జ్ఞానస్నానం
జ్ఞానస్నానం లేక బాప్తిజం (గ్రీకు పదమైన బాప్తిస్మా నుంచి వచ్చింది) అన్నది ఒక వ్యక్తిని మతపరమైన క్రతువు ద్వారా నీటిని ఉపయోగిస్తూ క్రైస్తవంలోకి స్వీకరించడానికి చేసే క్రైస్తవ మత సంస్కారం.[1][2][3]
క్రైస్తవ ధార్మిక సువార్త ప్రకారం ఏసుక్రీస్తు జ్ఞానస్నాతుడయ్యాడు.[4][5][6][7] జ్ఞానస్నానాన్ని ఏసుక్రీస్తు విధించిన పవిత్ర సంస్కారంగానూ, పవిత్ర విధిగానూ చెప్తారు.[8][9] కొన్ని సందర్భాల్లో క్రైస్తవీకరణ (Christening) అని జ్ఞానస్నానాన్ని పిలిచినా సాధారణంగా క్రైస్తవీకరణ అన్న పదం పసిపిల్లలకు చేసే జ్ఞానస్నానాన్ని సూచిస్తుంది.[10] బాప్తిజం అన్న పదాన్ని, ఈ ప్రక్రియను అనుసరించి బాప్తిస్ట్ చర్చిలకు ఆ పేరు వచ్చింది.
తొలినాళ్ళ క్రైస్తవులలో జ్ఞానస్నానం ప్రక్రియను నిర్వర్తించడానికి నీటిలో పాక్షికంగానో, పూర్తిగానో తడపడం తప్పినసరిగా ఉండేది, ఆ వ్యక్తిని పూర్తిగా నదులు, కాలువలు, కొలనులు వగైరాల్లో ముంచడం కానీ, పాక్షికంగా నిలబెట్టి వారిపై నీటిని పోయడం కానీ చేసేవారు.
మతం కోసం బలిదానం చేసినవారిని చర్చి చరిత్రలో రక్తంతో జ్ఞానస్నాతులయ్యారని గుర్తించింది, తద్వారా నీటి ద్వారా జ్ఞానస్నానం కాని బలివీరులు రక్షింపబడినట్టు చెప్పేందుకు సాధ్యపడింది. తర్వాత కాథలిక్ చర్చి మరణానికి ముందు జ్ఞానస్నానం పొందాలని ప్రయత్నించి, క్రతువు జరిగేలోగానే మరణించినవారు "కోర్కె ద్వారా జ్ఞానస్నానం" పొందినవారిగా గుర్తించింది.[11] పసిపిల్లలకు జ్ఞానస్నానం చేయించే క్రైస్తవ సాధారణ ఆచారాన్ని పరిశీలిస్తే, 16వ శతాబ్దిలో స్విట్జర్లాండ్‌కు చెందని క్రైస్తవ మత సంస్కర్త హుల్‌డ్రైచ్ జ్వింగ్లి జ్ఞానస్నానం తప్పనిసరి అని అమలుచేయడాన్ని నిరసించేవరకూ, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరికీ జ్ఞానస్నానం అన్నది రక్షణకు, ముక్తికి (సాల్వేషన్) ఒక విధంగా తప్పనిసరి అన్న భావం ఉన్నట్టు తెలుస్తుంది.[12]
క్వాకర్లు, ద సాల్వేషన్ ఆర్మీ వంటి మతశాఖల వారు నీటికి బదులు పవిత్ర ఆత్మ ద్వారా జ్ఞానస్నానం (బాప్తిజం విత్ ద హోలీ స్పిరిట్) అన్న పద్ధతిని అనుసరిస్తారు.[13] నీటితో జ్ఞానస్నానం చేసే పద్ధతుల్లో కూడా, జ్ఞానస్నానం ప్రక్రియ విషయంలో, ఆ క్రతువు ప్రాధాన్యతను గుర్తించడం విషయంలో భేదాలున్నాయి. ఎక్కువమంది క్రైస్తవులు "తండ్రి, కుమారుడు, పవిత్రాత్మల పేర్ల మీదుగా" జ్ఞానస్నానం పొందుతారు.[14] (తర్వాత కొందరు ఆ వరుసలో గ్రేట్ కమిషన్ పేరును చేరుస్తారు) అయితే కొందరు కేవలం ఏసుక్రీస్తు పేరు మీదుగా మాత్రమే జ్ఞానస్నాతులవుతారు. మొత్తం 210 కోట్ల మంది క్రైస్తవుల్లో,[15][16] ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా క్రైస్తవులు పసిపిల్లలను జ్ఞానస్నానం చేయిస్తారు. పసిపిల్లలకు జ్ఞానస్నానం చేయించడం కేథలిక్ చర్చి అనుసరించేవారిలో (1,100,000,000), తూర్పు సంప్రదాయ చర్చికి చెందిన (225,000,000), అత్యధికులైన ఆంగ్లికన్ కమ్యూనియన్, లూథరన్, తదితరుల్లో (77,000,000) పసిపిల్లలకు జ్ఞానస్నానం చేయించడం ఉంది.[17][18][19] మిగతా వారు యుక్తవయస్సు వచ్చి నమ్మకాన్ని నిర్ధారించగలిగే విశ్వాసుల జ్ఞానస్నానమే నిజమైన జ్ఞానస్నానమని భావిస్తారు. కొందరు కనీసం మునగడం, కనీసం పాక్షికంగానైనా మునిగేలా తడవడం జ్ఞానస్నానం చేయించడానికి అవసరమని భావిస్తూండగా, మిగతావారు ఏదోక రూపంలో తల మీదుగా నీరు పడుతూంటే చాలని నమ్ముతున్నారు. బాప్తైజ్‌డ్ అన్న పదానికి ఎవరైనా వ్యక్తి పవిత్రీకరింపబడడం, ప్రారంభించడం చేసే ఏ సందర్భం కానీ, అనుభవం కానీ, ప్రక్రియకు కానీ వర్తించేలా వాడుక ఉంది.[20]
ప్రక్రియ
మార్చుతొలినాళ్ళ క్రైస్తవులలో జ్ఞానస్నానాన్ని పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ నీటిలో తడపడం ద్వారా చేసేవారు. అయితే పండితుల్లో ఈ తడపడం అనేది ఎలా జరిగేదన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి:
- తొలి శతాబ్దాల జ్ఞానస్నానం సాధారణంగా నీటిలో తడపడం ద్వారా చేసేవారు. అయితే అది పూర్తిగా నీటిలో ముంచడం అవనక్కరలేదు. వ్యక్తులు మోకాళ్ళపై కానీ, పూర్తిగా కానీ నిల్చొని జ్ఞానస్నాన సరస్సులో ఉండగా వారిపై నీటిని పోస్తూండడాన్ని తొలి క్రైస్తవ మొజాయిక్‌లలో చూడవచ్చు.[21]
- జ్ఞానస్నానపు సాధారణమైన పద్ధతి నీటితో ముంచడం.. అయితే అనారోగ్యంతో ఉన్నవారికి, మరణశయ్యపై ఉన్నవారికి, పూర్తిగా మనిషిని ముంచడం సాధ్యంకాని స్థితిలో ఉన్న ఇతర సందర్భాల్లోనూ జ్ఞానస్నానం చేయవలసివచ్చినప్పుడు నీటిని చల్లడం, మీద పోయడం వంటివి తొలినాళ్ళలో (సా.శ. రెండవ శతాబ్ది చివరిలోనూ, సా.శ. మూడవ శతాబ్ది తొలినాళ్ళలోనూ) జరిగేవి.[22]
- నీటిని పోయడం ద్వారా జ్ఞానస్నానం చేసే సందర్భాల్లో పోసేవారు జ్ఞానస్నానం చేయించుకుంటున్న వ్యక్తి పూర్తిగా నీటితో తడిసిపోయేలా పోయాల్సివుంటుంది.[23]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ St. Paul: Romans 8:15 "the spirit of adoption" ("of sonship" RSV), Galatians 4:5 "adoption of sons", Ephesians 1:15 "the adoption of children by Jesus Christ" ("to be his sons through Jesus Christ" RSV).
- ↑ "Baptism", Encyclopædia Britannica
- ↑ ఉదాహరణకు, "కాథలిక్ చర్చిలో జ్ఞానస్నాతుడయ్యాడు లేక బాప్తైజ్ అయ్యాడు" (Second Vatican Council, Lumen gentium, 28 Archived సెప్టెంబరు 6, 2014 at the Wayback Machine
- ↑ మూస:Bibleref2, మూస:Bibleref2, మూస:Bibleref2
- ↑ Powell, Mark Allen (2005). Jesus as a figure in history : how modern historians view the man from Galilee (7th pr. ed.). Louisville: Knox. p. 47. ISBN 0-664-25703-8.
- ↑ Harrington, Daniel J. (1991). The Gospel of Matthew. Collegeville, MI: Liturgical Press. p. 63. ISBN 0-8146-5803-2.
- ↑ Lopez, Kathryn Muller Lopez (2010). Christianity : a biblical, historical, and theological guide for students. et alli (1st ed.). Macon, GA: Mercer University Press. pp. 95–96. ISBN 0-88146-204-7.
- ↑ Faelli, Rita (2006), Christianity: History, Beliefs, Worship and Celebrations, Blake Education, p. 23, ISBN 9781741641011
- ↑ Church of England: Weddings, Baptisms & Funerals, Anglican
- ↑ Wootten, Pat (2002), Christianity, Heinemann, p. xiv, ISBN 9780435336349
- ↑ "The Necessity of Baptism". Catechism of the Catholic Church. Vatican Publishing House. 1993. Archived from the original on February 21, 2009. Retrieved February 24, 2009.
- ↑ Cross, Frank Leslie; Elizabeth A. Livingstone (2005). "Baptism". The Oxford Dictionary of the Christian Church. Oxford: Oxford University Press. pp. 151–154. ISBN 0-19-280290-9. OCLC 58998735.
- ↑ Cross, Anthony R. (2012-12-06). Recovering the Evangelical Sacrament: Baptisma Semper Reformandum. Wipf and Stock Publishers. ISBN 978-1-62032-809-5.
- ↑ Rite for the Baptism of One Child, Catholic liturghy, archived from the original on 2018-07-27, retrieved 2018-07-23
- ↑ Christians in the World, Number of
- ↑ World religions, Ontario: Consultants on Religious Tolerance, archived from the original on 2021-01-25, retrieved 2018-07-23
- ↑ Religious Bodies of the World with at Least 1 Million, Adherents, archived from the original on 2013-10-05, retrieved 2010-07-20
- ↑ Major Denominational Families of Christianity, Adherents, archived from the original on 2015-03-15, retrieved 2010-07-20
- ↑ Worldwide Adherents of All Religions by Six Continental Areas, Mid-1995, zPub, archived from the original on 2017-11-12, retrieved 2010-07-20
- ↑ Pickett, Joseph P, ed. (2000). "baptism". The American Heritage Dictionary of the English Language (4th ed.). Boston: Houghton Mifflin. ISBN 0-395-82517-2. Archived from the original on December 7, 2008. Retrieved February 24, 2009.
- ↑ Holy Baptism; and, Services for the Renewal of Baptism: The Worship of God, Presbyterian Church (USA), Westminster Press, 1985, p. 54, ISBN 0-664-24647-8
- ↑ Schaff, Philip (2009). "Baptism". History of the Christian Church, Volume I: Apostolic Christianity. A.D. 1–100.
- ↑ Taylor, Joan E (1997), The Immerser: John the Baptist within Second Temple Judaism, William B. Eerdmans Publishing Co., p. 54, ISBN 0-8028-4236-4