యోగానంద్ దాసరి, అలనాటి సినిమా దర్శకుడు.

డి.యోగానంద్
జననండి.యోగానంద్
ఏప్రిల్ 16, 1922[1]
మద్రాస్
మరణం84 సం.లు , నవంబర్ 23, 2006.
తండ్రివెంకట దాస్ - సంస్కృత పండితులు
తల్లిలక్ష్మి బాయి - సంస్కృత పండితురాలు

జీవిత విశేషాలు సవరించు

ఇతడు గుంటూరు జిల్లా, పొన్నూరులో జన్మించాడు. మద్రాసులో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇతడు ప్రతివాది భయంకరాచారితో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. తరువాత చిత్ర పరిశ్రమలో ప్రవేశించి గూడవల్లి రామబ్రహ్మం, ఎల్.వి.ప్రసాద్‌ల వద్ద సహాయకుడిగా పనిచేశాడు. దర్శకునిగా ఇతని తొలి సినిమా అమ్మలక్కలు. సినిమాలలో ప్రవేశించిన తొలిరోజులలో ఇతడు నందమూరి తారకరామారావు, టి.వి.రాజులతో ఒకే గదిలో ఉండేవాడు[2].

కుటుంబం సవరించు

ఇతడు ప్రముఖ నటుడు శ్రీవత్స (మల్లీశ్వరి సినిమాలో శ్రీకృష్ణదేవరాయల వేషధారి) కుమార్తె హనుమాయమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు[2].

చిత్రాలు సవరించు

తెలుగు చిత్రాలు సవరించు

నందమూరి తారక రామారావుతో సవరించు

తోడుదొంగలు (1954)
జయసింహ (1955)
ఆలీబాబా 40 దొంగలు
అమ్మలక్కలు (1953)
తోడుదొంగలు (1954)
విజయగౌరి 1955
శ్రీ గౌరీ మహత్యం (1956)
వచ్చిన కోడలు నచ్చింది (1959)
గులేబకావళి కథ (1962)
ఉమ్మడి కుటుంబం(1967)
తిక్క శంకరయ్య (1968)
బాగ్దాద్ గజదొంగ (1968)
కోడలు దిద్దిన కాపురం (1970)
డబ్బుకు లోకం దాసోహం (1973)
వాడే వీడు (1973)
కథానాయకుని కథ (1973)
వేములవాడ భీమకవి (1975)
సింహం నవ్వింది (1983)

అక్కినేని నాగేశ్వరరావుతో సవరించు

ఇలవేల్పు (1956)
పెళ్ళి సందడి (1959)
కన్నకూతురు (1960)
మూగ నోము (1969)
జై జవాన్ (1970)

ఇతర కథానాయకులతో సవరించు

సాహస వీరుడు (1956)
రాణీ సంయుక్త (1963)
ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు (1965)
ఈ కాలం దంపతులు (1975)
గృహప్రవేశం (1977)

తమిళ చిత్రాలు సవరించు

యోగానంద్ 12 సినిమాలు తమిళంలో చేసారు: కొన్ని పాపులర్ చిత్రాలు

  • మరుమగల్
  • అంబు ఎంగై
  • మదురై వీరన్
  • పార్తీబన్ కనవు - వీర సామ్రాజ్యం పేరుతో తెలుగులో డబ్ అయ్యింది.
  • కవేరియన్ కనవన్
  • పరిసు
  • పసమం నేశామం

అవార్డులు సవరించు

  • 1981 లో తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కలైమామణి అవార్డు.

మరణం సవరించు

ఇతడు 2006, నవంబర్ 23వ తేదీన తన 84వ యేట హృద్రోగంతో మరణించాడు.[2]

మూలాలు సవరించు

  1. విశాలాంధ్ర. "హిట్‌చిత్రాల దర్శకుడు డి. యోగానంద్‌". Retrieved 30 June 2017.[permanent dead link]
  2. 2.0 2.1 2.2 వెబ్ మాస్టర్. "Popular director Yoganand passes away". ఫిల్మీ బీట్. Retrieved 16 February 2018.

బాహ్య లంకెలు సవరించు