టీనియా సోలియమ్ (Taenia solium) మానవులలో ఉండే సాధారణ పరాన్న జీవి. పంది మాంసం (pork) తినే మానవుల పేగుల్లో ఈ బద్దెపురుగు జీవిస్తుంది. ఇది ద్వంద్వ అతిథేయి పరాన్న జీవి. మానవుడు ప్రధాన అతిథేయి. పంది మాధ్యమిక అతిథేయి.

టీనియా సోలియమ్
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
టీ.సోలియమ్
Binomial name
టీనియా సోలియమ్

జీవిత చక్రం

మార్చు
 
టీనియా సోలియమ్ జీవిత చక్రం.

టీనియా సోలియమ్ జీవిత చక్రం కొంత పందిలోనూ కొంత మనిషిలోనూ జరుగుతుంది.

పంది ఆంత్రమూలంలోకి చేరిన కంటక గోళాలు ఎంజైమ్ ల ప్రభావం వలన కర్పరం, పిండస్తరాలు జీర్ణమై షట్కంటకి విడుదలవుతుంది. అది కొక్కేల సహాయంతో ఆంత్రకుడ్యానికి అతుక్కుంటుంది. ఒక జత ప్రవేశక గ్రంథుల స్రావాలతో పేగు గోడను తొలిచి, కాలేయ నిర్వహక వ్యవస్థ ద్వారా కాలేయాన్ని చేరుతుంది. అక్కడ నుంచి పరమహాసిర ద్వారా గుండెను చేరుతుంది. రక్తప్రవాహం ద్వారా పంది కండరాల్లో స్థిరపడుతుంది. కొక్కేలను కోల్పోయి సిస్టిసర్కస్ (Cysticercus) గా మారుతుంది. వెలుపలి వైపు అవభాసిని, లోపలి వైపు జననస్తరం ఏర్పడతాయి. సిస్టిసర్కస్ గోడ లోపలికి అంతర్వర్తనం చెందడం వల్ల ప్రోస్కోలెక్స్ ఏర్పడుతుంది. ఈ దశను పరిణితి చెందిన సిస్టిసర్కస్ లేదా తిత్తి పురుగు అంటారు. ఇలా పరిణితి చెందడానికి సుమారు పది వారాలు పడుతుంది.

మనిషి

మార్చు

పూర్తిగా ఉడకని పంది మాంసాన్ని తింటే బద్దెపురుగు మనిషిలోకి ప్రవేశిస్తుంది. మనిషి జీర్ణాశయంలో డింభకం చుట్టూ ఉన్న తంతుయుత పొర కరిగిపోయి, ప్రోస్కోలెక్స్ బహిర్గతమవుతుంది. ఇది చూషకాలు, కొక్కేల సాయంతో పేగు గోడలకు అతుక్కుంటుంది. క్రమేపీ మెడ నుండి ఖండితాలు ఏర్పడటంతో స్ట్రోబైలా రూపొంది తిత్తి అదృశ్యమవుతుంది. దాదాపు 3 నెలల కాలంలో ప్రౌఢజీవిగా మారుతుంది.

వ్యాధి లక్షణాలు

మార్చు

ప్రౌఢ పరాన్న జీవులు కలిగించే వ్యాధిని 'టినియాసిస్' (Taeniasis) అంటారు. కడుపునొప్పి, రక్తహీనత, ఆహార ప్రసరణకు అవరోధం వల్ల వాంతులు, అజీర్ణం ఈ వ్యాధి లక్షణాలు.