జైనేంద్రవ్యాకరణము

పాణిని రచించిన గ్రంథము అష్టాధ్యాయి. శబ్ద శాస్త్రమును సూత్ర రూపమున బోధించి కృతకృత్యుడయిన వారిలో ఈతడే ఉత్తమోత్తముడు. వ్రాసినవి నాలుగువేల సూత్రములు. వానికి అనుకూలపడుటకు, అధికారము లనియు అనువృత్తు లనియు మరికొన్నిటిని స్వీకరించెను. అష్టాధ్యాయికి పిదప వైయూకరణులు అనేకులు పాణినీయ తంత్రమునకు వ్యాఖ్యానములు కావించిరి. అష్టాధ్యాయిలో ఉన్నవి ఉన్నట్టు సూత్రములనుంచి ఆక్రముమమున వ్యాఖ్యానములోనర్చినవారు కొందరు. విషయమంతకు ఒకవిధముగ ప్రణాళిక ఏర్పరచుకొని తదనుకూలముగ శీర్షికలను గవించి చక్కగా బోధించువారు కొందరు. ఇటువంటి వ్యాకరణములలో ఒకటి ఈ జైనేంద్రవ్యాకరణము. దీనిని రచించినది వర్థమాన మహావీరుడు. ఈతడు దిగంబర జైనుడు. ఈ గ్రంథమున 3200 సూత్రములు ఉన్నాయి. ఇందు అపూర్వ విషములు లేవు. పాణినీయమునకు సంక్షేప రూపముగ నుండును.

మహావీరుడు

మూలాలు మార్చు

1. భారతి మాస సంచిక.