జైష్-ఎ-మహమ్మద్

కాశ్మీర్ లో ప్రస్తుతం చురుగ్గా ఉన్న ఒక జిహాదీ తీవ్రవాద బృందం పేరు జైష్-ఎ-మహమ్మద్/జైషే మహమ్మద్. జైష్ ఎ మహమ్మద్ అనే ఉర్దూ పదానికి అర్థం మహమ్మద్ (ప్రవక్త) సైన్యం అని. 2000వ సంవత్సరంలో కాశ్మీర్ పొరుగునే ఉన్న పాకిస్తాన్ భూభాగంలో మసూర్ అజహర్ అనే వ్యక్తి దీన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచీ అక్కడి నించే తమ శిక్షణా కార్యక్రమాలు,ప్రణాళికలు రూపొందించుకుంటోంది.

లక్ష్యాలు:

కాశ్మీర్ రాష్ట్రాన్ని భారత్ నించి విడదీసి పాకిస్తాన్ లో కలపాలన్న లక్ష్యంతో ఇది పని చేస్తోంది. అందుకోసం కాశ్మీర్ రాష్ట్రంలో పలు తీవ్రవాద దాడులు చేసింది. కాశ్మీర్ రాష్ట్రంలో షరియా చట్టాలను అమలు చేయాలని కూడా దీని లక్ష్యం. మొదట కాశ్మీర్ ని ఆక్రమించి తర్వాత భారత్ లోని మిగిలిన భూభాగాలను కూడా తమ అధీనంలోకి తెచ్చుకోవాలనేది ఈ బృందం ఆశయం.

దాడులు:

ఈ బృందానికి ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లు, అల్ ఖైదా తీవ్రవాద బృందాలతో సంబంధాలున్నాయి. 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన పుల్వామా దాడులు తమ బృందం చేసినవేనని ఇది ప్రకటించింది. అదే కాకుండా గతంలో 2001లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ పైన జరిగిన ఉగ్రవాద దాడి, 2001 డిసెంబర్ లో భారత పార్లమెంటు మీద జరిగిన ఉగ్రవాద దాడి, 2016 లో పంజాబ్ లోని పఠాన్ కోట లో భారత వైమానిక స్థావరం మీద జరిగిన దాడి, ఉరీ ప్రాంతంలో జరిగిన దాడులు అన్నీ ఈ బృందం జరిపినవే. ప్రస్తుతం కాశ్మీర్ లోని అత్యంత హింసాత్మక తీవ్రవాద బృందం ఇదేనని B. Raman వంటి నిపుణులు పేర్కొంటున్నారు. జైష్ ఎ మహమ్మద్ ను పాకిస్తాన్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుకె, అమెరికా దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా తీవ్రవాద బృందంగా గుర్తించింది.

నాయకులు: మసూద్ అజహర్

ఎప్పటి నుంచి ఉనికిలో ఉంది: 2000

సిద్ధాంతం: ఇస్లామిక్ ఛాందసవాదం

ప్రధాన కార్యాలయం:బహవల్పూర్, పంజాబ్, పాకిస్తాన్

ఈ బృందం నాయకుడు మసూర్ అజహర్ గతంలో హర్కత్ - అల్-ముజాహిదీన్ అనే మరో ఉగ్రవాద బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. అప్పట్లో జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటు వాద కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ జైల్లో కొంతకాలం ఉన్నాడు.

[1]

  1. Wikisource link to [[s:web.stanford.edu.group.groups Mapping militant organizations--Stanford University Jaish - e- Mohammed - Wikipedia|web.stanford.edu.group.groups Mapping militant organizations--Stanford University Jaish - e- Mohammed - Wikipedia]]. వికీసోర్స్.