డానీ యస్

(డానీ యస్‌ నుండి దారిమార్పు చెందింది)

డానీ యస్‌ ..వీరు వ్రాసిన పలు సంకలనాలలో పలు కవితలు, కథలు, నాటికలు, గేయాలు, సమీక్షలు, ప్రచురితం అయ్యాయి. ఆంగ్లంలోనూ పలు వ్యాసాలు రాశారు. ఆంగ్లం నుండి తెలుగులోకి పలు వ్యాసాలను అనువదించారు.

బాల్యము

మార్చు

డానీ యస్‌ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం (పశ్చిమ గోదావరి) లో 1951 ఆగస్టు27న జన్మించారు. ఇతని పూర్తిపేరు అహ్మద్‌ మొహిద్దీన్‌ ఖాన్‌ యజ్దానీ జర్రానీ.

కలంపేర్లు. ఉషా యస్‌ డానీ, ఆషా, అజిత, ఫిదాయి, వశిష్టా నర్సాపురి. యజ్దానీ అనేది కాలక్రమంలో 'యస్‌.దానీ' గా, 'యస్‌ డానీ' గా, మారి చివరకు 'డానీ'గా ప్రాచుర్యం తల్లితండ్రులు: సూఫియా బేగం, తరాజేష్‌ అలీ ఖాన్‌. చదువు: పియుసి. వృత్తి : జర్నలిస్ట్‌.

రచనా వ్యాసంగము

మార్చు

ఇతడు తన పన్నెండో ఏట విద్యార్థిగా వున్నప్పుడే ఒక నాటిక రాసి పాఠశాలలో ప్రదర్శించడంతోఇతని రచనా వ్యాసంగం ఆరంభం అయ్యింది. 1972లో రాసిన 'ప్రగతి' నాటిక బహుళ ప్రచారం పొంది బహుమలు అంసుకుంది. 1978 నుండి మార్కిస్టు (కార్మికవర్గ) దృక్పథంతో రచనలు చేయడం ఆరంభించగా వివిధ పత్రికలు, ఉద్యమ పత్రికలు, సంకలనాలలో పలు కవితలు,కథలు,నాటికలు,గేయాలు,సమీక్షలు,ప్రచురితంఅయ్యాయి. ఆంగ్లంలోనూపలువ్యాసాలు రాశారు. ఆంగ్లం నుండి తెలుగులోకి పలువ్యాసాలను అనువదించారు.

విప్లవ రచయితల సంఘం సభ్యుడిగా

మార్చు

1978 నుండి 22 ఏళ్ళపాటు విప్లవ రచయితల సంఘం సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. పలు ప్రజా సంఘాలతో సంబంధాలు కలిగి ఆయా సంఘాలు నిర్వహించిన ఉద్యమాలకు సాహిత్య పరిపుష్టి కల్గించేందుకు రచయిత-కవిగా చేయూతనిచ్చారు. స్వయంగా సంఘాలు-సంస్థలు స్థాపించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేశారు.

                  'వనిత'టివీలో

ప్రస్తుతం వనిత టీవీలో అవుట్ పుట్ ఎడిటర్‌గా భాధ్యతలను నిర్వహిస్తూ, ఎన్‌టీవిలో 'లల్లూ బ్రదర్స్‌' ప్రోగ్రాం ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు.

రచనలు

మార్చు

జూలియస్‌ ఫ్యూజిక్‌ (1981), ప్రహ్లాదుడు (1981) ఇతని లక్ష్యం: అసమాన సమాజాన్ని సమసమాజం దిశగా నడిపంచేందుకు అవసర,మైన విధంగా ప్రజానీకాన్ని చైతన్యపర్చడం.



58

"https://te.wikipedia.org/w/index.php?title=డానీ_యస్&oldid=3487093" నుండి వెలికితీశారు