జై జవాన్

(జైజవాన్ నుండి దారిమార్పు చెందింది)

జై జవాన్ 1970, ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు సినిమా.అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మాత , దుక్కిపాటి మధుసూధనరావు ఈ చిత్రాన్ని, నిర్మించారు. యద్దనపూడి సులోచనారాణి కథ అందించగా, దర్శకుడు, డీ. యోగానంద్ . ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, భారతి, కృష్ణంరాజు, చంద్రకళ ముఖ్య తారాగణం. సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.

జై జవాన్
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.యోగానంద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
భారతి,
నాగభూషణం,
పద్మనాభం,
చంద్రకళ,
కృష్ణంరాజు
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్
భాష తెలుగు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ: యద్దనపూడి సులోచనారాణి
  • మాటలు: డివి నరసరాజు
  • సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
  • కెమెరా: పిఎస్ శెల్వరాజ్
  • కూర్పు: ఎంఎస్ మణి
  • కళ: జివి సుబ్బారావు
  • నృత్యం: తంగప్పన్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి యోగానంద్
  • నిర్మాత: డి మధుసూదనరావు

నటీనటులు

మార్చు

దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మాధవరావు కుమారుడు ఇండియన్ ఆర్మీ కెప్టెన్ రవీంద్రనాథ్, కుమార్తె భారతి. మాధవరావు సోదరి సుందరమ్మ, ఆమె భర్త నరసింహం, మేనకోడలు కస్తూరి. కుస్తూరి బావను ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. యుద్ధంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలోవున్న రవీంద్రను నర్సు సుశీల రక్షిస్తుంది. వారిరువురూ ప్రేమించుకుంటారు. రవి స్నేహితుడు డాక్టర్ రఘు మాధవరావు కుటుంబానికి అండగావుంటాడు. అతనికి కాళ్లులేవని తెలిసినా భారతి అతడిని ఇష్టపడుతుంది. ఇంటికి వచ్చిన రవి -రఘు, భారతికి వివాహం జరిపిస్తాడు. తాను సుశీలను వివాహం చేసుకుంటానని తండ్రికి తెలియచేసి, అంగీకారంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో, కారు ఆక్సిడెంట్ సంభవించి సుశీల మరణిస్తుంది. మనోవేదనతో పర్యటనకు వెళ్లిన రవికి సుజాత కనిపిస్తుంది. ఆమె సుశీల చెల్లెలని, వారిరువురినీ శివయ్య, లక్ష్మి దంపతులు పెంచి పెద్ద చేశారని తెలుసుకుంటాడు. అంతేకాదు సుజాతతో వారి కుమారుడు రాముకు చిన్నతనంలో పెళ్లి నిశ్చయమైందని, రాము ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు కనుక.. సుజాత -రవిలకు పెళ్లి జరిపిస్తామని చెబుతారు. రవి, సుజాతల పెళ్లి సమయంలో -పాకిస్తాన్‌తో యుద్ధం కారణంగా సైనికులను ప్రభుత్వం వెనక్కి రమ్మని పిలుపునిస్తుంది. ఆ విధంగా తిరిగి యుద్ధానికి వెళ్లిన రవి విజయవంతంగా పోరాటం జరపటం, నమ్మకస్తుడిగా నటిస్తూ దేశ ద్రోహానికి పాల్పడే వ్యక్తి మేనమామ నరసింహం తలపెట్టిన రైలుమార్గాలు, వంతెనల విధ్వంసం కుట్రలను భగ్నం చేస్తాడు. నరసింహం కొడుకు పద్మనాభం భార్య లిల్లీ ఒక సిఐడి ఆఫీసర్. ఆమె కూడా మామ కుట్రను పోలీసులకు సాక్ష్యాలతో అందచేయటం, నరసింహం అరెస్ట్ కావటం జరుగుతుంది. భారత్- పాక్ యుద్ధ విరమణ అనంతరం.. రవి ప్రధానమంత్రి చేతులమీదుగా బహుమతి స్వీకరించి, తన ఊరిలో సుజాతను వివాహం చేసుకోగా.. రామూ, రఘు ఒకరేనని తెలియటంవంటి విశేషాలతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
అనురాగపు కన్నులలో నను దాచిన ప్రేయసివే దాశరథి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
చక్కని వదినకు సింగారమే సిగ్గుల చిరునవ్వు బంగారమే కొసరాజు సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల, వసంత
మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈవేళ పసిడి కలలేవో చివురించె ప్రణయరాగాలు పలికించే సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
స్వతంత్ర భారతయోధుల్లారా సవాలేదుర్కొని కదలండి శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల, బృందం
వీరభారతీయ పౌరులారా దేశమాత పిలుపు వినలేరా[2] శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు
  • అల్లరి చూపుల అందాల బాల నవ్వుల చిలికి - ఘంటసాల, సుశీల . రచన: దాశరథి.
  • పాలబుగ్గల చిన్నదాన్ని పెళ్ళికాని కుర్రదాన్ని - సుశీల, ఘంటసాల. రచన: కొసరాజు.

వనరులు

మార్చు
  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (15 February 2020). "ఫ్లాష్ బ్యాక్ @ 50 జైజవాన్". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 12 June 2020.
  2. సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

బయటిలింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జై_జవాన్&oldid=4207151" నుండి వెలికితీశారు