టి.సుండుపల్లె మండలం

ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా లోని మండలం

టి.సుండుపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్నమయ్య జిల్లాకు చెందిన మండలం.[3]OSM గతిశీల పటము

మండలం
నిర్దేశాంకాలు: 13°59′10″N 78°54′32″E / 13.986°N 78.909°E / 13.986; 78.909Coordinates: 13°59′10″N 78°54′32″E / 13.986°N 78.909°E / 13.986; 78.909
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండల కేంద్రంటి.సుండుపల్లె
విస్తీర్ణం
 • మొత్తం346 కి.మీ2 (134 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం57,140
 • సాంద్రత170/కి.మీ2 (430/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి979


మండలంలోని విశేషాలుసవరించు

ఈ మండలంలో మూడు చోట్ల మెగాలిథిలిక్ సమాధులు ఉన్నాయి. అవి దేవావాండ్ల పల్లె, సుండుపల్లె నుండి సీతంపేటకు పోయే దారిలో ఒకచోట, పింఛా గ్రామం వద్ద ఒకచోట ఉన్నాయి.

ఝరికోన జలాశయంసవరించు

ఈ జలాశయాన్ని, రు. 33కోట్ల అంచనా వ్యయంతో, 2006 లో మొదలుపెట్టి, 2010లో నిర్మాణం పూర్తి చేసారు. దీని ముఖోద్దేశ్యం ఏమిటంటే, రాయచోటి పట్టణానికి త్రాగునీటి సరఫరా మరియూ సంబేపల్లి, కె.వి.పల్లె, సుండుపల్లె మండలాలకు సాగునీరు అందించడం. కానీ దీనికి అనుసంధానంగా కాలువలు ఇంతవరకూ నిర్మించకపోవడంతో ఈ జలాశయం ఇంకా ఉపయోగంలోనికి రాక, నిరుపయోగంగా ఉంది. [3]

గుండుగుహసవరించు

బాహుదానది తూర్పుభాగంలో శేషాచల కొండల నడుమ ఒక గుహ ఉంది. చూడపచ్చని వాతావరణంలో ఉన్న దీనిని, "గుండుగుహ", "మేకపోతు గని"గా పిలుస్తారు. రాయవరం పంచాయతీ, కావలిపల్లి గ్రామానికి దిగువన ఉన్న ఈ గుహ, సుండుపల్లెకు 15 కి.మీ. దూరంలోనూ, రాయచోటికి 37 కి.మీ. దూరంలోనూ ఉంది. ఇందులో 5 కి.మీ. కాలినడకన వెళ్ళవలసియుంటుంది. ఇక్కడి కొండ, బయటి భాగంలో శేషుని ఆకారంలో ఉంటుంది. గుహలోపలికి వెళ్ళడానికి చిన్న కన్నం ఉంటుంది. ఇది ఒక మేకపోతు గుండును ఢీ కొనడం వలన అది పగిలి, మనిషి వెళ్ళేటంత దారి ఏర్పడినదని ప్రతీతి. అందుకే దీనిని "గుండు గుహ" అని పిలుస్తారు. లోపల శివుని చిత్రం ఉంది. పౌర్ణమి, అమావాస్య, శ్రావణ, కార్తీక మాసాలలో పూజలు చేసెదరు.

జిల్లాలోని నదులు ఎండిపోయినా, ఇక్కడ నిత్యం జలం పారుతూ ఉంటుంది. వేసవిలోనూ ఇక్కడ చల్లని వాతావరణం ఉంటుంది. దీనిని పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దితే, ఎక్కువ మంది దర్శించటానికి అనువుగా ఉంటుంది. [4]

మండల గణాంకాలుసవరించు

మండల కేంద్రము టి.సుండుపల్లె
గ్రామాలు 12
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2001) - మొత్తం 53,013 - పురుషులు 27,060 - స్త్రీలు 25,953
అక్షరాస్యత (2001) - మొత్తం 54.96% - పురుషులు 69.11% - స్త్రీలు 40.18%

గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Y.S.R%20-%202018.pdf.
  2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2820_2011_MDDS%20with%20UI.xlsx.
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2019-01-17.

వెలుపలి లంకెలుసవరించు