టి.కె.స్వామినాథ పిళ్ళై

తిరువలపుత్తూర్ స్వామినాథ పిళ్ళై తమిళనాడుకు చెందిన భరతనాట్య కళాకారుడు, నాట్యాచార్యుడు.

ఆరంభ జీవితంసవరించు

ఇతడు పేరుమోసిన భరతనాట్య కళాకారిణి తిరువలపుత్తూర్ కళ్యాణి అమ్మాళ్ మొదటి కుమారుడు. ఇతని కుటుంబం తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరువలపుత్తూరు గ్రామానికి చెందిన ఇసై వెల్లాల కులానికి చెందినది. ఇతనికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వీరు కూడా భరతనాట్య కళాకారులే. ఇతని తమ్ముడు తిరువలపుత్తూర్ కృష్ణమూర్తి పిళ్ళై వయోలిన్ విద్వాంసుడు, కళైమామణి పురస్కార గ్రహీత. అతడు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఎన్.సి.వసంతకోకిలం, మదురై సోము మొదలైన కళాకారులకు వాద్య సహకారం అందించాడు.

నాట్య వృత్తిసవరించు

ఇతడి బాల్యం నుండి కళల పట్ల ముఖ్యంగా నాట్యం పట్ల ఆసక్తి ఉండేది. ఇతడు పందనల్లూర్ మీనాక్షి సుందరం పిళ్ళై వద్ద భరతనాట్యం 12 సంవత్సరాలపాటు గురుకుల పద్ధతిలో శిక్షణ తీసుకున్నాడు. ఇతడు తన గురువుతో పాటు అనేక నాట్య కార్యక్రమాలను నిర్వహించాడు. అనేక మంది శిష్యులకు భరతనాట్యం నేర్పించాడు. తరువాత ఇతడు చెన్నైకి మారి వళువూర్ బి. రామయ్య పిళ్ళైతో కలిసి నాట్యాచార్యుడిగా వృత్తిని ప్రారంభించాడు.

కుటుంబంసవరించు

ఇతనికి ఒక కుమారుడు. అతడు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. అతడు కుంభకోణంలో కౌన్సిలర్‌గా మూడు పర్యాయాలు సేవలందించాడు.

శిష్యులుసవరించు

ఇతని శిష్యులలో వళువూర్ సామ్రాజ్, ఎల్.విజయలక్ష్మి, స్వామిమలై రాజరత్నం పిళ్ళై, హేమా మాలిని, శ్రీప్రియ, జీవరత్నమాల మొదలైన వారున్నారు.

అవార్డులు, గుర్తింపులుసవరించు

ఇతడు "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" నుండి కళైమామణి పురస్కారాన్ని పొందాడు. 1909లో కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి భరతనాట్యంలో అవార్డును స్వీకరించాడు.

మరణంసవరించు

ఇతడు 1972, మార్చి 13వ తేదీన మరణించాడు.

మూలాలుసవరించు