పరిచయం

మార్చు

ట్రీ టంబో (Tree Tumbo) అనేది నమీబియా ఎడారిలో పెరిగే మొక్క. దీని శాస్త్రీయ నామం 'వెల్వెట్సియా మైరాబిలిస్' (Welwitschia Mirabilis). సుమారు 2000 సంవత్సరాలు జీవించే ట్రీ టంబో మొక్కలు తమ జీవితకాలమంతా కేవలం రెండు ఆకులు మాత్రమే కలిగివుండం విచిత్రం. భూమిపై అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే నమీబియా ఎడారిలో పెరిగే ఈ మొక్కలను మొట్టమొదటి సారిగా ఆస్ట్రియన్ బోటనిస్ట్ అయిన ఫెడరిచ్ వెల్విట్స్ 1859 లో కనుగొన్నాడు. సుమారు డైనోసార్లు జీవించిన కాలంలోనే ఈ మొక్కలు ఆవిర్భవించాయని పలువురి శాస్త్రజ్ఞుల అభిప్రాయం. వెల్వెట్సియా మొక్కలు చూడటానికి అందమైనవి కాకపోయినా భూమ్మీద అత్యంత అరుదైన మొక్కలుగా పేరొందాయి.

వివరణ

మార్చు

వెల్వెట్సియా మొక్కలు ఎదిగే కొలదీ ఉండే రెండు ఆకులు నిలువుగా చీలిపోయి, సుమారు 8 మీటర్ల పొడవు పెరిగి ఎన్నో ఆకులుగా కనిపిస్తాయి. 2000 సంవత్సరాల జీవితకాలంలో ఉన్న రెండు ఆకులు వాడిపోవడం జరుగదు. తల్లి వేరు భూమిలోకి సుమారు 10 మీటర్ల వరకూ చొచ్చుకుపోతుంది. ఆకులకు రెండు వైపులా ఉండే చిన్న చిన్న రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాలద్వారా వెల్వెట్సియా మొక్కలు గాలిని, తేమను పీల్చుకుంటాయి . వెల్వెట్సియా మొక్కల్లో స్త్రీ, పురుష మొక్కలు వేర్వేరుగా ఉంటాయి. రెక్కల పురుగుల వల్ల వీటి పుష్పాలు సంపర్కమవుతాయి. విత్తనాలు కాగితం వంటి పదార్ధంతో కప్పబడివుంటాయి.

పెంపకం

మార్చు

ఎండవేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరిగే వెల్వెట్సియా మొక్కలను ఇంటి ఆవరణలో కూడా పెంచుకోవచ్చును. వీటిని ఎడారి మొక్కలను పెంచినట్లుగా పెంచాలి. కనీసం 30 సెంటీమీటర్లు లేక అంతకంటే ఎక్కువ పొడవున్న కుండీల్లో పెంచుకోవాలి. వెల్వెట్సియా మొక్కలను పెంచుకోవడానికి మరో మార్గం కూడా ఉంది. 5 లేక 10 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న 1 మీటరు పి.వి.సి పైపు ను తీసుకొని ఒక వైపు రెండు చిన్న రంధ్రాలున్న మూతతో మూసివేసి అందులో మట్టిని నింపి మొక్కను నాటుకోవచ్చు. వానపాముల ఎరువు లేదా ఆకు తుక్కు కలిగివున్న ఇసుక మట్టి ఈ మొక్కలకు మంచిది. విత్తనాలు నాటిన వారానికి మొలకెత్తుతాయి. వెల్వెట్సియా మొక్కలకు మట్టి పూర్తిగా ఆరిపోయే వరకూ మరల నీళ్ళు పోయరాదు. సంపూర్ణ ఎండలో వెల్వెట్సియా మొక్కలు బాగా ఎదుగుతాయి. అయితే భారీవర్షాలనుండి ఈ మొక్కలను రక్షించుకోవాలి. కుండీలో నీరు పోసిన వెంటనే రంధ్రాల ద్వారా బయటకు వచ్చేటట్టు వుండాలి. మట్టిలో నీరు ఏ మాత్రం అధనంగా నిల్వ ఉన్నా మొక్క మరణిస్తుంది. కృత్రిమ ఎరువులు వాడరాదు. వెల్వెట్సియా మొక్కలను నేలలో పెంచుకోవాలనుకొనేవారు వర్షం వచ్చినా నీరు నిల్వ ఉండని ఎత్తైన ఇసుక-రాతి నేలలో పెంచుకోవచ్చు.

గ్యాలరీ

మార్చు

లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ట్రీ_టంబో&oldid=3438920" నుండి వెలికితీశారు