టప్ప రోషనప్ప
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2017) |
టప్ప రోషనప్ప భారత స్వాతంత్ర్యసమరయోధుడు.[1]
జీవిత విశేషాలు
మార్చుఆయన స్వాతంత్ర్యోద్యమం నుంచి తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమానికి బాసటగా నిలిచారు. నిత్యం సమాజం కోసం రైతుల కోసం ఆర్యసమాజం కోసం తన వంతు కృషి చేసారు. స్వతంత్ర ఉద్యమ సమయంలో రజాకర్లకు ఎదురోడి చేసిన పోరాటలను చేసారు.[2] రైతుల కోసం యజ్ఞ యాగాలు చేయడం వల్ల వర్షాలు వస్తాయని అనేక యజ్ఞ కార్యక్రమాలను మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తుండేవారు. అంటరాని తనం, కుల వివక్ష పోవాలని ఆర్య సమాజం ద్వారా కార్యక్రమాలు నిర్వహించేవారు. విద్యార్థుల్లో ఆరోగ్య శరీర దారుఢ్యం పెరగడానికి యోగా చేయాలని సూచించేవారాయన.[3]
ఆయనకు భార్య శంకరమ్మతో పాటు ఇద్దరు కుమారులు, రమేష్, వివేక్, నలుగురు కుమార్తెలు ఇందిరమ్మ, సుభద్రమ్మ, జయమ్మ, లక్ష్మి ఉన్నారు. ఆయన ఫిబ్రవరి 9 2017 న తన 92వ యేట మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎస్ దవాఖానాలో మరణించారు.