టెలిపతీ లేదా భావ గ్రాహక ప్రసారణ శక్తి (గ్రీకులో టెలీ అంటే దూరంగా ఉన్న అనీ, పాతోస్ అంటే అనుభూతి లేదా అనుభవం అని అర్థం) [1][2] అంటే ఎటువంటి జ్ఞానేంద్రియాలను వాడకుండా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి సమాచారాన్ని చేరవేయడం. ఈ పదాన్ని మొట్టమొదటి సారిగా ఫ్రెడరిక్ మయ్యర్స్ అనే మానసిక శాస్త్ర  పరిశోధకుడు, పండితుడు మొట్టమొదటిసారిగా 1882 లో ప్రయోగించాడు.[3] అంతకుముందు ఇలాంటి భావనలను పేర్కొనేందుకు థాట్ ట్రాన్స్ ఫర్ అనే పేరు ఉండేది. ఈ పేరు దానికన్నా ప్రాచుర్యం పొందింది.[4][5]

ప్రారంభ టెలిపతి ప్రయోగాలను నిర్వహించిన గిల్బర్ట్ ముర్రే

టెలిపతీ అనేది నిజం అనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. దీన్ని కనుక్కోవడానికి, అర్థం చేసుకోవడానికి, వాడుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ వేటిలోనూ సమానమైన ఫలితాలు కనిపించలేదు.[6][7][8][9] దీన్ని కాల్పనిక సాహిత్యంలో కథానాయకులకు, సూపర్ హీరోలకు ఆపాదిస్తూ అనేక రచనలు వచ్చాయి.

పునాది

మార్చు

పాశ్చాత్య నాగరికతలో టెలిపతీకి 19వ శతాబ్దపు రెండో అర్ధబాగంలో బీజం పడిందని చెప్పవచ్చు.[10] భౌతిక శాస్త్రంలో శక్తివంతమైన ఆవిష్కరణలు జరగడంతో కొన్ని శాస్త్రీయ విషయాలను మానసిక పరిస్థితులకు (ఉదా. జంతువులలో అయస్కాంత శక్తి) కూడా అన్వయించడం ప్రారంభించారు. దీని ద్వారా విపరీత మానసిక ప్రవర్తనలను అర్థం చేసుకోవచ్చని భావించారు. టెలిపతీ ఒక ఆధునిక భావనగా ఇక్కడే ఆవిష్కృతమైంది.[10]

టెలీపతీ అనేది ఎవరో తమలో ఆలోచనలు ప్రేరేపిస్తున్నారనో, లేదా ఆలోచనలు తీసివేస్తున్నారనే భావన కన్నా కొత్తదేం కాదు. కానీ దీనివల్ల ఒక వ్యక్తి టెలీపతీకి గురవుతున్నారా లేదా అని నిర్ధారించవచ్చు. ఆలోచనలు చొప్పించడం లేదా తీసివేయడం అనేది సైకోసిస్ లేదా ఇంకా కచ్చితంగా చెప్పాలంటే స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధికి సూచన.[11] దీని భాదితులు కొన్ని ఆలోచనలు తమవి కావనీ, ఎవరో (ఇతర వ్యక్తులు, గ్రహాంతర వాసులు, దయ్యాలు లేదా దేవతలు, గూఢచారి సంస్థలు) తమలో కొన్ని ఆలోచనల్ని ప్రవేశపెడుతున్నారని భావిస్తుంటారు. మరికొంతమంది తమలో ఆలోచనలు తొలగిస్తున్నారని భావిస్తుంటారు. ఈ లక్షణాలన్నింటినీ యాంటీసైకోటిక్ మందుల ద్వారా తగ్గించుకోవచ్చు. సైకియాట్రిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు కొన్ని పరిశోధనా ఫలితాల ఆధారంగా స్కైజోటైపీ అనే మానసికవ్యాధి ఉన్నవారు టెలీపతీని నమ్ముతారని విశ్వసిస్తున్నారు.[12][13][14]

ఆలోచనలు చదవడం

మార్చు

19 వ శతాబ్దపు చివరి భాగంలో వాషింగ్టన్ ఇర్వింగ్ బిషప్ అనే ఇంద్రజాలికుడు ఇతరుల మనసులోని ఆలోచనలు చదవడం లేదా గ్రహించడం అనే భావనమీద ప్రదర్శనలు ఇచ్చేవాడు. కానీ బిషప్ మాత్రం తనకు ఏ విధమైన మానవాతీత శక్తులు లేవని తాను కేవలం కండరాలు కదలిక (అసంకల్పితంగా శరీరంలో కనిపించే కదలికలు) ద్వారా ఆలోచనలు గ్రహిస్తున్నానని తెలియ జేశాడు.[15] బిషప్ ను బ్రిటిష్ మెడికల్ జర్నల్ సంపాదకుడితో కూడిన కొంతమంది వైద్యుల బృందం, ఫ్రాన్సిస్ గాల్టన్ అనే మానసిక వైద్యుడు పరీక్షించారు. బిషప్ ఒక టేబుల్ పై అవతలి వ్యక్తి మనసులో తలుచుకున్న ప్రదేశాన్ని కనిపెట్టడం, దాచిన వస్తువును కనుగొనడం లాంటి కొన్ని విజయవంతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. కానీ ప్రయోగం జరిగేటప్పడు బిషప్ అవతలి వ్యక్తి శరీరాన్ని తాకేవాడు. వారి చేతిని, మణికట్టును పరీక్షించేవాడు. కానీ శాస్త్రజ్ఞులు మాత్రం బిషప్ నిజమైన టెలిపాత్ కాదనీ, అతను కేవలం శరీర కదలికలను పరీక్షించే నైపుణ్యంతో ఆ విధంగా కనుగొన గలుగుతున్నాడని తేల్చారు.[16]

  1. Telepathy.
  2. Following the model of sympathy and empathy.
  3. Hamilton, Trevor (2009). Immortal Longings: F.W.H. Myers and the Victorian search for life after death. Imprint Academic. p. 121. ISBN 978-1-84540-248-8.
  4. Carroll, Robert Todd (2005). "The Skeptic's Dictionary; Telepathy". Skepdic.com. Retrieved 2006-09-13.
  5. Glossary of Parapsychological terms - Telepathy Archived 2006-09-27 at the Wayback Machine — Parapsychological Association.
  6. Felix Planer. (1980). Superstition. Cassell. p. 218. ISBN 0-304-30691-6 "Many experiments have attempted to bring scientific methods to bear on the investigation of the subject. Their results based on literally millions of tests, have made it abundantly clear that there exists no such phenomenon as telepathy, and that the seemingly successful scores have relied either on illusion, or on deception."
  7. Jan Dalkvist (1994). Telepathic Group Communication of Emotions as a Function of Belief in Telepathy. Dept. of Psychology, Stockholm University. Retrieved 5 October 2011. Within the scientific community however, the claim that psi anomalies exist or may exist is in general regarded with skepticism. One reason for this difference between the scientist and the non scientist is that the former relies on his own experiences and anecdotal reports of psi phenomena, whereas the scientist at least officially requires replicable results from well controlled experiments to believe in such phenomena - results which according to the prevailing view among scientists, do not exist.
  8. Willem B. Drees (28 November 1998). Religion, Science and Naturalism. Cambridge University Press. pp. 242–. ISBN 978-0-521-64562-1. Retrieved 5 October 2011. Let me take the example of claims in parapsychology regarding telepathy across spatial or temporal distances, apparently without a mediating physical process. Such claims are at odds with the scientific consensus.
  9. Spencer Rathus. (2011). Psychology: Concepts and Connections. Cengage Learning. p. 143. ISBN 978-1111344856 "There is no adequate scientific evidence that people can read other people's minds. Research has not identified one single indisputable telepath or clairvoyant."
  10. 10.0 10.1 Roger Luckhurst. (2002). The Invention of Telepathy, 1870-1901. Oxford University Press. ISBN 978-0199249626
  11. Richard Noll. (2007). The Encyclopedia of Schizophrenia and Other Psychotic Disorders. Facts on File. p. 359. ISBN 978-0816064052
  12. Graham Pickup. (2006). Cognitive Neuropsychiatry. Volume 11, Number 2, Number 2/March 2006. pp. 117-192
  13. Andrew Gumley, Matthias Schwannauer. (2006). Staying Well After Psychosis: A Cognitive Interpersonal Approach to Recovery and Relapse Prevention. Wiley. p. 187. ISBN 978-0470021859 "Schizotypy refers to a normal personality construct characterised by an enduring tendency to experience attenuated forms of hallucinatory (e.g. hearing one's own thoughts) and delusional experiences (e.g. beliefs in telepathy)."
  14. Mary Townsend. (2013). Essentials of Psychiatric Mental Health Nursing: Concepts of Care in Evidence-Based Practice. F. A. Davis Company. p. 613. ISBN 978-0803638761 "Individuals with schizotypal personality disorder are aloof and isolated and behave in a bland and apathetic manner. Magical thinking, ideas of reference, illusions, and depersonalization are part of their everybody world. Examples include superstitiousness, belief in clairvoyance, telepathy, or "six sense;" and beliefs that "others can feel my feelings."
  15. Roger Luckhurst. (2002). The Invention of Telepathy: 1870-1901. Oxford University Press. p. 63. ISBN 978-0199249626
  16. Richard Wiseman. (2011). Paranormality: Why We See What Isn't There. Macmillan. p. 140-142. ISBN 978-0-230-75298-6
"https://te.wikipedia.org/w/index.php?title=టెలిపతీ&oldid=4243334" నుండి వెలికితీశారు