డానిష్ అజీజ్

పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు

డానిష్ అజీజ్ (జననం 1995, నవంబరు 20) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. 2021 ఏప్రిల్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.

డానిష్ అజీజ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1995-11-20) 1995 నవంబరు 20 (వయసు 28)
కరాచీ, సింధ్, పాకిస్తాన్
ఎత్తు6 ft (183 cm)[1]
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 229)2021 ఏప్రిల్ 2 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2021 ఏప్రిల్ 4 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 91)2021 ఏప్రిల్ 21 - జింబాబ్వే తో
చివరి T20I2021 ఏప్రిల్ 23 - జింబాబ్వే తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014Karachi డాల్ఫిన్స్
2017Karachi Whites
2018; 2021Karachi Kings
2018/19–presentSindh
2019Quetta Gladiators
2022Islamabad United (స్క్వాడ్ నం. 22)
కెరీర్ గణాంకాలు
పోటీ ODI T20I
మ్యాచ్‌లు 2 2
చేసిన పరుగులు 12 37
బ్యాటింగు సగటు 6.00 18.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 9 22
వేసిన బంతులు 30 18
వికెట్లు 0 2
బౌలింగు సగటు 14.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/29
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: Cricinfo, 23 April 2021

తొలి జీవితం మార్చు

ఇతను కరాచీలో మెమన్ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి, తోబుట్టువులు క్రికెట్‌పై ఇతనికి ప్రోత్సాహం అందించాడు. మాజీ భారత అంతర్జాతీయ ఆటగాడు యువరాజ్ సింగ్ ని ప్రేరణగా తీసుకున్నాడు. ఇతని అన్న మరూఫ్ అజీజ్ కొన్ని ఫస్ట్-క్లాస్ క్రికెట్ కూడా ఆడాడు. ఇతను కరాచీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చదివాడు.[1]

క్రికెట్ రంగం మార్చు

2018 మార్చి 21న కరాచీ కింగ్స్ తరపున తన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. 2014 డిసెంబరు 12న కరాచీ డాల్ఫిన్స్ కోసం ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[2] 2017 జనవరి 8న 2016–17 ప్రాంతీయ వన్డే కప్‌లో కరాచీ వైట్స్ తరపున తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[3] పాకిస్తాన్ జాతీయ అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2021 ఏప్రిల్ లో దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.

2018లో ఫవాద్ ఆలమ్‌తో కలిసి 192 పరుగుల భారీ భాగస్వామ్యంలో అజేయంగా 86 పరుగులు చేశాడు.[4] 2018 ఏప్రిల్ లో 2018 పాకిస్తాన్ కప్ కోసం సింధు జట్టులో ఎంపికయ్యాడు.[5][6]

2020 నవంబరులో న్యూజిలాండ్ పర్యటన కోసం పాకిస్తాన్ తరపున 35 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[7] 2021 జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం పాకిస్తాన్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[8] 2021 మార్చిలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే పర్యటనల కోసం పాకిస్తాన్ పరిమిత ఓవర్ల జట్టులో ఎంపికయ్యాడు.[9][10] 2021 ఏప్రిల్ 2న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన వన్డే ఇంటర్నేషనల్ లోకి అరంగేట్రం చేసాడు.[11] 2021 ఏప్రిల్ 21న పాకిస్తాన్ తరపున జింబాబ్వేపై తన టీ20లోకి అరంగేట్రం చేసాడు.[12]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Husain, Amir (24 October 2020). "Talent Spotter : Danish Aziz". PakPassion. Retrieved 2023-09-03.
  2. "Danish Aziz". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  3. "Regional One Day Cup, Karachi Blues v Karachi Whites at Islamabad, Jan 8, 2017". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  4. "Ton-up Fawad, Danish star as Karachi Whites clinch Cup - Pakistan - DAWN.COM".
  5. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 2023-09-03.
  6. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 2023-09-03.
  7. "Pakistan name 35-player squad for New Zealand". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
  8. "Mohammad Wasim announces squad for T20I series against South Africa". Geo Super. Retrieved 2023-09-03.
  9. "Pakistan squads for South Africa and Zimbabwe announced". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
  10. "Sharjeel Khan returns to Pakistan T20I side for tour of South Africa and Zimbabwe". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  11. "1st ODI, Centurion, Apr 2 2021, Pakistan tour of South Africa". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  12. "1st T20I, Harare, Apr 21 2021, Pakistan tour of Zimbabwe". ESPN Cricinfo. Retrieved 2023-09-03.

బాహ్య లింకులు మార్చు