తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం

(ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నుండి దారిమార్పు చెందింది)

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఏకైక శాఖ. ఇది 1919లో ఏర్పడింది.[1] తెలుగు శాఖ తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడతంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధనలను ( పీ.హెచ్.డి) లను అందిస్తున్నది. సిద్ధాంత గ్రంథాలు శోధగంగలో అందుబాటులో వున్నాయి.[2]

అధ్యక్షులు:ఆచార్య సూర్యా ధనంజయ్సవరించు

 
తెలుగు శాఖకు అధ్యక్షులుగా పనిచేయుచున్న ఆచార్య సూర్యా ధనంజయ్

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు ఆచార్య సూర్యా ధనంజయ్ అధ్యక్షత వహిస్తున్నారు. వీరు ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య గోనా నాయక్, ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గార్ల తర్వాత 2017 జూలై 18 న శాఖాధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.

ప్రస్తుత ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు:సవరించు

  • ఆచార్య నిత్యానంద రావు.
  • ఆచార్య కమలాకర శర్మ
  • ఆచార్య సూర్యా ధనంజయ్
  • ఆచార్య పి. వారిజా రాణి
  • డా.ఎస్.రఘు
  • డా.ఏలె విజయ లక్ష్మి,
  • డా.కాశీం గారు.

స్నాతకోత్తర విద్య (ఎం.ఏ)గా తెలుగు:సవరించు

ఎం.ఏ. తెలుగును 1940లో ప్రారంభించబడింది. 1940లో ఎం.ఏ. (తెలుగు)లో చేరిన పల్లా దుర్గయ్య 1942లో ఉత్తీర్ణుడైన ప్రప్రథమ ఎం.ఏ. తెలుగు విద్యార్థిగా, 1949లో ఎం.ఏ తెలుగులో రెగ్యులర్‌ విద్యార్థులుగా చేరి 1951లో 532 మార్కులతో డిస్టింక్షన్‌లో పాసైన విద్యార్థిగా బి.రామరాజు (రూల్‌ నెం. 131), 477 మార్కులతో ద్వితీయశ్రేణిలో పాసైన విద్యార్థిని గాఇల్లిందల సుజాత (రూల్‌ నెం 132) చరిత్రలో నిలిచారు.[3]

స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) గా తెలుగు అభ్యాసనం వలన తెలుగు భాషలో ఎంతగానో ప్రావీణ్యం సంపాదించటానికి అవకాశం గలదు. ఇక్కడ విద్యార్థులు "ప్రాచీనా తెలుగు సాహిత్యం" నుండి "ఆధునిక తెలుగు సాహిత్యం" వరకు తెలుసుకోవడం జరుగుతుంది. అంతే కాకుండా "తెలుగు శాసనాలు", "తెలుగు వ్యాకరణం-అలంకారాలు-ఛందస్సు", "వివిద తెలుగు సాహిత్య ప్రక్రియలు", "తెలుగు భాషా చరిత్ర", "తెలుగు సాహిత్య విమర్శ" వంటి అంశాలను క్షుణ్ణంగా నేర్చుకుంటారు.

మూలాలుసవరించు

  1. మనతెలంగాణ (24 April 2018). "నూరేళ్ల ఒయు తెలుగు శాఖ". Archived from the original on 25 April 2018. Retrieved 25 April 2018.
  2. "ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సిద్ధాంతగ్రంథాలు". Retrieved 2018-12-18.
  3. నవతెలంగాణ, సోపతి-స్టోరి (5 March 2016). "తొలి తెలుగు ఎం.ఏ. విద్యార్థిని ఇల్లిందల సుజాత". వెలుదండ నిత్యానందరావు. Archived from the original on 2 February 2019. Retrieved 2 February 2019.