రఫి, మార్టిన్ లాండావ్, బెట్సీ పామేర్, విల్లియం బాస్ట్ మరియు బాబ్ హింకిల్ (2003, 2006).[65]
 • జేమ్స్ డీన్ – మిట్ వోల్ల్గాస్ డర్చ్స్ లెబెన్ , ఆస్ట్రియన్ టెలివిజన్ బయోగ్రఫీ, రోల్ఫ్ వుతేరిచ్ మరియు విల్లియం బాస్ట్ లతో భేటీలు (2005).[63]
 • జేమ్స్ డీన్ – అవుట్సైడ్ ది లైన్స్ (2002), బయోగ్రఫీ అనే US టెలివిజన్ డాక్యుమెంటరి లో ఒక ఎపిసోడ్. రోడ్ స్టీగేర్, విల్లియం బాస్ట్, మరియు మార్టిన్ లండవ్ లతో బేటీలు (2002).[66]

సూచనలుసవరించు

 1. [1]
 2. మైకేల్ డిఅన్జలిస్, గే ఫాండం మరియు క్రోసోవర్ స్టార్డం: జేమ్స్ డీన్ , మేల్ గిబ్సన్ మరియు కియను రీవ్స్ (డ్యూక్ యూనివర్సిటీ ప్రెస్, 2001), పుట. 97.
 3. ఈ స్వలింగాసంపర్కం గురించిన మరి కొన్ని వివరాలకు, చూడండి బిల్లీ జే. హార్బిన్, కిం మార్ర మరియు రాబర్ట్ ఎ. షాంక్, ఎడ్స్., ది గే మరియు లెస్బియన్ థియేట్రికల్ లెగసీ: ఏ బియోగ్రఫికల్ డిక్షనరీ ఆఫ్ మేజర్ ఫిగర్స్ ఇన్ అమెరికన్ స్టేజ్ హిస్టరీ ఇన్ ప్రీ-స్తోన్వాల్ ఈర (యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ప్రెస్, 2005), 133. జో మరియు జే జేమ్స్ కూడా చూడండి, జేమ్స్ డీన్: లిటిల్ బాయ్ లాస్ట్ (1992), పుట.20. అందులో వీరు డీన్ యుక్తవయసులో ఉన్నప్పుడు అతని తొలినాటి మానసిక గురువైన డీవీర్డ్ చేసిన శృంగార వ్రిశృంఖలతను గురించి విశదీకరించారు. అదే డీన్ యొక్క మొదటి స్వలింగసంపర్కపు శారీరిక సంబంధంగా అభివర్ణించారు (డీవీర్డ్ స్వయంగా తనకు డీన్ తో ఉన్న శారీరిక సంబంధం ఒక సంపూర్ణ సాంప్రదాయ విధానముగా చిత్రీకరించినప్పటికినీ).
 4. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2008-12-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-12-07. Cite web requires |website= (help)
 5. "The unseen James Dean". London: The Times. March 6, 2005. Retrieved January 6, 2010. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 6. యూ ట్యూబ్: 1950 పెప్సి కమర్షియల్
 7. 7.0 7.1 7.2 బాస్ట్, W., సర్వైవింగ్ జేమ్స్ డీన్ , న్యూ జెర్సీ: బారికేడ్ బుక్స్, 2006.
 8. డీన్ కు బ్రాకెట్ తో ఉన్న సంబంధం గురించి, హైమాస్ కూడా చూడండి, జేమ్స్ డీన్ : లిటిల్ బాయ్ లాస్ట్ , పుట.79.
 9. రీస్, ఆర్. ది అనఎబ్రిడ్జ్ద్ జేమ్స్ డీన్ , 1991
 10. హాల్లీ, పుటలు x-196.
 11. పెర్రి, పుటలు 109-226.
 12. రాత్గేబ్, పుట 20.
 13. గిన్నిస్, ఎలెక్. బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైస్ [రాండం హౌస్, 1985, ISBN 0-394-55237-7], పాటం. 4 (పేజీలు. 34-35)
 14. యూట్యూబ్ - సర్ ఎలెక్ గిన్స్ యొక్క ఊహాజనిత ఆలోచన
 15. 15.0 15.1 చావ్కిన్స్, స్టీవ్, "రిమేమ్బరింగ్ ఏ 'జైంట్'", లాస్ ఏంజలస్ టైమ్స్ , అక్టోబర్ 1, 2005.
 16. ఫ్రాసేల్లా, ఎల్., వీసెల్, ఏ. లివ్ ఫాస్ట్, డై యంగ్: ది వైల్డ్ రైడ్ ఆఫ్ మేకింగ్ రెబల్ వితౌట్ ఎ కాస్", పుట.233, న్యూ యార్క్: టచ్ స్టోన్, 2005
 17. (1995, జూలై 13/14). "సంస్మరణ: టర్నప్సీడ్, డోనాల్డ్", ట్యులేర్ ఎడ్వాన్స్-రిజిస్టర్
 18. "Plot Summary for "Warner Brothers Presents"". Retrieved February 24, 2006. Cite web requires |website= (help)
 19. యూట్యూబ్ వీడియో
 20. 20.0 20.1 పెర్రి, జార్జ్, జేమ్స్ డీన్ , లండన్, న్యూ యార్క్: DK పబ్లిషింగ్, 2005, p. 68 ("జేమ్స్ డీన్ ఎస్టేట్ అనుమతి పొందినది")
 21. విల్లియం బాస్ట్, జేమ్స్ డీన్: ఎ బయోగ్రఫీ , న్యూ యార్క్: బల్లన్టైన్ బుక్స్, 1956
 22. 22.0 22.1 22.2 బాస్ట్, విల్లియం: సర్వైవింగ్ జేమ్స్ డీన్ (బారికేడ్ బుక్స్, 2006), పుట. 133, 183-232.
 23. 23.0 23.1 మైకేల్ డీయంజేలిస్, గే ఫ్యాన్డాం అండ్ క్రాస్ ఓవర్ స్టార్డం: జేమ్స్ డీన్, మేల్ గిబ్సన్ అండ్ కీను రీవ్స్ , p. 98.
 24. తాను రచించిన 1992 జేమ్స్ డీన్: లిటిల్ బాయ్ లాస్ట్ అనే జీవితచరితలో, పాత్రికేయుడు జో హ్యామ్స్ ఒక పూర్తి చెప్టర్ ను డీన్, ఏంజెలి సంబంధాన్ని కేటాయించాడు. డీన్ తనకు వ్యక్తిగతంగా తెలుసని రచయిత పేర్కున్నాడు.
 25. బాస్ట్, విల్లియం, సర్వైవింగ్ జేమ్స్ డీన్ , p. 196, న్యూ జెర్సీ: బారికేడ్ బుక్స్, 2006
 26. 26.0 26.1 26.2 అలెక్సాండెర్, పాల్, బోలేవార్డ్ అఫ్ బ్రోకెన్ డ్రీమ్స్: ది లైఫ్, టైమ్స్, అండ్ లెజెండ్ అఫ్ జేమ్స్ డీన్ , న్యూ యార్క్: వైకింగ్, 1994
 27. విల్లియం బాస్ట్, సర్వైవింగ్ జేమ్స్ డీన్ , p. 197, (2006).
 28. జాన్ హోవ్లేట్, జేమ్స్ డీన్: ఎ బయోగ్రఫీ , ప్లేక్సస్ 1997
 29. విల్లియం బాస్ట్, సర్వైవింగ్ జేమ్స్ డీన్
 30. లిజ్ షెరిడన్, డిజ్జి & జిమ్మి (రేగన్బుక్స్ హర్పెర్ కాలిన్స్, 2000), pp. 144-151.
 31. రీస్, రండల్, ది అన్అబ్రిడ్జ్ద్ జేమ్స్ డీన్: హిస్ లైఫ్ అండ్ లెగసి ఫ్రొం A టు Z , p. 239, చికాగో: కంటెంపరరీ బుక్స్, ఇంక్., 1991.
 32. మార్జోరీ బి. గార్బెర్, బై సేక్సువాలిటి అండ్ ది ఎరోటిసిసం అఫ్ ఎవరిడే లైఫ్ (2000), p.140. "బై సేక్సువాలిటి అండ్ సెలెబ్రిటి." ను కూడా చూడండి రీల్ అండ్ సచ్అఫ్, ది సేడక్షన్స్ అఫ్ బయోగ్రఫీ , p.18.
 33. 33.0 33.1 పెర్రి, G., జేమ్స్ డీన్ , p. 204, న్యూ యార్క్, DK పబ్లిషింగ్, ఇంక్., 2005
 34. 34.0 34.1 గారి వతెర్స్పూన్ అండ్ రాబర్ట్ F. అల్డ్రిచ్, వ్హో ఇస్ హూ ఇన్ గే అండ్ లెస్బియన్ హిస్టరీ: ఫ్రం అంటిక్విటి టు వరల్డ్ వార్ II (రోట్లేడ్జ్, 2001), p.105.
 35. http://www.youtube.com/watch?v=Y4iGDSjOpXc
 36. Lisa DiCarlo (October 25, 2004). "The Top Earners For 2004". Retrieved February 24, 2006. Cite web requires |website= (help)
 37. విల్లియం బాస్ట్, జేమ్స్ డీన్: ఎ బయోగ్రఫీ , న్యూ యార్క్: బల్లన్టిన్ బుక్స్, 1956.
 38. రీస్, రండల్, ది అన్అబ్రిడ్జ్ద్ జేమ్స్ డీన్: హిస్ లైఫ్ ఫ్రం A టు Z , చికాగో: కాన్టెంపరరి బుక్స్, 1991, pp. 41, 238
 39. అలెక్సాండెర్, పాల్, బోలేవార్డ్ అఫ్ బ్రోకెన్ డ్రీమ్స్: ది లైఫ్, టైమ్స్, అండ్ లెజెండ్ అఫ్ జేమ్స్ డీన్ , న్యూ యార్క్: వైకింగ్, 1994, p. 87
 40. బాస్ట్, సర్వైవింగ్ జేమ్స్ డీన్ , pp. 133, 150, 183.
 41. విల్లియం బాస్ట్, సర్వైవింగ్ జేమ్స్ డీన్ , బారికేడ్ 2006, p. 301
 42. జాన్ హౌలేట్ (1997), జేమ్స్ డీన్ , లండన్: ప్లేక్సస్, p. 166
 43. విల్లియం బాస్ట్, సర్వైవింగ్ జేమ్స్ డీన్ , బారికేడ్ 2006, p. 230-231
 44. విల్లియం బాస్ట్, సర్వైవింగ్ జేమ్స్ డీన్ , బారికేడ్ 2006, p. 207, p.210-211
 45. వాల్ హోలీ, మైక్ కోనోలీ అండ్ ది మాన్లీ ఆర్ట్ అఫ్ హాలీవుడ్ గాసిప్ (2003), p.22.
 46. డోనాల్డ్ స్పోటో, రెబెల్: ది లైఫ్ అండ్ లెజెండ్ అఫ్ జేమ్స్ డీన్ (హర్పెర్ కాలిన్స్, 1996), pp.150-151. వాల్ హోలీ, జేమ్స్ డీన్: ది బయోగ్రఫీ , pp.6, 7, 8, 78, 80, 85, 94, 153 కూడా చూడండి.
 47. జాన్ గిల్మోర్, లివ్ ఫాస్ట్ – డై యంగ్: రేమేమ్బెరింగ్ ది షార్ట్ లైఫ్ అఫ్ జేమ్స్ డీన్ (న్యూ యార్క్: తన్డర్స్ మౌత్ ప్రెస్, 1998).
 48. లారంస్ ఫ్రాసేల్లా, అల్ వీసెల్, లివ్ ఫాస్ట్, డై యంగ్: ది వైల్డ్ రైడ్ అఫ్ మేకింగ్ రెబల్ వితౌట్ ఎ కాస్.
 49. విల్లియం బాస్ట్, సర్వైవింగ్ జేమ్స్ డీన్ (బారికేడ్ బుక్స్, 2006)
 50. జాన్ హోవ్లేట్(1997), జేమ్స్ డీన్, లండన్: ప్లేక్సస్, p. 167
 51. జార్జ్ పెర్రి, జేమ్స్ డీన్, DK పబ్లిషింగ్ 2005
 52. జో హ్యామ్స్, జేమ్స్ డీన్ – లిటిల్ బాయ్ లాస్ట్, వార్నర్ బుక్స్ 1992
 53. విల్లియం బాస్ట్, సర్వైవింగ్ జేమ్స్ డీన్, బారికేడ్ 2006, p. 53-54, p. 135
 54. ఫ్రాసేల్లా, L., వీసెల్, ఎ. లివ్ ఫాస్ట్, డై యంగ్: ది వైల్డ్ రైడ్ అఫ్ మేకింగ్ రెబల్ వితౌట్ ఎ కాస్ , p.295, న్యూ యార్క్: టచ్ స్టోన్, 2005
 55. బీత్, W., వీల్డన్, P.,జేమ్స్ డీన్ ఇన్ డెత్: ఎ పాపులర్ ఎన్సైక్లోపీడియా అఫ్ ఎ సెలెబ్రిటి ఫినామినన్ , మాక్ఫార్లాండ్ & కో, 2005
 56. http://www.356registry.org/History/deen/index.html Archived 2011-07-24 at the Wayback Machine. జేమ్స్ డీన్, 356 డ్రైవర్
 57. http://www.tamsoldracecarsite.net/BillTibbetts030EschrichWoodardPR.html
 58. "M offered for James Dean death car". CNN. Retrieved May 5, 2010.
 59. http://www.jamesdean550.com/
 60. IMDBలో జేమ్స్ డీన్
 61. IMDBలో సెన్స్ మెమరీస్
 62. IMDB లో ఫర్ఎవెర్ జేమ్స్ డీన్
 63. 63.0 63.1 IMDB చిత్రము పేజీలో జేమ్స్ డీన్ – క్లైనెర్ ప్రిన్జ్, లిటిల్ బాస్టర్డ్
 64. IMDBలో నేకడ్ హాలివుడ్
 65. IMDBలో లివింగ్ ఫమస్లీ: జేమ్స్ డీన్
 66. IMDBలో జీవిత చరిత ఎపిసోడ్ పేజీ

మరింత చదవడానికిసవరించు

 • అలెక్జాన్డెర్, పాల్: బోలేవార్డ్ అఫ్ బ్రోకెన్ డ్రీమ్స్: ది లైఫ్, టైమ్స్, అండ్ లెజెండ్ అఫ్ జేమ్స్ డీన్ . వైకింగ్, 1994. ISBN 0262081504
 • బాస్ట్, విల్లియం : జేమ్స్ డీన్: ఎ బయోగ్రఫీ . (బాల్లన్టైన్ బుక్స్ 2003).
 • బాస్ట్, విల్లియం : సర్వైవింగ్ జేమ్స్ డీన్ . బారికేడ్ బుక్స్, 2006. ISBN 1-84138-495-X
 • డాల్టన్, డేవిడ్ : జేమ్స్ డీన్-ది మ్యూటంట్ కింగ్: ఎ బయోగ్రఫీ . చికాగో రివ్యూ ప్రెస్, 2001. ISBN 1-84138-495-X
 • ఫ్రాస్సెల్లా, లారెన్స్ మరియు వీసెల్, అల్ : లివ్ ఫాస్ట్, డై యంగ్: ది వైల్డ్ రైడ్ అఫ్ మేకింగ్ రెబల్ వితౌట్ ఎ కాస్ . టచ్స్టోన్, 2005. ISBN 0-15-506372-3
 • గిల్మోర్, జాన్ : లివ్ ఫాస్ట్-డై యంగ్: రేమేమ్బెరింగ్ ది షార్ట్ లైఫ్ అఫ్ జేమ్స్ డీన్ . తన్డేర్స్ మౌత్ ప్రెస్, 1998. ISBN 1-56025-858-6
 • గిల్మోర్, జాన్: ది రియల్ జేమ్స్ డీన్ . పిరమిడ్ బుక్స్, 1975. ISBN 0-15-506372-3
 • హోలీ, వాల్: జేమ్స్ డీన్: ది బయోగ్రఫీ . సెయింట్ మార్టిన్'స్ గ్రిఫ్ఫిన్, 2009. ISBN 0-609-60855-X.
 • హొవెల్, జాన్: జేమ్స్ డీన్: ఎ బయోగ్రఫీ . ప్లేక్సస్ పబ్లిషింగ్, 1997. రెండవ సవరించబడిన ఎడిషన్. ISBN 0262081504
 • హ్యంస్, జో; హ్యంస్, జే: జేమ్స్ డీన్: లిటిల్ బాయ్ లాస్ట్ . టైం వార్నేర్ పబ్లిషింగ్, 1992. ISBN 0262081504
 • మార్టినేట్టి, రోనాల్డ్: ది జేమ్స్ డీన్ స్టొరీ , పిన్నకిల్ బుక్స్, 1975. ISBN 0-15-506372-3
 • మొరిస్సే: జేమ్స్ డీన్ ఇస్ నాట్ డేడ్ . బాబిలోన్ బుక్స్, 1983. ISBN 0 907 188 06 0
 • పెర్రి, జార్జ్: జేమ్స్ డీన్ . DK పబ్లిషింగ్, 2005. ISBN 0-8108-3881-8.
 • షెరిడన్, లిజ్: డిజ్జి & జిమ్మి: మై లైఫ్ విత్ జేమ్స్ డీన్ : ఎ లవ్ స్టొరీ . హర్పెర్ కాలిన్స్ కెనడా / హర్పెర్ ట్రేడ్, 2000. ISBN 0-15-506372-3
 • స్పోటో, డోనాల్డ్: రెబెల్: ది లైఫ్ అండ్ లెజెండ్ అఫ్ జేమ్స్ డీన్ . హర్పర్ కాలిన్స్, 1996. ISBN 0-15-506372-3

బాహ్య లింకులుసవరించు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.