కాశీనాయన

ఒక ఆధ్యాత్మిక గురువు
(జ్యోతి (కాశీనాయన మండలం) నుండి దారిమార్పు చెందింది)

కాశీనాయన, ఒక ఆధ్యాత్మిక గురువు. ఇతను ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సీతారామపురం మండలం లోని బెడుసుపల్లిలో జన్మించాడు. కాశమ్మ, సుబ్బారెడ్డి ఇతని తల్లిదండ్రులు. ఈ దంపతులకు ఇతను రెండవ సంతానం. ఇతని పూర్వ నామం మున్నల్లి కాశిరెడ్డి. బాల్యంలో ఇతను, గురువు అతిరాచ గురువయ్యచే ప్రభావితుడయ్యాడు.[1] అనేక తీర్థయాత్రలు చేశాడు. కాశీ నుండి కన్యాకుమారి వరకు అనేక క్షేత్రాలను దర్శించాడు. అతను 1999 డిసెంబరు 6 న మరణించాడు.

Kasinayana
కాశీనాయన
కాశీనాయన
జననంకాశిరెడ్డి
(1895-01-15)1895 జనవరి 15
నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామపురం మండలంలోని బెడుసుపల్లి
నిర్యాణము1999 డిసెంబరు 6(1999-12-06) (వయసు 104)
తండ్రిసుబ్బారెడ్డి
తల్లికాశమ్మ
కడప జిల్లా జ్యోతి క్షేత్రంలోని శ్రీ అవధూత కాశీనాయన మందిరం (కాశీనాయన సమాధి)

కాశీనాయన మండలం

మార్చు

1995 డిసెంబరు 5వ తేదీ రాత్రి ( 1995 డిసెంబరు 6న ) మరణించిన ఇతని జ్ఞాపకార్ధం కడప జిల్లాలోని నరసాపురం కేంద్రంగా కాశినాయన పేరిట రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసింది.

కాశీనాయన ఆరాధనోత్సవాలు

మార్చు

అతని పేరు మీద కడప జిల్లాలో జ్యోతి క్షేత్రం వెలసింది. కాశినాయన సమాధి ప్రదేశం ఏడవ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది. కాశీనాయన పేరు మీద ఇక్కడ ఒకపెద్ద దేవాలయం నిర్మిస్తున్నారు. వీటి నిర్వహణకు సహకరిస్తున్న భక్తుల సహకారం చాలా ముఖ్యమైంది. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా కాశిరెడ్డి నాయన భక్తులు, కడప జిల్లాలోని కాశినాయన మండలం లోని జ్యోతి క్షేత్రంలో కాశి నాయన ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రం ఆళ్ళగడ్డకు 50 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. క్షేత్రానికి వచ్చిన వేలాదిమందికి అన్నదానం చేయించే ప్రక్రియను కాశినాయన ముందుగానే చేయించాడు. పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి, అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా కాశినాయన ఏర్పాటు చేసారు.

కాశీనాయన ఆశ్రమాలు

మార్చు

కాశినాయన పేరు మీద తెలుగు నేల మీద దాదాపు వందకు పైగా అశ్రమాలు, గుళ్ళు వెలిశాయి. ఇప్పుడు కాశినాయన ఆశ్రమాలు వెలసిన ప్రతి చోట విరివిగా గోసంపద పోషింపబడుతూ నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు.

  • జ్యోతి క్షేత్రం
  • కాశీనాయన ఆశ్రమం, ఆత్మకూరు: ఈ ఆశ్రమం లో శివునితో పాటు గాయత్రీ మాత, అయ్యప్ప స్వామి, సరస్వతి మాత కొలువై ఉన్నారు. ఇచ్చట నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు.

కాశీనాయనపై పుస్తకాలు

మార్చు

అతని జీవితంపై ఎన్నో పుస్తకాలు ముద్రించబడ్డాయి.

  • సమర్థ సద్గురు కాశీనాయన అనురాగ జీవితం, సంకలనం: శ్రీ కాశీనాయన పాదరేణువులు
  • అవధూత కాశీరెడ్డి నాయన సంపూర్ణ చరిత్ర, రచయత: ప్రోలు సుబ్బారెడ్డి

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కాశీనాయన&oldid=4361015" నుండి వెలికితీశారు