జనగణన పట్టణం. అనేది ఒక రకమైన పట్టణం. ఇది ఉన్న దేశాన్ని బట్టి, దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి.జనగణన పట్టణాలును చట్టబద్ధమైన పట్టణాలుగా పరిగణించుతారు.వీటిని నిర్వచించటంలో భారత జనాభా గణాంకాల శాఖ ప్రముఖ పాత్ర వహించింది. రెండు తెలుగు రాష్ట్రాలైన 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో జనగణన పట్టణాలు 104, అలాగే తెలంగాణ రాష్ట్రంలో 116 జనగణన పట్టణాలు ఉన్నాయి.

భారతదేశం మార్చు

అధికారికంగా పట్టణం అని ప్రకటించనిది, ఒక పట్టణం లాగా నిర్వహించబడనిదీ, కానీ జనాభా ప్రకారం అది పట్టణ లక్షణాలు ఉన్న దాన్ని భారతదేశంలో జనగణన పట్టణం అంటారు. [1] అలాంటి పట్టణాలకు కింది లక్షణాలు ఉంటాయి:

  • 5,000 పైబడిన జనాభా.
  • పురుష శ్రామిక జనాభాలో కనీసం 75% ప్రధానంగా వ్యవసాయేతర రంగాల్లో పనిచేస్తారు
  • కనీస జన సాంద్రత చదరపు కిలోమీటరుకు 400 ఉంటుంది.[2] [3]

భారతదేశంలో జనగణన పట్టణాలకు ఉదాహరణలు: తెలంగాణలోని ఘట్‍కేసర్, బాచుపల్లి ఆంధ్రప్రదేశ్‌లో పీలేరు, వడ్డేశ్వరం

2011 జనగణన మార్చు

భారతదేశంలో జనాభా గణన పట్టణాల సంఖ్య 2001లో 1,362 ఉండగా, 2011 నాటికి 3,894 కు పెరిగింది.[4] ప్రధాన్ (2013) ప్రకారం, [5] గత దశాబ్దంలో పట్టణప్రాంతాల వృద్ధిలో ఈ జనగణన పట్టణాల వాటా 30% వరకు ఉంది. [6] పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో జనగణన పట్టణాల సంఖ్య అత్యధికంగా పెరిగిందని ప్రధానమంత్రి అవాస్ యోజన ద్వారా తెలుస్తుంది.

పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటన మార్చు

జనగణన పట్టణాలను పట్టణ ప్రాంతాలుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వ పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2016 మేలో వివిధ రాష్ట్రాలను కోరింది. [7] ఈ ప్రాంతాల ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం చట్టబద్ధమైన పట్టణ స్థానిక సంస్థ (యుఎల్‌బి) ఏర్పడాలంటే వాటి మార్పిడి అవసరం అనేది ప్రభుత్వ వాదన. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ఒక ప్రకటనలో ఇలా అన్నాడు:

" ఓ ప్రణాళిక లేకుండా, తాత్కాలిక ప్రాతిపదికన చాలా కాలం పాటు మౌలిక సదుపాయాలను నిర్మించుకుంటూ పోతే, ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధికి అవకాశం కోల్పోవచ్చు."

ఈ పట్టణాలకు చట్టబద్ధమైన హోదా ఇస్తే అదనంగా లాభం పొందవచ్చని కూడా కేంద్రం రాష్ట్రాలకు తెలియజేసింది. ఎక్కువ సంఖ్యలో చట్టబద్ధమైన పట్టణాలు ఉన్నందున, 14 వ ఆర్థిక కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రాలు కేంద్రం నుండి ఎక్కువ డబ్బు పొందగలవని తెలిపింది. ఇంకా అదనంగా, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) పథకం కింద, ఈ రాష్ట్రాలు / యుటిలకు నిధుల కేటాయింపును నిర్ణయించడానికి అక్కడున్న చట్టబద్ధమైన పట్టణాల సంఖ్యను బట్టి 50% అదనపు ప్రయోజనం లభిస్తుందని కూడా తెలిపింది.. 

ఈ ప్రకటన తరువాత, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 19 జనగణన పట్టణాలను చట్టబద్ధమైన యుఎల్‌బిలుగా మార్చింది. [8] ఈ 19 జనగణన పట్టణాలు పూణే పట్టణానికి సమీపంలోనే ఉన్నాయి. ఈ మార్పిడి వలన నగరం లోని మౌలిక సదుపాయాలపై జనాభా ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.

ఐర్లాండ్ మార్చు

ఐర్లాండ్ కేంద్ర గణాంకాల కార్యాలయం ప్రకారం, "చట్టబద్దమైన సరిహద్దులు లేకుండా యాభై లేదా అంతకంటే ఎక్కువ ఆక్రమిత నివాసాల సమూహాన్ని కలిగి ఉండి, దీనిలో ముప్పై నివాస గృహాల సముదాయం 800 మీటర్ల దూరంలో రహదారికి ఇరువైపులా ఉన్నా, లేదా రహదారికి ఒక వైపున ఇరవై ఇళ్ళు ఉన్నా" దాన్ని జనగణన పట్టణంగా పరిగణిస్తారు. ఇవి స్పష్టమైన సరిహద్దులుండి, స్థానిక స్వపరిపాలన ఉండే మునిసిపల్ పట్టణాల కంటే ఇవి భిన్నంగా ఉంటాయి.అయితే స్థానిక ప్రభుత్వ సంస్కరణ చట్టం 2014 ద్వారా మునిసిపల్ పట్టణాలను రద్దు చేసారు.

మూలాలు మార్చు

  1. Ramachhandran, M. (13 February 2012). "Rescuing cities from chaos". The Hindu Business Line. Retrieved 13 September 2020.
  2. "Census of India: Some terms and definitions" (PDF). Census of India. Retrieved 13 September 2020.
  3. "New Census Towns Showcase New India", Mint.
  4. "Census of India 2011 - Paper 2" (PDF). Retrieved 13 September 2020.
  5. Pradhan (2013)
  6. "Unacknowledged Urbanisation". Economic and Political Weekly. 48 (36). 2015-06-05.
  7. "States asked to convert 3,784 urban areas into statutory Urban Local Bodies". pib.nic.in. Retrieved 13 September 2020.
  8. "19 new civic bodies to boost urbanization in Pune - Times of India". The Times of India. Retrieved 13 September 2020.

బయటి లింకులు మార్చు