ఆత్మహత్య
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ఆత్మహత్య (Suicide) అనేకంటే ఇచ్ఛా మరణం అనటమే సరైనది. అది బలవన్మరణం కాదు. ఐ.పి.సి.309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నంచేసి బ్రతికినవారిపై కేసులు పెడతారు. ఇప్పుడు ఆ సెక్షన్ రద్దుకోసం భారత లా కమిషన్ సిఫారసు చేసింది. ఆత్మహత్యాయత్నం నేరం కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. 'తీవ్రమైన నిరాశ నిస్పృహలతోనే ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా భావిస్తారు. వారికి కావలసింది సహాయం కానీ శిక్ష కాదు' అని స్పష్టం చేసింది. ఆత్మహత్యకు ప్రయత్నించటాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 309 సెక్షన్‌ను తొలగించాలని పార్లమెంటుకు సిఫార్సు చేసింది. భారతదేశంలో గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నట్లునేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. హిందూ ధర్మ శాస్త్రాలు ఆత్మ హత్యను మహాపాతకంగా వర్ణిస్తాయి. సార్క్‌దేశాలైన భారత్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవుల్లో ప్రతీ లక్ష మందిలో 8 నుండి 50 మంది దాకా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 45వ స్థానంలో ఉండగా, శ్రీలంక 12వ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం జరుపుకుంటారు.[1]
ఆత్మహత్య | |
---|---|
Classification and external resources | |
![]() The Suicide by Édouard Manet 1877-1881 | |
ICD-10 | X60–X84 |
ICD-9 | E950 |
MedlinePlus | 001554 |
eMedicine | article/288598 |
MeSH | F01.145.126.980.875 |

ఇచ్ఛా మరణం పొందిన ప్రముఖులుసవరించు
- భీష్మాచార్యుడు అంపశయ్యపై తనువు చాలించాడు
- స్వామి వివేకానంద కపాల మోక్షం పొందారు
- పోతులూరి వీర బ్రహ్మం గారు సజీవ సమాధి అయ్యారు
- కానూ సన్యాల్ ఉరి వేసుకుని చనిపోయారు
ఆత్మహత్యలకు కారణాలుసవరించు
- ప్రేమ అనుబంధాల వైఫల్యం, ఆత్మీయులను కోల్పోవడం, కుటుంబ కలహాలు, అవాంఛిత గర్భం
- వరకట్న వేధింపులు,
- నయంకాని జబ్బులు, అనారోగ్యం,
- తీర్చలేని అప్పులు, ఆస్తినష్టం, పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, ఉన్నవారికి లేనివారికి మధ్య పెరుగుతున్న అంతరాలు, ఆర్థిక ఇబ్బందులు,
- రాజకీయ అస్థిరత
- మతపరమైన విద్వేషాలు, సైద్ధాంతిక కారణాలు, హీరోలపై మితిమీరిన అభిమానం
- ఉద్యోగాన్ని, గౌరవాన్ని, సామాజిక హోదాను కోల్పోవడం, నిరుద్యోగం
- పురుగు మందుల అందుబాటు
- అనువంశిక, జన్యులోపాలు
- కుటుంబంలో ఏవరి అండదండలు లేకపోవడం వారిని సరిగ్గా పట్టించుకోలేకపోవడం
- మోసపోవడం మతిస్తిమితం సరిగ్గా లేకపోవటం
- మద్యానికి బానిస కావడం
- భార్య భర్తల మద్య గొడవలు పడడం ఒకరినొకరు అర్థం చేసుకొకపోవడం
ఆత్మహత్య పద్ధతులుసవరించు
- పురుగు మందును తాగడం (37 శాతం)
- ఉరి వేసుకోవడం (26 శాతం),
- ఒంటికి నిప్పంటించుకోవడం (11 శాతం),
- నీళ్లలో మునిగిపోవడం (9 శాతం),
- తుపాకీతో కాల్చుకోవడం (1 శాతం)
- ఎత్తైన చోట్లనుండి దూకటం
- Cutting hands with kinfe
బలవన్మరణాలు పురుషుల్లో అధికంసవరించు
సహనానికి మారుపేరైన మహిళ కష్టాల్లోనూ అంతే మనో నిబ్బరాన్ని ప్రదర్శిస్తోంది. క్లిష్టమైన సమస్యలు ఎదురైనా స్త్థెర్యం కోల్పోక ధైర్యంగా ఎదిరిస్తోంది. అబల ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా జీవనయానంలో ముందుకు సాగేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. అయితే అన్నింటా స్త్రీలపై ఆధిపత్యాన్ని చెలాయించే మగవారు మాత్రం కష్టాలు ఎదురవగానే డీలా పడిపోతున్నారు. అర్ధాంతరంగా జీవితానికి ముగింపు పలకటానికే అత్యధికులు మొగ్గు చూపుతున్నారు.మహిళల కన్నా పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ముఖ్యంగా వివాహితుల్లో భార్యల కన్నా భర్తలే రెట్టింపు సంఖ్యలో బలవన్మరణాలకు సిద్ధపడుతున్నారని తేలింది.వీరిలో నడివయసు వారే (30-44 ఏళ్లు) ఎక్కువ.
హిందూ శాస్త్రాల దృష్టిలో ఆత్మహత్యసవరించు
- ఆత్మహత్య మహా పాతకం
ఇస్లాం దృస్టిలో ఆత్మహత్యసవరించు
- ఒకడు ఇనుప కమ్మీతో ఆత్మహత్య చేసుకుంటే అదే ఇనుప కమ్మీతో నరకాగ్నిలో శిక్షించబడతాడు. ఒక వ్యక్తి గాయపడి వాటి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. "నా దాసుడు తొందరపడి తనను తాను చంపుకున్నాడు, ఇతనికి పరలోక ప్రవేశం ఉండదు" అంటాడు అల్లాహ్. (బుఖారీ 2:445)
- "ఊపిరాడకుండా చేసుకొని చనిపోయినవాడు నరకంలో కూడా ఊపిరాడని శిక్షలోనే ఉంటాడు. కత్తితో పొడుచుకొని చనిపోయినవాడు నరకాగ్నిలో సదా తనను తాను పొడుచుకుంటూనే ఉంటాడు. " (బుఖారీ 2:446)
- ఒకడు ఏవస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో పునరుత్థాన దినాన అదే వస్తువుతో హింసించబడతాడు. (బుఖారీ 8:73)
క్రైస్తవం దృస్టిలో ఆత్మహత్యసవరించు
- ఏసుక్రీస్తును పట్టించిన శిష్యుడు ఇస్కరియోతు యూదా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. (మత్తయి27:5)
- సౌలు తన కత్తిమీదే పడి ఆత్మహత్య చేసుకుంటాడు. (1 సమూయేలు 31:4)
- సౌలు ఆయుధాలు మోసేవాడు తన యజమాని చనిపోయాడు కాబట్టి తాను కూడా (విశ్వాసంగలకుక్క) లాగాఆత్మహత్య చేసుకుంటాడు. (1 సమూయేలు 31:6)
- సంసోను ( మానవ బాంబు ) లాగా ఆత్మహత్య చేసుకున్నాడు. (న్యాయాధిపతులు 16:26-31)
- అబీమెలెకు ఆత్మహత్య చేసుకున్నాడు. (న్యాయాధిపతులు 9:54),
- అహితోపెలు ఆత్మహత్య చేసుకున్నాడు. (2సమూయేలు 17:23),
- జిమ్రీ ఆత్మహత్య చేసుకున్నాడు. (1 రాజులు 16:18),
ఒక్క సంసోను తప్ప మిగతావారంతా నరకానికి వెళతారని క్రైస్తవుల అభిప్రాయం.
- ఏసుక్రీస్తు పాపిష్టి ప్రజలకి బదులు చనిపోవటానికే ఈ లోకంలోకి తెలిసే వచ్చాడంటారు.
చనిపోవాలని కోరుకోవటంసవరించు
- పౌలు ఈ లోకంనుంచి వెళ్ళిపోవలనుకుంటాడు (ఫిలిప్పీ1:20)
- అంత్యదినాల్లో ప్రజలు చనిపోవాలని కోరుకుంటారు గాని వాళ్లకు చావు దొరకదు.మరణం వాళ్ళదగ్గరనుండి పారిపోతుంది. (ప్రకటన 9:10)
ఆపడం ఎలాసవరించు
- ఎక్కువ మంది క్షణికావేశంలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. అప్పుడక్కడ వారిని ఎవరైనా ఆపితే ఆ క్షణం గడిచిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఆత్మహత్య గురించి ఆలోచించరు.
- పని ఒత్తిడి, పరిమితి లేని కోర్కెలు... చిన్న విషయానికే ఆవేశం, మనస్థాపానికి గురవ్వడం, అసూయ వంటి మానసిక రుగ్మతలు తగ్గించుకోవాలి.
- బిడ్డల భవిష్యత్తు, జీవితాంతం కష్టసుఖాల్లో కలకాలం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసుకున్న ప్రమాణం, ఆప్యాయత ఆవేశం వీడి గుర్తుతెచ్చుకోవాలి.
- సమశ్యలను తల్లిదండ్రులు, మిత్రులు ఆత్మీయులతో పంచుకోవాలి.
- పోషించే శక్తిలేనివారు పిల్లల్ని కనకపోవటం మంచిది.
ఆత్మహత్యను ఆపే కొన్ని సామెతలుసవరించు
- పరుగెత్తి పాలుతాగేకన్న నిలబడి నీళ్ళుతాగటం మంచిది
- బతికియున్న శుభములు బడయవచ్చు
- బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు
- చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు
- చచ్చి ఏం సాధిస్తావు?
మూలాలుసవరించు
- http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=137368&categoryid=1&subcatid=32
- https://web.archive.org/web/20081205015419/http://www.eenadu.net/story.asp?qry1=41&reccount=49
- https://web.archive.org/web/20090602025942/http://andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2009%2F8-2%2Fcoverstory
- https://web.archive.org/web/20091124010033/http://www.suryaa.com/main/showSunday.asp?cat=1&subCat=11&ContentId=23656
- https://web.archive.org/web/20110901222531/http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm%2Fpanel4.htm
- http://www.socialcause.org/getarticlefromdb.php?id=3306[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (10 September 2015). "'ఆత్మహత్య' ఎందుకు చేసుకుంటారంటే..." www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.