టిమోన్ అండ్ పుంబా
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
టిమోన్, పుంబా (ఆంగ్లం: Timon and Pumbaa) యానిమేటెడ్ మీర్కాట్, అడవి పంది. వీటి తొలి పరిచయం 1994లో డిస్నీ యానిమేటెడ్ చిత్రం ద లయన్ కింగ్ తో జరిగింది.[1] 2019లో విడుదలైన ద లయన్ కింగ్ చిత్రంలో ఈ పాత్రలు బిల్లీ ఐచ్నెర్, సెథ్ రొగన్ పొషించారు.[2][3]
ద లయన్ కింగ్ లోని చాలా పేర్లు లాగా పుంబా కూడా ఈస్ట్ ఆఫ్రికన్ భాష స్వాహిలి భాష నుండి వచ్చింది. స్వాహిలిలో పుంబా అంటే.. తెలివి తక్కువ, బుద్ధి లేని, అజాగ్రత్త, నిర్లక్ష్యధోరణి.. అని అర్ధం.[4] టిమోన్ కు స్వాహిలిలో అర్ధము లేదు; టిమోన్ ఒక చారిత్రక గ్రీక్ పేరు, దాని అర్థం.. గౌరవం. టిమోన్ పేరు కూడా బహుశా షేక్‌స్పియర్ విషాదగాద టిమోన్-ఏథెన్స్ నుంచి ఉద్భవించి ఉంటుంది.
టిమోన్ ఒక తెలివైన మీర్కాట్. తను ఎప్పుడూ పుంబా ఆలోచనలు తన సొంత ఆలోచనలుగా ప్రదర్శిస్తుంది. నిజానికి పుంబా ఒక భయంకరమైన యోధుడు, తనను ఎవరైనా పంది అని పిలిస్తే "ఎవరు నన్ను మిస్టర్ పంది అని పిలిచారు!" అని వారిపై దాడి చేస్తాడు.[5]
ప్రదర్శనలు
మార్చుద లయన్ కింగ్
మార్చుటిమోన్, పుంబా పాత్రలు నాథన్ లేన్, ఎర్నీ సబెల్లా పోషించారు. టిమోన్ ని తయారు, యానిమేట్ చేసి రూపొందించినవారు మైఖేల్ సర్రే. వారి మొదటి చిత్ర ప్రదర్శన 1994లో జరిగింది. టిమోన్, పుంబా రాబందుల నుండి సింబాను కాపాడి, తనను ఒక కొలను దగ్గరకు తీసుకుని వెళ్ళి మేల్కొలుపుతారు. సింబా మేల్కున్న తర్వాత వారిరువురు, తామ పరిచయం చేసుకుని స్వాగతం పలుకుతారు, తరువాత సింబా వారితో ఉండి వారు అనుసరించే "హకూన మటాట" తత్వశాస్త్రాన్ని అనుకరిస్తాడు. మొదట టిమోన్, పుంబాల జీవనశైలిని చూసి సింబా అయోమయానికి గురవుతాడు. తరువాత తనకు "హకూన మటాట" అంటే ఏమిటో ఒక పాట రూపంలో వీరిరువురు అర్ధం చెప్తారు.[6]
అనేక సంవత్సరాల తరువాత, పాడుతూ నడుస్తున్న టిమోన్, పుంబా ఒక పురుగును వెంబడిస్తూ వెళ్తారు, అది వాళ్ళని అరణ్యంలో ఆకలితో అలమటిస్తున్న ఆడ సింహము (నాలా) దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆమె దగ్గర నుండి సింబా వాళ్ళను కాపాడతాడు. ఆ రెండు సింహాలు సంఘర్షణలో ఉన్నప్పుడు ఆడ సింహము నాలా సింబాను తన చిన్ననాటి తోటి చెలికాడిగా గుర్తిస్తుంది. వారు సంతోషంగా కలిసి ఉండటం చూసి, టిమోన్ కు ఈర్ష్య కలుగుతుంది, తర్వాత అతను, పుంబా కలిసి "కెన్ యు ఫీల్ ద లవ్ టునైట్?" అనే పాట పాడుతారు. చివరకు వారిరువురి సహాయంతో సింబా స్కార్ ని ఓడించి మృగరాజు స్థానాన్ని తిరిగి సంపాదించుకుంటుంది.[7]
ద లయన్ కింగ్ (2019)
మార్చుబిల్లీ ఐచ్నెర్, సెథ్ రొగన్ లు టిమోన్, పుంబా పాత్రలు పొషించారు. 2019లో ఈ చిత్రం తెరకెక్కింది.[8]
ద లయన్ కింగ్ లో టిమోన్ & పుంబా
మార్చుటిమోన్, పుంబా వారి జీవితాలపై దృష్టి పెడుతుంది. వారిరువురు కలిసి అడవిలో చేసిన దుస్సాహసాలను సందర్శించడం యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో టీ.వి.లో ప్రసారం చేసారు. టిమోన్ పుంబాను కలవక ముందు అతనికి ఫ్రెడ్ అనే ఒక ఉత్తమ స్నేహితుడు ఉండేవాడు. పుంబా ఒకసారి వార్తొంగ్ సౌండర్ లో ఒక సభ్యుడు, కాని అతను పూర్తిగా పెరిగిన తరువాత, వారు అతని దుర్వాసన వలన అతనిని బహిష్కరించారు, ఎందుకంటే అది వార్తొంగ్ ప్రమాణాలకన్నా భయంకరంగా ఉంటుంది.[9]
ఇతర ఆడి
మార్చువారు ఖెల్లాగ్స్ సెరెల్ "చాక్లెట్ మడ్ & బగ్స్" ప్యాకేజింగ్ మీద కనిపిస్తారు.[10]
ద జంగిల్ బుక్ 2 సినిమాలో టిమోన్, పుంబా "W-I-L-D" అనే పాటలో నాట్యం చేస్తుంటే వారిని బాలు అనే ఎలునుబంటు వెనక్కు విసిరేస్తుంది.
వాల్ట్ డిస్నీ పార్క్స్ అండ్ రిసార్ట్స్
మార్చుటిమోన్ వాల్ట్ డిస్నీ పార్క్స్ అండ్ రిసార్ట్స్ లో ఒక పాత్రగా కనిపిస్తుంది. పుంబా కూడా కనిపిస్తుంది. టిమోన్, పుంబాను డిస్నీ వరల్డ్ లో పిల్లలు, తల్లిదండ్రులకు భద్రత సమస్యలు అర్థం అయ్యేలాగా చెప్పడానికి ఉపయొగిస్తారు.[11]
References
మార్చు- ↑ "HERE'S THE ONE THING YOU NEVER KNEW ABOUT 'THE LION KING'". Archived from the original on 3 జనవరి 2018. Retrieved 28 May 2018.
- ↑ http://www.comingsoon.net/movies/news/841623-timon-and-pumbaa
- ↑ "The Lion King stars look back on the making of the animated hit". Retrieved 28 May 2018.
- ↑ "Pumba" in Swahili-English Dictionary
- ↑ "Heroes Wikia=Pumba". Retrieved 26 May 2017.
- ↑ "The Lion King IMDB". Retrieved 26 May 2018.
- ↑ "Disney The Lion King Worldwide". Retrieved 26 May 2018.
- ↑ "Seth Rogen and Billy Eichner to Play Pumbaa and Timon in 'Lion King' (Exclusive)". TheWrap. April 25, 2017. Retrieved April 26, 2017.
- ↑ "Disney Wikia-Timon and Pumba". Retrieved 26 May 2018.
- ↑ https://www.mrbreakfast.com/cereal_detail.asp?id=247title=Kellog's - MUD & BUGS. Retrieved 26 May 2018.
- ↑ "Where To Find Lion King Characters At Disney World". Retrieved 26 May 2018.