వి.వీరాచారి
కవిగా, రచయితగా, నటునిగా, దర్శకునిగా, ఆకాశవాణి వ్యాఖ్యతగా, ఎంతో మంది విద్యార్థులకు గురువుగా తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం మొదటి అధ్యక్షుడు వీరాచారి.
డాక్టర్:వి.వీరాచారి | |
---|---|
[[File: thumb|frameless]] | |
జననం | డా:వి.వీరాచారి 1959 అక్టోబరు 2 ఆలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ, |
నివాస ప్రాంతం | కాశీపురం,జోగులాంబ గద్వాల |
వృత్తి | తెలుగు లెక్చరర్ కవి,రచయిత |
మతం | హిందూ |
భార్య / భర్త | సత్యవతి |
పిల్లలు | ప్రమోద్,వంశీ |
జననం
మార్చు1959 అక్టోబర్ 02 న లక్ష్మీనరసమ్మ, కేశవాచారి దంపతులకు కాశీపురం గ్రామం ఆలంపూర్ మండలం మహబూబ్‌నగర్ (పూర్వ) జిల్లాలో జన్మించారు.
విద్యాభ్యాసం
మార్చుB.Sc; (BZC) డిగ్రీని ఆంగ్లమాద్యమంలో అభ్యసించారు. తెలుగు సాహిత్యం అంటే ఆసక్తితో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగును తెలుగు నాట సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాలు కవులు రచయితలు అనే అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయం నుండి Ph.D చేసారు. జర్నలిజంలో పిజి.డిప్లొమా కూడా తెలుగు విశ్వవిద్యాలయం నుండి చేసారు.
ఉద్యోగ జీవితం
మార్చు1988లో కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపన్యాసకుడిగా సేవలందించిన వీరాచారి 1989 నుండి సి.కె.యం.కళాశాల వరంగల్లు నుందు తెలుగు ఉపన్యాసకుడిగా విధులు నిర్వహిస్తునే FM ఆకాశవాణి వరంగల్లు కేంద్రంలో 1990 నుండి క్యాజువల్ అనౌన్సర్ గా కాకతీయ విశ్వవిద్యాలయం SDLCE, .బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటిలో కౌన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు.
పర్యవేక్షణ
మార్చుడా.టి.శ్రీరంగస్వామి రచనలు- ఒక పరిశీలన, సి.జయపాల్ రెడ్డి కథలు - మధ్యతరగతి జీవితం, అనిశెట్టి రజిత సాహిత్యం- ఒక పరిశీలన వంటి అంశాలకు పర్యవేక్షణ చేసారు.[1]
కార్యవర్గ సభ్యులు
మార్చుశ్రీలేఖ సాహితి, వరంగల్లు.
సంపాదకత్వం
మార్చు1. రత్నమాలిక (డా:జి.వి.రత్నం అభినందన సంచిక 1996)
2. సాహితీ సుధాకరం (డా.టి.సుధాకర్ రెడ్డి అభినందన సంచిక 2003)
3. సుధావర్షి (డా:టి.శ్రీరంగస్వామి అభినందన సంచిక 2006)
4. స్వర్ణపథంలో జన్మభూమి(కాకతీయ యూనివర్సిటి వార్తాలలేఖ, సంపాదక వర్గ సభ్యుడు)[2]
5. తెలుగు సాహిత్యంలో వివిధ శాస్త్రాంశాల ప్రతిఫలనాలు (2008)[3]
6. తెలంగాణా ఉరుములు - మెరుపులు (2009)
ప్రచురణలు
మార్చుపసిడి మొగ్గలు (కవితా సంకలనం- 1986) నోట్లు - ఓట్లు,సమాంతర రేఖలు (నాటికలు 1988) సిరిమల్లి సిలకబావ (గేయ సంపుటి 1992) తెలుగు నాట సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాలు కవులు రచయితలు(Ph.D సిద్దాంత గ్రంథం 1993) అనంత పయనం (వచన గేయ సంపుటి 1996) సమిధలు (కథాసంపుటి2008) కర్మయోగి(స్త్రీ పాత్రలేని నాటిక -2009) వర్ణమాల (నాటికల సంపుటి) డా:వి.వీరాచారి సాహిత్యం మొదటి సంపుటి (2008)[4]
రేడియో టీవి ప్రసారాలు
మార్చుయాభైకి పైగా సాహిత్య ప్రసంగాలు, సమీక్షలు,ఇరవై వరకు నాటికలు,రూపకాలు.
కాకతీయ కళావైభవం (సంగీత రూపకం) మొదలైనవి.
అభిరుచులు,విశిష్టతలు,అవార్డులు
మార్చుకర్నూల్,వరంగల్ జిల్లాలో జరిగిన జిల్లా స్థాయి నాటిక పోటిల్లో ఉత్తమ సహాయ నటునిగా,ఉత్తమ దర్శకునిగా బహుమతులు, 2008 జూన్‌లో "వందేళ్ళ తెలుగు కథాసాగరంలో వరంగల్లు " వ్యాసానికి శ్రీవేదగిరి కమ్యూనికేషన్ వారి పురస్కారం 2010 ఏఫ్రిల్ జ్యోతిబాపూలే డా:బి.ఆర్.అంబేద్కర్ సాహిత్య పురస్కారం అధ్యక్షులు,సాహితీ కళానిలయం (ఆకాశవాణి వరంగల్ కేంద్రంకళాకారుల వేదిక) ప్రధాన కార్యదర్శి,తెలంగాణ రచయితల వేదిక, వరంగల్ జిల్లా కన్వీనర్ వరంగల్ రచయితల ఐక్యవేదిక.
మూలాలు
మార్చు- ↑ "తెలుగు సాహితి పసిడి మోగ్గలు". WWW.NAVATELANGANA.COM.
{{cite web}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: url-status (link) - ↑ "రచనలు ప్రజాజీవితాన్ని ప్రతింబింబించాలి". www.manatelangana.news.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "సీకేఎం కళాశాల అద్యాపకులు వీరాచారికి సన్మానం". andhrajyothy.com/. Retrieved 2017-04-23.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాలు కవులు-రచయితలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,4-1-435,విజ్ఞాన్ భవన్ బ్యాంక్ స్ట్రీట్ హైదరాబాద్ -500001: జనజీవన ప్రచురణలు. 1993. p. 272.
{{cite book}}
: CS1 maint: location (link)