భారతదేశంలో కుటుంబ ప్రణాళిక ఎక్కువగా భారత ప్రభుత్వం అనుసరించే ప్రయత్నాలు ఆధారంగా కుటుంబ నియంత్రణ జరుగుతుంది. 1965-2009 సం.ల మధ్య కాలంలో, గర్భ నిరోధకం వాడుక ప్రయత్నాలు (1970 లో వివాహం అయిన మహిళలు 13% నుండి 2009 లో 48% అయింది) మూడింతల కంటే ఎక్కువ పెరిగి, సంతానోత్పత్తి రేటు, ( 1966 లో 5.7 నుండి 2012 లో 2.4 అయింది) సగం కంటే ఎక్కువగా ఉంది. కానీ జాతీయ ఉత్పత్తి రేటు ఇప్పటికీ దీర్ఘకాల జనాభా పెరుగుదల కారణం తగినంత అధికం ఉంది. భారతదేశం ప్రతి 20 రోజులకు దాని జనాభాతో 1, 000, 000 మంది వరకు కొత్తగా జతచేస్తుంది.[1][2][3][4][5]

సంతానోత్పత్తి రేటు ఉన్న దేశాల మ్యాప్: భారతదేశం యొక్క సంతానోత్పత్తి రేటు దాని పరిసరాల్లో కొన్ని దేశాలలో కంటే తక్కువ, కానీ చైనా, ఇరాన్ కంటే ఇది గణనీయంగా ఎక్కువగా ఉంది

గర్భ నిరోధకం వాడుక

 
భారతదేశంలో కుటుంబ నియంత్రణ చిహ్నం ఎర్ర త్రికోణం.

తక్కువ మహిళా అక్షరాస్యత స్థాయిలు, గర్భ నియంత్రణ పద్ధతులు విస్తృతంగా లభ్యత లేకపోవడం భారతదేశం గర్భనిరోధకం ఉపయోగం దెబ్బతీస్తున్నాయి. గర్భనిరోధకం అవగాహన భారతదేశంలో వివాహం అయిన మహిళల్లో దాదాపు విశ్వవ్యాప్తంగా ఉంది.[6]

అయితే, వివాహం అయిన భారతీయులు ఎక్కువమంది (ఒక 2009 అధ్యయనంలో 76%) గర్భ నిరోధక పద్ధతులను, వాటి ఎంపిక ప్రాప్తి పొందడానికి ముఖ్యమైన సమస్యలు నివేదించారు.[3]

రోజురోజుకీ పెరుగుతున్న జనాభాతో వర్ధమాన దేశాలు సతమతమవుతున్నాయి. జననాలు బాగా తగ్గి స్పెయిన్ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జననాల సంఖ్య తగ్గించేందుకు మన దేశంలో ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే, స్పెయిన్ దానికి విరుద్ధంగా పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఎక్కువమంది పిల్లల్ని భరించే శక్తిలేదని మన దేశం వాపోతోంటే, పిల్లల సంఖ్య తగ్గిపోయిందని స్పెయిన్ దేశం ఆవేదన చెందుతోంది. ప్రతి వెయ్యిమందికి సగటున 22.69 శాతం జననాల రేటుతో, ఇప్పటికే భారత జనాభా 1.12 బిలియన్లకు చేరుకుంది. కేవలం 10.06 శాతం జననాల రేటుతో 45 మిలియన్లు మాత్రమే జనాభా ఉన్న స్పెయిన్ ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్పెయిన్లో జననాల రేటు పెరగడానికి కొత్తగా ఒక పాప లేదా బాబుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పిల్లలను పెంచుకునే తల్లిదండ్రులకు స్పెయిన్ ప్రభుత్వం 2, 500 యూరోల (139500 రూపాయల) ఆర్థిక బహుమతి ప్రకటించింది. ఇండియాలో జనసాంద్రత కి.మీ.కి 336 మంది. అదే స్పెయిన్ లో 88 మంది.

ప్రోత్సాహకాలు

మన దేశంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి ఎస్‌సీ, ఎస్‌టీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకుంటే ట్యూబెక్టమీకి రూ.1350, వేసెక్టమీకి రూ. 1300 ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రోత్సాహక నగదుగా మహిళకు రూ.600, పురుషుడైతే రూ.1150 ఇస్తారు. ఆశ కార్యకర్తలకు ప్రోత్సాహకంగా మహిళను తీసుకొస్తే రూ.150, మగ అయితే రూ.200 నగదును అందిస్తున్నారు. జననీ సురక్ష యోజన పథకం ద్వారా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించుకునే మహిళకు రూ.700 నగదు ఇస్తారు. ఒక సంతానం చాలనుకునే దంపతులను లక్కీడీప్‌ ద్వారా గుర్తించి జిల్లాకు ఒక్కరికి రూ.10 వేలు నగదు ప్రోత్సాహకంగా వైద్య ఆరోగ్య శాఖ అందిస్తుంది.ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) సందర్భంగా అన్ని పేదదేశాల్లో ఆపరేషన్ చేయించుకున్న దంపతులకు లక్ష రూపాయల ఆర్థిక బహుమతిని వరల్డ్ బ్యాంక్ సహకారంతో ప్రకటించితే బాగుండేది. అలాగే ఐక్యరాజ్యసమితి ఆయా దేశాలను సంప్రదించి అధిక జనాభాతో బాధ పడుతున్న దేశాలనుండి వలసపోవటానికి ఇష్టపడేవారిని అల్ప జనాభాతో బాధపడే దేశాలకు తరలిస్తే ప్రపంచదేశాల్లో జనాభా సమతుల్యంగా ఉంటుంది.

మేమిద్దరం మాకిద్దరు

'మేమిద్దరం... మాకిద్దరు' అన్న చందంగా పరిమిత కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. కొన్ని కుటుంబాలైతే చైనా తరహాలో 'మేమిద్దరం... మాకొక్కరే చాలు' అంటున్నారు. కుటుంబ నియంత్రణ పాటించడం, ఉద్యోగాలు, ఉపాధి కోసం వలసలు అధికం కావడం చిన్న కుటుంబాల సంఖ్య పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలో పదిహేను రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో జననాల రేటు తక్కువగా ఉంది. జాతీయ సగటు- 22.8. ఆంధ్రప్రదేశ్‌లో- 18.4.

జన సాంద్రత కి.మీ.కు 100 కంటే తక్కువగా వున్నకొన్ని ముఖ్య దేశాలు

ఆస్ట్రియా 98, టర్కీ 93, స్పెయిన్ 88, గ్రీస్ 84, కాంబోడియా 78, మలేసియా 77, మయన్మార్ 74, ఇరాక్ 66, కెన్యా 59, మెక్సికో 55, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ 46, ఇరాన్ 42, దక్షిణ ఆఫ్రికా 39, అమెరికా 31, వెనెజులా 29, కాంగో, మొజాంబిక్ 25, బ్రెజిల్ 22, స్వీడన్ 20, ఫిన్లాండ్, జాంబియా 16, సూడాన్, న్యూజిలాండ్ 15, అర్జెంటినా14, సోమాలియా, అంగోలా 13, నార్వే 12, సౌదీఅరేబియా 11, రష్యా 8, లిబియా, కెనడా 3, ఆస్ట్రేలియా, నమీబియా 2, మంగోలియా 1.

కుటుంబ నియంత్రణ పద్ధతులు

తాత్కాలిక పద్ధతులు

శాశ్వత పద్ధతులు

ఉపయుక్త గ్రంథ సూచి

మూలాలు

  1. Rabindra Nath Pati (2003). Socio-cultural dimensions of reproductive child health. APH Publishing. p. 51. ISBN 978-81-7648-510-4.
  2. Marian Rengel (2000), Encyclopedia of birth control, Greenwood Publishing Group, ISBN 1-57356-255-6, ... In 1997, 36% of married women used modern contraceptives; in 1970, only 13% of married women had ...
  3. 3.0 3.1 India and Family Planning: An Overview (PDF), Department of Family and Community Health, World Health Organization, archived from the original (PDF) on 2009-12-21, retrieved 2009-11-25
  4. G.N. Ramu (2006), Brothers and sisters in India: a study of urban adult siblings, University of Toronto Press, ISBN 0-8020-9077-X
  5. Arjun Adlakha (April 1997), Population Trends: India, U.S. Department of Commerce, Economics and Statistics Administration, Bureau of the Census, archived from the original (PDF) on 2013-06-20, retrieved 2009-12-05
  6. B.M. Ramesh; S.C. Gulati; R.D. Retherford, "Contraceptive use in India, 1992-93" (PDF), National Family Health Survey Subject Reports, Number 2, October 1996, International Institute for Population Sciences, retrieved 2009-11-25