ఎస్.సోమసుందరం

మదురై ఎస్.సోమసుందరం (ఫిబ్రవరి 9, 1919 – డిసెంబర్ 9, 1989) ఒక కర్ణాటక గాత్రసంగీత విద్వాంసుడు.[1]

మదురై ఎస్.సోమసుందరం
Madurai somu.jpg
మదురై సోము
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఎస్.పరమశివం
జననం(1919-02-19)1919 ఫిబ్రవరి 19
మరణం1989 డిసెంబరు 9(1989-12-09) (వయస్సు 70)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వాయిద్యాలుగాత్రం
క్రియాశీల కాలం1934-1989

విశేషాలుసవరించు

ఇతని అసలు పేరు పరమశివం. ఇతడు 1919, ఫిబ్రవరి 9న సచ్చిదానందం పిళ్ళై, కమలంబాళ్ దంపతులకు 10వ సంతానంగా జన్మించాడు. ఇతని తాత శ్రీనివాస పిళ్ళై నాదస్వర విద్వాంసుడు. ఇతని తండ్రి సచ్చిదానందం పిళ్ళై న్యాయస్థానంలో గుమాస్తాగా పనిచేసేవాడు. ఇతని కుటుంబం మొదట స్వామిమలైలో నివసించేది. తన తండ్రికి మదురై బదిలీ కావడంతో మదురైకి మకాం మార్చాడు. తన సోదరులతో కలిసి ఇతడు ముత్తు ఒడయార్ వద్ద కర్రసాము, కుస్తీ నేర్చుకున్నాడు. ఇతని తల్లి తన కుమారుడికి నాదస్వరం నేర్పించాలని భావించింది. ఐతే ఇతడు గాత్ర సంగీతంవైపు మొగ్గు చూపాడు. ఇతడు మదురై దేవాలయంలో నారాయణ కోనర్ ఆలపించే భజనల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇతడు తన సంగీతాన్ని సేతు సుందరేశ భట్టర్ వద్ద ప్రారంభించాడు. తరువాత మదురై లక్ష్మణ చెట్టియార్, శేషం భాగవతార్, అభిరామి శాస్త్రియర్, మదురై తిరుప్పుగళ్ మణి, చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళైల వద్ద తన సంగీతాన్ని మెరుగు పరుచుకున్నాడు. ఇతడు 1934లో తిరుచందూరు దేవస్థానంలో సోమసుందరేశ్వరుని సన్నిధిలో తన మొదటి కచేరీని చేశాడు. ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని ఇతని తల్లి ఇతని పేరును పరమశివం నుండి "సోమసుందరం"గా మార్చింది.[1]

పురస్కారాలుసవరించు

ఇతనికి భారతప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది.[2]కేంద్ర సంగీత నాటక అకాడమీ 1978లో కర్ణాటక గాత్ర సంగీత విభాగంలో అవార్డు ప్రకటించింది.[3] 1983లో ది ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై ఇతడిని సంగీత కళాశిఖామణి బిరుదుతో గౌరవించింది.[4] అన్నామలై విశ్వవిద్యాలయం ఇతడిని గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.[5]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Venkatraman, Shankar (2019-07-11). "The incomparable genius of Madurai Somu". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2019-10-13.
  2. "List of Padma Shri award recipients (1970–1979)", Wikipedia (in ఇంగ్లీష్), 2019-03-22, retrieved 2019-05-29
  3. "Sangeet Natak Akademi Award", Wikipedia (in ఇంగ్లీష్), 2019-05-27, retrieved 2019-05-29
  4. "Welcome to The Indian Fine Art Society". www.theindianfineartssociety.com. Archived from the original on 2018-09-26. Retrieved 2019-05-29.
  5. Says, Govinda Lal Baba. "Madurai Somasundaram – Legend 1 – Compiled by Sashi Kulkarni & T.V. Ramprasadh | eAmbalam" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-05-29.

బయటి లింకులుసవరించు