ట్రాన్స్

(ట్రాన్స్‌ నుండి దారిమార్పు చెందింది)

ట్రాన్స్‌ 2020లో విడుదలైన మలయాళం సినిమా. అన్వర్ రషీద్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అన్వర్ రషీద్ నిర్మించిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను మలయాళంలో 2020 ఫిబ్రవరి 20న విడుదల చేసి, తెలుగు అదే పేరుతో డబ్బింగ్ చేసి 2021 ఆగష్టు 7న ఆహా ఓటిటిలో విడుదల చేశారు.[1]

ట్రాన్స్
దర్శకత్వంఅన్వర్ రషీద్
రచనవిన్సన్ట్ వడక్కన్
కథవిన్సన్ట్ వడక్కన్
నిర్మాతఅన్వర్ రషీద్
తారాగణంఫహాద్‌ ఫాజిల్
గౌతమ్ మీనన్
దిలీష్ పోతన
నజ్రియా నజీమ్
చెంబన్ వినోద్ జోస్
సౌబిన్ షాహిర్
వినాయకన్
అర్జున్ అశోకన్
ఛాయాగ్రహణంఅమల్ నీరద్
కూర్పుప్రవీణ్ ప్రభాకర్
సంగీతంపాటలు:
జాక్సన్ విజయన్
వినాయకన్
బ్యాక్‌గ్రౌండ్ సంగీతం :
రేసుల్ పూకుట్టి
జాక్సన్ విజయన్
సుషిన్ శ్యామ్
నిర్మాణ
సంస్థ
అన్వర్ రషీద్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
ఆగస్టు 7, 2021 (2021-08-07)
సినిమా నిడివి
170 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

చిన్నప్పుడే కళ్ళముందు తల్లి అప్పుల బాధ వలన ఉరి వేసుకోవడం చూసిన విజ్జు ప్రసాద్ (ఫహాద్‌ ఫాజిల్), మతి స్థిమితంగా లేని తమ్ముడితో కలిసి జీవిస్తూ ఉంటాడు. పెద్దయ్యాక మోటివేషనల్ స్పీచులు ఇచ్చే వృత్తిని ఎంచుకొని తన తమ్ముడి రోగాన్ని నయం చేద్దామని డాక్టర్ దగ్గరకు తీసుకు వెళుతుంటే అన్న పైనే దాడి చేస్తాడు. అయినా సరే తన తమ్ముడిని ఎలాగైనా బాగు చేసుకోవాలని అనుకుంటాడు, కానీ ఒకరోజు తన అన్నకి ఇబ్బంది కలగకూడదని అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. తరువాత కొంతకాలంపై అతడికి ఫాస్టర్ గా ఉద్యోగ అవకాశం వస్తుంది, అది తన జీవితాన్ని మార్చేస్తుంది. ఆ తరువాత అతడు ఎన్ని ఇబ్బందులు ఎదురుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Eenadu (15 July 2021). "'ఆహా'లో ఆ సైకలాజికల్‌ థ్రిల్లర్‌". Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
  2. Eenadu (28 June 2021). "ఫహద్‌ ఫాజిల్‌ అదరగొట్టేశాడు". Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ట్రాన్స్&oldid=4286973" నుండి వెలికితీశారు