టిప్పు గా పేరు పొందిన ఎల్. ఎన్. ఏకాంబరేష్ తమిళనాడుకు చెందిన సినీ నేపథ్య గాయకుడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 4000 కి పైగా పాటలు పాడాడు.[1][2]

టిప్పు
జననం
ఎల్. ఎన్. ఏకాంబరేష్ [1]

(1978-11-01) 1978 నవంబరు 1 (వయస్సు 43)[1]
వృత్తిగాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
జీవిత భాగస్వామిహరిణి
పిల్లలుసాయి స్మృతి, సాయి అభయంకర్
తల్లిదండ్రులు
  • ఎస్. లక్ష్మీ నారాయణన్ (తండ్రి)
  • ఎమ్. కె. మీనాక్షి (తల్లి)

వ్యక్తిగత జీవితంసవరించు

టిప్పు అసలు పేరు ఏకాంబరేష్. నవంబరు 1, 1978 న తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలోని పొన్మలై లో లక్ష్మీ నారాయణన్, మీనాక్షి దంపతులకు జన్మించాడు. ఇతనికి ఒక అక్క గాయత్రి, చెల్లెలు నిత్య ఉన్నారు. టిప్పు కామరాజ్ మెట్రిక్ స్కూల్, సెయింట్ జాన్స్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాడు.

గాయని హరిణి ఇతని భార్య. వీరికి సాయి స్మృతి, సాయి అభయంకర్ అనే ఇద్దరు పిల్లలున్నారు.

పురస్కారాలుసవరించు

టిప్పు కు 2007 లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారం లభించింది.[3] 2010 లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గాయకుడిగా పురస్కారం లభించింది.[4]

పాటలుసవరించు

టిప్పు పాడిన కొన్ని ప్రజాదరణ పొందిన పాటలు.

  • ఉన్నమాట చెప్పనీవు (సినిమా: నువ్వు నాకు నచ్చావ్)
  • లంగా ఓణి నేటితో రద్దై పోనీ (సినిమా: వర్షం)
  • రారా సరసకు (సినిమా: చంద్రముఖి)
  • నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి (సినిమా: సింహాద్రి)

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 http://www.lakshmansruthi.com/tipu/profile.asp
  2. Tippu, IMDb, retrieved 28 November 2008
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-01-31. Retrieved 2017-12-27.
  4. http://entertainment.oneindia.in/kannada/news/2011/vishnuvardhan-anu-prabhaka-ksf-awards-201011.html
"https://te.wikipedia.org/w/index.php?title=టిప్పు&oldid=2897027" నుండి వెలికితీశారు