బద్దెపురుగు
సెస్టోడా జీవులు (లాటిన్ Cestoda) ప్లాటిహెల్మింథిస్ వర్గానికి చెందినవి. సాధారణంగా వీటిని 'బద్దెపురుగులు' (Tape worms) అంటారు. ఇవి అన్నీ పరాన్న జీవులు.
Cestoda | |
---|---|
Taenia saginata | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | Cestoda
|
Orders | |
Subclass Cestodaria |
సాధారణ లక్షణాలు
మార్చు- శరీర రక్షణ కోసం టెగ్యుమెంట్ అనే సిన్ సీషియల్ అవభాసినితో ఆవరించి ఉంటుంది.
- శరీరం ప్రోగ్లాటిడ్స్ గా విభజన చెంది (మిధ్యాఖండీభవనం) అపరిపక్వ, పరిపక్వ గ్రీవఖండితాలను కలిగి ఉంటుంది.
- శరీర పూర్వాంతాన్ని స్కోలెక్స్ అంటారు. దీనికి చూషకాలు, కొక్కెములు ఉంటాయి. ఇవి అతిథేయి శరీరానికి అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి.
- జీర్ణవ్యవస్థ లేదు.
- ద్విలింగ జీవులు.
- జీవితచరిత్రలో కొక్కేలు గల షట్కంటకి పిండం ఉంటుంది.
- మిధ్యాఖండీభవనం గల జంతువులలో కొత్త ప్రోగ్లాటిడ్లు శరీర పూర్వభాగం (మెడభాగం) నుంచి ఏర్పడతాయి. (నిజ ఖండీభవనం గల జీవులలో కొత్త ఖండితాలు శరీర పరభాగం నుంచి ఏర్పడతాయి. ఉదా. వానపాము)