జైనథ్ మండలం
తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా లోని మండలం
జైనథ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] జైనథ్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9 నిర్జన గ్రామాలు పోను 46 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
జైనథ్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, జైనథ్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°44′1.6″N 78°38′37.2″E / 19.733778°N 78.643667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | జైనథ్ |
గ్రామాలు | 46 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 47,904 |
- పురుషులు | 23,797 |
- స్త్రీలు | 24,107 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.56% |
- పురుషులు | 64.89% |
- స్త్రీలు | 36.49% |
పిన్‌కోడ్ | 504309 |
గణాంక వివరాలు
మార్చుమండల జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 47,904 - పురుషులు 23,797 - స్త్రీలు 24,107. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 292 చ.కి.మీ. కాగా, జనాభా 47,904. జనాభాలో పురుషులు 23,797 కాగా, స్త్రీల సంఖ్య 24,107. మండలంలో 11,374 గృహాలున్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చు- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 46 (నలభై ఆరు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
- హాథీఘాట్
- గూడ
- రంపూర్తరాఫ్
- కోర్తా
- కెదార్పూర్
- అకోలి
- గిమ్మ (ఖుర్ద్)
- సిర్సొన్న
- భోరజ్
- ఫౌజ్పూర్
- పూసాయి
- పిప్పర్వాడ
- మౌదగడ
- కామాయి
- దొల్లార
- పెండల్వాడ
- లేకర్వాడి
- సావాపూర్
- హాషంపూర్
- తరద (బుజుర్గ్)
- నిజాంపూర్
- నీరాల
- బాలాపూర్
- అకుర్ల
- సంగ్వి (కె)
- దీపాయిగూడ
- కౌతా
- బహదూర్పూర్
- కుర
- కరంజి
- ఖప్రి
- ఉమ్రి
- బెల్గావ్
- బల్లోరి
- మకోద
- జైనథ్
- ముక్తాపూర్
- అదా
- కంతా
- పర్ది (బుజుర్గ్)
- పర్ది (ఖుర్ద్)
- పిప్పల్గావ్
- లక్ష్మీపూర్ (ఉలిగన్)
- జామిని
- కంపా (మెదిగుద)
- మంగుర్ల
- గమనిక తొమ్మిది నిర్జన గ్రామాలు 9 పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.