ది టైం మెషీన్

(టైం మెషీన్ నుండి దారిమార్పు చెందింది)


ది టైం మెషీన్ లేదా కాల యంత్రం పాశ్చాత్య సైన్సు ఫిక్షన్ రచయిత హెచ్.జి.వెల్స్ సృష్టి. 1895 లో ఇది ప్రచురితమైంది. ఈ పుస్తకం ద్వారా ఏదైనా వాహనంలోనో, పరికరం ద్వారా కూర్చునో మనం అనుకున్న భూత, భవిష్యత్ కాలాలను సందర్శించవచ్చుననే భావన విశ్వవ్యాప్తమయింది.[1]

ది టైమ్ మెషీన్
The_Time_Machine_(H._G._Wells,_William_Heinemann,_1895)_title_page.jpg
First edition cover
కృతికర్త: హెచ్. జి. వెల్స్
ముఖచిత్ర కళాకారుడు: బెన్ హార్డీ
దేశం: ఇంగ్లండ్
భాష: ఇంగ్లీషు
విభాగం (కళా ప్రక్రియ): సైన్స్ ఫిక్షన్ నవల
ప్రచురణ: విలియం హెయిన్ మన్
విడుదల: 1895
ప్రచురణ మాధ్యమం: అచ్చు పుస్తకం

ఇప్పటి దాకా ఈ పుస్తకాన్ని ఇదే పేరుతో మూడు సినిమాల రూపంలోనూ, రెండు టీవీ ధారావాహికలుగానూ, ఎన్నో కామిక్ పుస్తకాల రూపంలో ప్రచురించబడింది. పరోక్షంగా ఎన్నో సినిమాలు, పుస్తకాలు, ఇతర మాధ్యమాలు రావడానికి కారణమైంది.

చరిత్ర సవరించు

వెల్స్ ఈ నవల రాయకముందే 1888 లో ది క్రానిక్ ఆర్గోనాట్స్ అనే కథలో కాలంలో ప్రయాణించడం గురించి ఊహించాడు. ఇది కళాశాల వార్తాపత్రికలో ప్రచురింపబడింది. టైమ్ మెషీన్ నవలకు ఇదే పునాది.

నవలగా రాయాలనే ఆలోచన రాకమునుపు వెల్స్ పాల్ మాల్ గెజిట్ అనే పత్రికలో కాలంలో ప్రయాణం గురించి వరసగా వ్యాసాలు రాయాలనుకున్నాడు. కానీ ప్రచురణ కర్త ముందుకువచ్చి ఇదే అంశం మీద నవలగా రాయమనడంతో వెల్స్ ఈ రచనకు పూనుకున్నాడు. ఇందు కోసం ప్రచురణ కర్త హీన్ మాన్ వెల్స్ కు అప్పట్లో 100 పౌండ్లు చెల్లించారు. ఇది ది న్యూ రివ్యూ పత్రికలో 1895 జనవరి నుంచి మే దాకా ధారావాహికగా ప్రచురించబడింది. హెన్రీ హోల్ట్ అండ్ కంపెనీ దీన్ని 1895 మే 7 తేదిన మొదటి సారిగా పుస్తక రూపంలో ప్రచురించబడింది.[2] అదే సంవత్సరంలో హీన్ మ్యాన్ కూడా ఒక పుస్తకాన్ని ప్రచురించాడు.[3] ఈ రెండు సంచికల్లో పాఠ్యంలో తేడాలున్నాయి. ఈ రెండు పుస్తకాలు పేరు ఒకటే అయినా ఒకదాన్ని హోల్ట్ టెక్స్ట్ అనీ మరో దాన్ని హీన్ మ్యాన్ టెక్స్ట్ అని వ్యవహరించేవారు. ప్రస్తుతం వస్తున్న పునర్ముద్రణలన్నీ హీన్ మ్యాన్ టెక్స్ట్ ఆధారంగా వస్తున్నవే.

మూలాలు సవరించు

  1. Pilkington, Ace G. (2017). Science Fiction and Futurism: Their Terms and Ideas. McFarland. p. 137.
  2. "Rare edition of "The Time Machine" acquired". UCR Newsroom. University of California, Riverside. 2010-02-09. Archived from the original on 2015-04-02. Retrieved 2015-10-31.
  3. Hammond, John R. (2004). H. G. Wells's The Time Machine: A Reference Guide. Westport, CT: Praeger. ISBN 978-0313330070.