అరుణగిరి నాథుడు

(డిండిమభట్టు నుండి దారిమార్పు చెందింది)

అరుణగిరి నాథుడు శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధిచెందిన కవి పండితుడు. ఇతనినే గౌడ డిండిమభట్టు అని పిలిచేవారు.

అరుణగిరి నాథుడు
కరూర్ సమీపంలోని వెంజమకూడలూరు దేవాలయంలోఅరుణగిరి నాథుని విగ్రహం
జననం15th Century A.D.
Thiruvannamalai
తమిళనాడు
India
బిరుదులు/గౌరవాలుTamil Poet
తత్వంSaivism
సాహిత్య రచనలుతిరుప్పగళ్

ఇతడు 1375 సంవత్సరంలో జన్మించాడు. వీరి తాతలు బహుభాషా కోవిదులు. బాల్యంలో తల్లి ముత్తమ్మాళ్ చనిపోగా పెత్తల్లి తిలకావతి పెంపకంలో పెరిగాడు. బాల్యంలో చెడు సహవాసాలతో విలాసవంతంగా గడిపి చివరికి అరుణాచలం గుడిపై నుండి ఆత్మహత్య ప్రయత్నం చేయగా స్వామి ప్రత్యక్షమై అతడ్ని కాపాడి నాలుకపై షడక్షర మంత్రం (శరవణభవ) రాశాడని నానుడి.

ఇతడు తర్వాత కాలంలో ద్రవిడ భాషలో "తిరుప్పుగళ్" అనే 16,000 దివ్యమైన కీర్తనలు కలిగిన రచన చేశాడు. తిరుప్పగళ్ అంటే తిరు = పవిత్రమైన; పుగళ్ = పొగడ్త అని అర్ధం. అచ్చంగా సంస్కృతం కాకుండా అచ్చంగా తమిళం కాకుండా తనకంటూ ఒక కొత్త బాణీలో రచన చేశాడు. ఈ పద్ధతిని చిత్తిర కవితై లేదా చిత్ర కవిత్వం అని పేరు. ఈ కారణంగా ద్రవిడ విద్వాంసులు ఇతనికి "చందస్ పవళప్పెరుమాన్" అనే బిదుదునిచ్చారు.