డక్కలి బాలమ్మ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు మెట్ల కిన్నెర గాయనిగా ప్రసిద్ది చెందిన గాయకురాలు.[1]

డక్కలి బాలమ్మ

జీవిత విశేషాలు

మార్చు

ఆమె వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మంబాపూర్ గ్రామంలో నివసించేది.[2] ఆమె అట్టడుగు దళిత సామాజికవర్గంలో జన్మించింది. ఆమె తన 15 ఏళ్ల వయసులోనే కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ జీవనాన్ని సాగించింది. ఆమె తన తండ్రి వద్ద ఈ విద్యను అభ్యసించింది. ఆ కాలంలో వారు గాడిదలపై ప్రయాణిస్తూ తమ కళను వివిధ గ్రామాలలో ప్రదర్శించేవారు[2]. ఆమె భర్త మరణించినా ఆమె కిన్నెర వాయిద్యాన్ని విడిచిపెట్టలేదు. ఒంటరి మహిళ అయినా ఊరూరా తిరిగి కిన్నెర వాయిద్యం ద్వారా కుటుంబాన్ని పోషించేది. ఒకప్పుడు గుర్రంపై కూచుని గ్రామాల్లో తిరుగుతూ కిన్నెర వాయిద్యాన్ని వాయించేది. కిన్నెర వాయిద్యాన్ని నైపుణ్యంగా వాయించడంలో ఆమె దిట్ట. పది వీరగాథలు అలవోకగా పాడుతూ ఆమె అందించే పన్నెండు కిన్నెర మెట్ల సంగీతాన్ని తెలంగాణలోని ప్రజలు బాగా ఆదరించారు.[3]

ఆమె తన 90వ యేట వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మంబాపూర్ గ్రామంలో డిసెంబరు 8, 2018న మరణించింది.[4]

మూలాలు

మార్చు
  1. "పన్నెండు మెట్ల కిన్నెర గాయని బాలమ్మ కన్నుమూత".[permanent dead link]
  2. 2.0 2.1 Vadlamudi, Swathi (2017-08-19). "The kinnera's last strum: Meet Dakkali Balamma, the oldest surviving kinnera player in Telananga". The Hindu. ISSN 0971-751X. Retrieved 2018-12-10.
  3. "'కిన్నెర'కు వన్నె తెచ్చిన కళాకారిణి.. జయధీర్‌, పొట్లపల్లి సంతాపం".[permanent dead link]
  4. "తెలంగాణలో చివరి 'కిన్నెర' గాయని బాలమ్మ మృతి".

బయటి లంకెలు

మార్చు