మసూద్ అజార్
మహ్మద్ మసూద్ అజార్ అల్వీ పాకిస్తాన్ తీవ్రవాది .ఉగ్రవాద సంస్థ అయినా జైష్-ఎ-మొహమ్మద్ సంస్థకు వ్యవస్థాపకుడు, నాయకుడు.[1][2] 2019 మే 1న, మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా జాబితాలో చేర్చింది.[3]
మహ్మద్ మసూద్ | |
---|---|
జన్మనామం | మహ్మద్ మసూద్ అజహర్ అల్వీ |
జననం | బహవల్పూర్,పంజాబ్,పాకిస్తాన్ | 1968 జూలై 10
సంబంధీకులు | అబ్దుల్ రవూఫ్ అజర్ (సోదరుడు) |
జీవితం తొలి దశలో
మార్చుమసూద్ అజర్ 1968 జూలై 10[4] కొన్ని మూలాల ప్రకారం అతని పుట్టిన తేదీని 1968 ఆగస్టు 7.పాకిస్థాన్ లో, పంజాబ్ రాష్ట్రంలోని భావల్పూర్‌లో జన్మించాడు.ఆయన తండ్రి ఓ స్కూల్ హెడ్‌మాస్టర్.మసూద్ అజర్ కరాచీలోని బినోరీ పట్టణంలోని మతపరమైన జామియా ఉలూమ్-ఇ-ఇస్లామీ యూనివర్సిటీలో చదివాడు.తర్వాత అక్కడే టీచర్ అయ్యాడు .మసూద్ అజర్ 1980వ దశకంలో సోవియట్–అఫ్ఘానిస్థాన్ యుద్ధాలతో స్ఫూర్తి పొందిన మసూద్ అఫ్ఘానిస్థాన్ తరపున సోవియట్ దళాలపై మిలెటెంట్ పోరాటాలు జరిపాడు. ఆ తర్వాత 1990వ దశకంలో కశ్మీర్‌లో ప్రవేశించి మిలిటెంట్ కార్యకలాపాలు ప్రారంభించాడు.1994లో యాధశ్చికంగా అరెస్ట్ భారతదేశంలో అయ్యాడు. అరెస్టయినప్పుడు అతను హర్కతుల్ అన్సార్ అనే మిలిటెంట్ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.1999 డిసెంబరులో విడుదలయ్యాక నేరుగా పాకిస్థాన్ వెళ్లాడు.కార్గిల్ యుద్ధంలో పరాజయం భారంతో ఉన్న పాకిస్థాన్ సైనికులు, ఐఎస్‌ఐ ఆయనకు ఆశ్రయం కల్పించింది.ఆ తర్వాత కొద్దికాలం అఫ్ఘాన్‌లో గడిపిన మసూద్ పాకిస్థాన్ తిరిగొచ్చి బాలకోట్‌లో జేషే మొహమ్మద్ సంస్థను ఏర్పాటు చేశాడు. 2000లో మళ్లీ కశ్మీర్‌లో ప్రవేశించిన భారత సైనికులకు వ్యతిరేకంగా అనేక మిలిటెంట్ దాడులు జరిపించాడు. సాధించాడు[5]
భారతదేశంలో అరెస్టు
మార్చు1994 లో అజర్ నకిలీ గుర్తింపుతో శ్రీనగర్‌కు వెళ్లాడు.భారతదేశం 1994 ఫిబ్రవరిలో అనంత్‌నాగ్ సమీపంలోని అతన్ని అరెస్టు చేసి జైలులో పెట్టింది.[6]
హైజాకింగ్ తర్వాత విడుదల
మార్చునాలుగు సంవత్సరాల తరువాత,1999 డిసెంబరు లో, ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 814 (IC814) హైజాక్ చేశారు.విమానాన్ని హైజాక్ చేస్తున్నామని చెప్పి అమృత్ సర్, లాహోర్, దుబాయిల మీదుగా అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌కు తరలించారు. జైల్లో బందీలుగా ఉన్నా 36 మందిని విడుదల చేసి 200 మిలియన్ డాలర్లు (రూ. 1400 కోట్లు) ఇవ్వాలని భారత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జైల్లో మసూద్ అజార్ కూడా ఉన్నాడు.హైజాక్ కు గురైన సీ814 విమానంలో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది సిబ్బంది ఉన్నారు. భారత గగనతలంలోకి రాగానే ముసుగు ధరించిన మిలిటెంట్లు విమానాన్ని లాహోర్‌కు తీసుకువెళ్లాలని ఆదేశించారు. లేదంటే బాంబుతో విమానాన్ని పేల్చేస్తానని పైలట్‌ను బెదిరించారు. విమానాన్నిలాహోర్ వైపు మళ్లించాలని కెప్టెన్ దేవీ శరన్ కు మిలిటెంట్లు ఆదేశించారు. అయితే విమానంలో తక్కువ ఇంధనం ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని అమృత్‌సర్‌లో దించారు.విమానం ల్యాండ్ అవ్వగానే హైజాకర్లపై చర్యకు భద్రత దళాలు సిద్ధమయ్యాయి.వెంటనే హైజాకర్లు ఇంధనం నింపకుండానే విమానాన్ని లాహోర్ తీసుకువెళ్లేలా పైలట్ పై ఒత్తిడి తెచ్చారు. దాంతో లాహూర్ కు తీసుకువెళ్లారు.ఆ తర్వాత అక్కడినుంచి ఆఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు వెళ్ళారు.ప్రయాణీకులకు తాలిబన్లు విమానంలో ఉన్నవారి కోసం ఆహార పానీయాలు ఏర్పాటుచేశారు తాలిబన్లు. హైజాకర్లు పైన దాడి చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.అందుకు అఫ్గానిస్తాన్ ను భారత్ అనుమతికోరింది.కానీ విదేశీ సైన్యం తమ భూభాగంలోకి వద్దని అఫ్గానిస్తాన్ వెల్లడించింది. ఆతర్వాత తాలిబన్లతో భారత్ చర్చలు జరిపింది. తమ బందీలుగా వారిని విడుదల చేయాలన్న కోరారు తాలిబన్లు. హైజాకర్ల డిమాండ్లకు అంగీకరించిన భారత్ మిలిటెంట్ల విడుదలకు అంగీకారం తెలిపింది. హైజాక్ ముగిసే వరకు కాందహార్ విమానాశ్రయంలోనే ఉన్నారు. మిలిటెంట్లు మౌలానా మసూద్ అజహర్, ముశ్తాక్ జర్గర్, అహ్మద్ ఉమర్ సయీద్ శేఖ్‌లను విడుదల చేసి భారత్‌లోని జైళ్ల నుంచి కాందహార్ విమానాశ్రయానికి తీసుకు వచ్చి అప్పగించారు. విమానం ఎక్కిన ప్రయాణీకులు క్షేమంగా ఇండియాకు చేరుకున్నారు.[7][8] ఈ హైజాకి మసూద్ అజార్ సోదరుడు నాయకత్వం వహించాడు.[9][10] విడుదలైన కొద్దికాలానికే, అజర్ కరాచీలో సుమారు 10,000 మంది ప్రజలను ఉద్దేశించి బహిరంగ ప్రసంగం ఏర్పాటు చేశాడు. కాశ్మీర్ ప్రాంతాన్ని భారత పాలన నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ, భారతదేశాన్ని నాశనం చేసేంత వరకు ముస్లింలు శాంతిగా ఉండకూడదని మీకు చెప్పడం నా కర్తవ్యం కాబట్టి నేను ఇక్కడకు వచ్చాను అని ప్రకటించాడు.1999లో, మసూద్ విడుదలైన తర్వాత, హర్కత్-ఉల్-అన్సార్‌ను అమెరికా నిషేధించింది, నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.[11]
జైష్ ఎ మహమ్మద్ ఉగ్ర సంస్థ
మార్చుకాశ్మీర్ రాష్ట్రాన్ని భారత్ నించి విడదీసి పాకిస్తాన్ లో కలపాలన్న లక్ష్యంతో జైష్ ఎ మహమ్మద్ ఉగ్ర సంస్థ పని చేస్తోంది.అందుకోసం కాశ్మీర్ రాష్ట్రంలో పలు తీవ్రవాద దాడులు చేసింది.జైష్-ఎ-మహమ్మద్ ను2000వ సంవత్సరంలో మసూర్ అజహర్ ఏర్పాటు చేశాడు.కాశ్మీర్ రాష్ట్రంలో షరియా చట్టాలను అమలు చేయాలని కూడా దీని లక్ష్యం. మొదట కాశ్మీర్ ని ఆక్రమించి తర్వాత భారత్ లోని మిగిలిన భూభాగాలను కూడా తమ అధీనంలోకి తెచ్చుకోవాలనేది ఈ బృందం ఆశయం.
చేసిన ఉగ్ర దాడులు
మార్చు2001 భారత పార్లమెంటు పై దాడి
మార్చు2001 డిసెంబరు 13 న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారు. భద్రతా దళాలు వీరిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్నీ హతమార్చారు.[12][13][14][15]
2008 ముంబై దాడులు
మార్చు2008లో దాదాపు పది మంది పాకిస్తాన్ జీహాదీలు ముంబై నగరంలో కాల్పులు, బాంబు దాడులు చేశారు.[16][17] 26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు దారుణ మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. ఎనిమిది దాడులు దక్షిణ ముంబైలో జరిగాయి.[18]
2016 పఠాన్‌కోట్ దాడి
మార్చుభారత సైనికుల దుస్తులను ధరించిన కొందరు ఉగ్రవాదులు 2016 జనవరి 2 పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని రావి నదిని దాటి పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో దాడి చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు, ముగ్గురు సైనికులు చనిపోయారు. మర్నాడు జరిగిన పేలుడులో మరో నలుగురు భారత సైనికులు మరణించారు.వైమానిక స్థావరం మొత్తాన్నీ తమ అదుపులోకి తెచ్చుకోవడానికి భారత సైన్యానికి మూడు రోజులు పట్టింది. ఈ దాడి వెనుక జైష్-ఎ-మహమ్మద్ హస్తం ఉంది.
2019 పుల్వామా దాడి
మార్చు2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.[19] పాకిస్తాన్ లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి బాధ్యత ఉన్నట్టుగా ప్రకటించుకుంది. దాడిచేసినది కాశ్మీరీ అయిన ఆదిల్ అహ్మద్ దార్ అని గుర్తించారు.[20][21][22]
మూలాలు
మార్చు- ↑ Outlook Web Bureau (15 February 2019), "What Is Jaish-e-Mohammad? Who Is Masood Azhar?", Outlook India. Retrieved 9 April 2020.
- ↑ "Masood Azhar is now a UN global terrorist: Know what it means". Economic Times.
- ↑ "Mohammad Masood Azhar Alvi". United Nations Security Council. 1 May 2019. Retrieved 1 May 2019.
- ↑ India's most wanted. Vol. 19. Frontline. 2002. ISBN 0066210631.
- ↑ "Maulana Masood Azhar". Kashmir Herald. 1 (8). kashmiri-pandit.org. January 2002. Archived from the original on 11 December 2008. Retrieved 8 June 2009.
- ↑ Pathak, Shekhar Gupta Rahul (15 May 1994). "Specter of subversion looms over India as Pakistan sponsored arms, mercenaries and funds from Muslim world pour in to destabilise Kashmir". India Today (in ఇంగ్లీష్). Retrieved 2019-05-02.
- ↑ Gannon, Kathy (1999-12-31). "Hopes for end to jet hijack". The Independent. London. Archived from the original on 2008-12-21. Retrieved 2009-02-11.
- ↑ "'Kandahar hijack was India's diplomatic failure'".
- ↑ Jaleel, Muzamil (6 June 2016). "After Kandahar swap, India offered Taliban cash to get me: JeM chief". London: The IndianExpress. Archived from the original on 2016-11-07. Retrieved 5 November 2017.
- ↑ "Even without Kandahar, Azhar may have walked out". The Indian Express. 17 December 2008.
- ↑ Hussain, Zahid (2000-01-05). "Freed Militant Surfaces". Associated Press. Archived from the original on 2000-09-01. Retrieved 2008-01-07.
- ↑ Tanner, Marcus (2001-12-17) Pakistan blamed by India for raid on parliament. The Independent
- ↑ "Terrorist Attack on the Parliament of India". Embassy of India – Washington DC. 18 డిసెంబరు 2001. Archived from the original on 11 జూన్ 2010. Retrieved 12 డిసెంబరు 2018.
- ↑ "From Kashmir to the FATA: The ISI Loses Control". Global Bearings. 28 October 2011. Archived from the original on 27 January 2012.
- ↑ "Indian fury over freed militant". BBC News. 2002-12-14. Archived from the original on 2009-01-03. Retrieved 2008-01-08.
- ↑ Friedman, Thomas (2009-02-17). "No Way, No How, Not Here". The New York Times. Retrieved 2010-05-17.
- ↑ Indian Muslims hailed for not burying 26/11 attackers, Sify News, 2009-02-19, archived from the original on 2010-10-23, retrieved 2010-10-19
- ↑ "D Sivanandan to be new police chief of Mumbai". The Times of India. June 14, 2009. Archived from the original on 15 June 2009. Retrieved 2020-09-19.
- ↑ Rajeswari Pillai Rajagopalan, New Terror Attack Exposes India’s Limited Options, The Diplomat, 15 February 2019
- ↑ "Pulwama attack: India will 'completely isolate' Pakistan". BBC (in ఇంగ్లీష్). 16 February 2019. Retrieved 16 February 2019.
- ↑ "Jaish terrorists attack CRPF convoy in Kashmir, kill at least 38 personnel". The Times of India. 15 February 2019. Retrieved 15 February 2019.
- ↑ Pulwama Attack 2019, everything about J&K terror attack on CRPF by terrorist Adil Ahmed Dar, Jaish-eMohammad, India Today, 16 February 2019.