టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయం

టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయం ( టాము లెదా ఏ అండ్ ఎం) అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని టెక్సాస్ రాష్ట్రం, కాలేజ్ స్టేషన్ అనే ప్రాంతంలో వున్న ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం. ఇది దేశంలో నాలుగో అతి పెద్ద, టెక్సాస్ రాష్ట్రంలో అతి పెద్ద విశ్వవిద్యాలయం. నాసా, ఎన్ ఎస్ ఎఫ్ మొదలైన సాంకేతిక పరిశోధన సంస్థల యొక్క ఆర్థిక సాంత్వనతో వివిధ రకాలైన పరిశోధనలు ఈ విద్యాలయం కొనసాగిస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని 20 మేటి పరిశోధనా విద్యాలయాల్లో ఇది ఒకటి. 

ఈ విశ్వవిద్యాలయం 1876 అక్టోబరు 4 లో టెక్సాస్ వ్యవసాయ, మెకానికల్ కళాశాల గా మొదలైంది[1]. అందువలన ఈ కళాశాల పేరులో ఏ అండ్ ఎం (Agriculture లోని 'A', Mechanical లోని 'M') అనే అక్షరాలు చేరాయి. 5,200 ఎకరాలతో ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన ప్రాంగణం దేశం మొత్తంలోనే అతి పెద్దది[2]. ఈ విశ్వవిద్యాలయంలో సుమారు 1000 కి పైగా విద్యార్థి సంఘాలు ఉన్నాయి.  

టెక్సాస్ ఏ అండ్ ఎం యొక్క అకాడెమిక్ భవనం

 

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2010-06-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-06-27. Cite web requires |website= (help)
  2. "టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలం గురించి కొంత భోగట్టా". మూలం నుండి 2012-12-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-07. Cite web requires |website= (help)