డయల్ 100
డయల్ 100 2019లో విడుదలైన తెలుగు సినిమా. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఆల్కెమీ ఫిలిమ్స్ బ్యానర్ల పై సోనీ పిక్చర్స్, సిద్ధార్థ్ పి.మల్హోత్రా, సప్నా మల్హోత్రా నిర్మించిన ఈ సినిమాకు రెన్సిల్ డిసిల్వా దర్శకత్వం వహించాడు. మనోజ్ బాజ్‌పాయ్, నీనా గుప్తా, సాక్షి తన్వార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సె ఆగస్టు 6న జీ5 ఓటీటీలో విడుదలైంది.
డయల్ 100 | |
---|---|
దర్శకత్వం | రెన్సిల్ డి సిల్వా |
రచన | రెన్సిల్ డి సిల్వా డైలాగ్స్: నిరంజన్ అయ్యంగార్ |
స్క్రీన్ ప్లే | రెన్సిల్ డి సిల్వా |
నిర్మాత | సోనీ పిక్చర్స్ నెటవర్క్స్ సిద్ధార్థ్ పి.మల్హోత్రా సప్నా మల్హోత్రా |
తారాగణం | మనోజ్ బాజ్‌పాయ్ నీనా గుప్తా సాక్షి తన్వార్ |
ఛాయాగ్రహణం | అనుజ్ రాకేష్ ధావన్ |
కూర్పు | అసిఫ్ ఆలీ షేఖ్ |
సంగీతం | రాజు సింగ్ |
నిర్మాణ సంస్థలు | సోనీ పిక్చర్స్ ఆల్కెమీ ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | జీ 5 |
విడుదల తేదీ | 6 ఆగస్టు 2021 |
సినిమా నిడివి | 104 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
కథ
మార్చుపోలీస్ ఎమర్జెన్సీ సర్వీస్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారికి ఒక మహిళ నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఆ మహిళ ఏడుస్తూ ‘నేను చనిపోవాలనుకుంటున్నా’ అని చెబుతుంది, కానీ అందరూ అది ఫేక్ కాల్ అనుకుంటారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆ పోలీస్ ఆఫసర్‌కూ, మహిళకూ ఉన్న సంబంధం ఏంటి ? ప్రమాదంలో పడిన తన కుటుంబాన్ని పోలీస్ ఆఫీసర్ ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
మార్చు- మనోజ్ బాజ్‌పాయ్[2]
- నీనా గుప్తా
- సాక్షి తన్వర్
- నందు మాధవ్
- అభిజీత్ చవాన్
- ఊర్మిళ మహాన్తా
- విక్రమ్ భం
- మధుర్ అరోరా
- దీపాంశు టిటోరియా
- గిరీష్ దీక్షిత్
- విరాండ్ర గిరి
- స్వర్ కాంబ్లీ
- ఇవాన్ సిల్వెస్టర్ రోడ్రిగస్
- నీలేష్ మంగైన్
- అమన్ గణ్డోత్ర
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఆల్కెమీ ఫిలిమ్స్
- నిర్మాతలు: సోనీ పిక్చర్స్, సిద్ధార్థ్ పి.మల్హోత్రా, సప్నా మల్హోత్రా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రెన్సిల్ డిసిల్వా
- సంగీతం: రాజు సింగ్
- సినిమాటోగ్రఫీ: అనుజ్ రాకేష్ ధావన్
మూలాలు
మార్చు- ↑ "Dial 100 trailer out. Manoj Bajpayee, Neena Gupta's thriller to premiere on Zee5 on August 6". India Today. 20 July 2021. Retrieved 20 July 2021.
- ↑ "Manoj Bajpayee, Neena Gupta, Sakshi Tanwar come together for thriller Dial 100". India Today. 1 December 2020. Retrieved 29 December 2020.