ట్యూబెక్టమీ (Tubectomy) ఒక శాశ్వతమైన కుటుంబ నియంత్రణ పద్ధతి. ఈ పద్ధతిలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఫాలోపియన్ నాళాలు రెండు వైపులా శస్త్రచికిత్స ద్వారా కత్తిరిస్తారు. స్త్రీల అండాశయం నుంచి విడుదలైన అండము ఫాలోపియన్ నాళం ద్వారా గర్భకోశంలోనికి ఫలదీకరణం తర్వాత చేరడాన్ని ఇది నిరోధిస్తుంది.