టికంగఢ్

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

టికంగఢ్ మధ్యప్రదేశ్‌ రాష్ట్రమ్, టికంగఢ్ జిల్లా లోని పట్టణం.. [1] ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. టికంగఢ్ పూర్వపు పేరు తెహ్రీ (అనగా త్రిభుజం) లో మూడు కుగ్రామాలున్నాయి. వీటిని కలిపే రేఖలు సుమారుగా ఒక త్రిభుజం లాగా ఉంటాయి. టికంగఢ్ పట్టణంలో ఇప్పటికీ 'పురానీ తెహ్రీ' (పాత తెహ్రీ) అని పిలువబడే ప్రాంతం ఉంది. 1947 లో భారత స్వాతంత్ర్యం వరకు, గతంలో తెహ్రీ అనే టికంగఢ్`, ఓర్చా రాజ్యంలో భాగంగా ఉండేది. దీనిని 16 వ శతాబ్దంలో బుందేలి చీఫ్ రుద్ర ప్రతాప్ సింగ్ స్థాపించాడు. అతను ఓర్చా మొదటి రాజు అయ్యాడు. 1783 లో రాష్ట్ర రాజధాని ఓర్చా నుండి 40 కి.మీ. దూరంలో ఉన్న తెహ్రీకి తరలించబడింది. ఇక్కడ టికంగఢ్ కోట ఉండేది. చివరికి ఈ కోట పేరే పట్టణానికి వచ్చింది.

టికంగఢ్
పట్టణం
టికంగఢ్
టికంగఢ్ లోని ప్రభుత్వ పిజి కాలేజి
టికంగఢ్ లోని ప్రభుత్వ పిజి కాలేజి
టికంగఢ్ is located in Madhya Pradesh
టికంగఢ్
టికంగఢ్
Location in Madhya Pradesh, India
Coordinates: 24°44′50″N 78°51′00″E / 24.74722°N 78.85000°E / 24.74722; 78.85000
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
ప్రాంతంబుందేల్‌ఖండ్
డివిజనుసాగర్
జిల్లాటికంగఢ్
Named forకృష్ణుడు (టీకం)
విస్తీర్ణం
 • Total21 కి.మీ2 (8 చ. మై)
Elevation
349.170 మీ (1,145.571 అ.)
జనాభా
 (2011)[1]
 • Total79,106
 • జనసాంద్రత3,800/కి.మీ2 (9,800/చ. మై.)
భాష
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
472001 (HPO)
టెలిఫోన్ కోడ్07683
Vehicle registrationMP-36

శీతోష్ణస్థితి

మార్చు
శీతోష్ణస్థితి డేటా - Tikamgarh (1981–2010, extremes 1968–2011)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 36.2
(97.2)
37.5
(99.5)
41.6
(106.9)
47.1
(116.8)
47.5
(117.5)
46.6
(115.9)
45.0
(113.0)
41.0
(105.8)
39.0
(102.2)
38.3
(100.9)
36.1
(97.0)
33.3
(91.9)
47.5
(117.5)
సగటు అధిక °C (°F) 24.8
(76.6)
27.8
(82.0)
33.7
(92.7)
38.9
(102.0)
41.9
(107.4)
40.0
(104.0)
33.7
(92.7)
31.9
(89.4)
32.7
(90.9)
33.2
(91.8)
30.1
(86.2)
26.3
(79.3)
32.9
(91.2)
సగటు అల్ప °C (°F) 7.6
(45.7)
10.1
(50.2)
15.2
(59.4)
20.8
(69.4)
24.6
(76.3)
25.6
(78.1)
23.9
(75.0)
23.7
(74.7)
23.1
(73.6)
18.0
(64.4)
12.0
(53.6)
8.5
(47.3)
17.8
(64.0)
అత్యల్ప రికార్డు °C (°F) 0.2
(32.4)
0.5
(32.9)
5.0
(41.0)
7.6
(45.7)
11.6
(52.9)
16.0
(60.8)
16.0
(60.8)
16.0
(60.8)
8.0
(46.4)
10.0
(50.0)
3.2
(37.8)
0.0
(32.0)
0.0
(32.0)
సగటు వర్షపాతం mm (inches) 11.5
(0.45)
9.2
(0.36)
6.6
(0.26)
1.7
(0.07)
5.6
(0.22)
65.7
(2.59)
277.4
(10.92)
225.5
(8.88)
150.8
(5.94)
29.9
(1.18)
5.2
(0.20)
2.8
(0.11)
792.0
(31.18)
సగటు వర్షపాతపు రోజులు 0.6 1.0 0.8 0.2 0.9 3.8 10.8 10.3 6.5 0.9 0.4 0.4 36.5
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 65 60 55 41 41 51 72 77 75 65 62 62 60
Source: India Meteorological Department[3][4]

జనాభా వివరాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, టికంగఢ్‌లో 79,106 జనాభా ఉంది, వీరిలో 41,399 మంది పురుషులు, 37,707 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 9,376. పట్టణంలో అక్షరాస్యత 74.9%. పురుషుల అక్షరాస్యత 79.2%, స్త్రీల అక్షరాస్యత 70.3%. టికంగఢ్‌ జనాభాలో ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 85.0%. ఇందులో పురుషుల అక్షరాస్యత 90.0%, స్త్రీల అక్షరాస్యత 79.6%. షెడ్యూల్డ్ కులాల జనాభా 11,779, షెడ్యూల్డ్ తెగల జనాభా 1,424. 2011 లో టికంగఢ్‌లో 14587 గృహాలు ఉన్నాయి. [1]

రవాణా

మార్చు

జాతీయ రహదారులు, NH-12A, SH-37, SH-10 టికంగఢ్ నుండి వెళ్తున్నాయి.

టికంగఢ్‌కు రైల్వే లైన్ నిర్మాణం 2012 లో పూర్తయింది. 2013 ఏప్రిల్ 26 న లలిత్‌పూర్ (ఉత్తర ప్రదేశ్) నుండి టికంగఢ్ వరకు రైలు సేవలు ప్రారంభమయ్యాయి. రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించిన మొదటి రైలు టికంగఢ్- ఝాన్సీ (ఉత్తర ప్రదేశ్) ప్యాసింజర్ రైలు. 2012–13 రైల్వే బడ్జెట్‌లో రెండు స్టేషన్ల మధ్య రైలు మంజూరైంది. టికంగఢ్, లలిత్‌పూర్ రైలు మార్గం పొడవు 52 కిలోమీటర్లు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Census of India: Tikamgarh". www.censusindia.gov.in. Retrieved 23 November 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 7 జనవరి 2021.
  3. "Station: Tikamgarh Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 741–742. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
  4. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M133. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=టికంగఢ్&oldid=3584689" నుండి వెలికితీశారు