అమల్దా లిజ్ (ఆంగ్లం: Amalda Liz) భారతీయ మోడల్, టెలివిజన్ యాంకర్, సినిమా నటి. మలయాళ సినిమారంగానికి చెందిన ఆమె 2016లో వచ్చిన కమ్మట్టి పాదం చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆమె సి యు సూన్ (2020), 9 (2019), అండర్ వరల్డ్ (2019), ట్రాన్స్ (2020), తులసి, ఒట్టు (2022) చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది.

అమల్దా లిజ్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిమోడల్, నటి, టెలివిజన్ వాఖ్యాత

మమ్ముట్టి కథానాయకుడుగా జనవరి 2024లో తెరకెక్కుతున్న భ్రమయుగం చిత్రంలో ఆమె స్త్రీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం ఏకకాలంలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది.[1]

ప్రారంభ జీవితం

మార్చు

వాయనాడ్‌లో జన్మించిన ఆమె, భరతనాట్యంలో నైపుణ్యం కలిగిన శాస్త్రీయ నృత్యకారిణి. ఆమె మిస్ కేరళ 2009 అందాల పోటీలో పాల్గొని మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టింది. ఇంజినీరింగ్ డిగ్రీలో ఉండగా ఈ పోటీలో పాల్గొన్న ఆమె ఫైనల్ చేరుకుని మిస్ బ్యూటిఫుల్ హెయిర్ అవార్డును గెలుచుకుంది. అలాగే, ఆమె సౌత్ ఇండియన్ మోడల్‌కు అగ్ర పోటీదారుగా నలిచింది. సౌత్ ఇండియన్ హంట్ 2010లో మిస్ కాన్ఫిడెంట్ ఫేస్ కిరీటాన్ని పొందింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు

మూలాలు

మార్చు
  1. "సూపర్‌ స్టార్‌ పాన్ ఇండియా చిత్రం.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్! | Malayalam Star Mammootty New Movie Bramayugam Poster Goes Viral On Social Media, Deets Inside - Sakshi". web.archive.org. 2024-01-12. Archived from the original on 2024-01-12. Retrieved 2024-01-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)