డా. ఎస్. రఘు (రచయిత)
డా.ఎస్ రఘు కవి, రచయిత, విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు. వీరు పాఠశాల ఉపాధ్యాయుడుగా, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షా విభాగంలో, తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తన వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.[1] ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి పి.జి. స్థాయి పాఠ్యపుస్తకాల వరకు సంపాదకులుగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2023లో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులుగా ఎంపికయ్యారు.
డా.ఎస్.రఘు | |
---|---|
జననం | నల్లగొండ జిల్లా |
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
ఇతర పేర్లు | రఘు |
వృత్తి | రచయిత, కవి, సాహితీకారుడు |
ఉద్యోగం | ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకులు |
ప్రసిద్ధి | జీవనలిపి - నానీలు |
బాల్యం
మార్చుఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
విద్యాభ్యాసం
మార్చుఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
సాహితీ ప్రస్థానం
మార్చుఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
‘తెలుగు భారతీయ ఆంగ్ల కవిత్వంలో అస్తిత్వవేదన’ అనే అంశంపై ఎం.ఫిల్ లో తులనాత్మక పరిశోధన, పిహెచ్ డిలో ‘ఆధునిక కవిత్వంలో అంతర్ముఖీనత’ అనే అంశంపై పరిశోధన చేశారు. ‘జీవన లిపి’ నానీల కవితా సంపుటి ఉత్తమ నానీల గ్రంథంగా మూడు రాష్ట్ర స్థాయి పురస్కారాలు పొందింది. ఈ గ్రంథంపై మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన జరిగింది. ‘సమన్వయ’ సాహిత్య విమర్శ సంపుటికి రెండు ఉత్తమ విమర్శగ్రంథ పురస్కారాలు అందుకున్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం ‘ఈ పిల్లలు గొప్ప వాళ్ళు ఎలా అయ్యారంటే’ ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించారు. 10 సాహిత్య గ్రంథాలకు సంపాదకులుగా వ్యవహరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురిస్తున్న ‘పునాస’ సాహిత్య పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. దక్కన్ ల్యాండ్ మాసపత్రిక సాహిత్య విభాగ సలహాదారుగా, హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ లో లిటరరీ కన్వీనర్ గాను సేవలందించారు. వివిధ పత్రికలలో పలు వచన కవితలు, వ్యాసాలు, సమీక్షలు వెలువడినాయి. ఉత్తమ వచనకవితకు గాను రంజనీ-కుందుర్తి పురస్కారం (2010) పొందారు. విశ్వవిద్యాలయ వేదికగా జాతీయ సదస్సులు, సాహిత్య అకాడమీ సదస్సును నిర్వహించారు. డిగ్రీ కళాశాల అధ్యాపకుల కోసం యుజిసి హెచ్ఆర్డిసి ఆధ్వర్యంలో తెలుగు రిఫ్రెషర్ కోర్స్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఒకటి నుంచి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజి, డిఎడ్, ఓపెన్ యూనివర్సిటీ, నేషనల్ ఓపెన్ స్కూల్ తెలుగు పాఠ్య గ్రంథాలకు సంపాదకులుగా, రచయితగా ఉన్నారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో యాభై వరకు పరిశోధనా పత్రాలను సమర్పించారు.ప్రస్తుతం కేంద్ర సాహిత్యఅకాడెమీ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గా వున్నారు
రచనలు
మార్చు- తెలుగు భారతీయ ఆంగ్ల కవిత్వంలో అస్తిత్వవేదన - ఎంఫిల్ గ్రంథం
- ఆధునిక కవిత్వంలో అంతర్ముఖీనత - పిహెచ్ డి గ్రంథం
- జీవనలిపి (నానీలు)[2]
- సమన్వయ - సాహిత్య విమర్శ సంపుటి
- ఈ పిల్లలు గొప్ప వాళ్ళు ఎలా అయ్యారంటే - అనువాద గ్రంథం
పురస్కారాలు
మార్చుఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
మూలాలు
మార్చు