డిజిటల్ పర్సనల్ డేటా ప్రొడక్షన్ బిల్లు - 2023

భారతదేశ పౌరుల ప్రైవసీకి రక్షణ కల్పించే ' వ్యక్తిగత డిజిటల్ డేటా భద్రత బిల్లు ( డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ) బిల్లు - 2023 కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 ఆగస్టు 12వ తేదీన ఆమోదం తెలిపారు[1]. అంతకుముందు ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఆగస్టు 7వ తేదీన లోక్ సభ , ఆగస్టు 9వ తేదీన రాజ్యసభ ఆమోదం తెలిపింది[2]. ఈ బిల్లు ప్రకారం ... ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది[3]. ఈ బిల్లు ప్రకారం డిజిటల్ యూజర్లు డేటా గోప్యతను కాపాడలేకపోయినా .. సమాచార దుర్వినియోగానికి పాల్పడిన సదరు కంపెనీలపై కనిష్టంగా రూ. 50 కోట్ల నుంచి గరిష్టంగా రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించాలని నిబంధనను తీసుకొచ్చారు. ఈ చట్టం అమలు కోసం ' డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ' ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం తో పాటు ఈ బోర్డు, దాని సభ్యులు, ఉద్యోగులు, అధికారులు తీసుకునే నిర్ణయాలపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు ఉండవని బిల్లులో తెలిపారు. అయితే కొన్ని ప్రత్యేక కేసుల్లో ప్రైవసీ రక్షణ నుంచి మినహాయింపులు ఉంటాయి. దేశ సార్వభౌమత్వం, సమైక్యత విషయాల్లో వర్తించదు. దేశ రక్షణ, విదేశీ సంబంధాల విషయాల్లోనూ ఈ బిల్లు నుంచి మినహాయింపు ఉంది. తీవ్రమైన నేరాలు, కోర్టు ఆదేశాల్లోనూ వర్తించదు.

మూలాలు

మార్చు
  1. "Data Protection Bill: 'ప్రైవసీ'కి రక్షణ.. డేటా ప్రొటెక్షన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం". EENADU. Retrieved 2023-09-10.
  2. "లోక్‌సభలో పాసైన డేటా పరిరక్షణ బిల్లు". Sakshi. 2023-08-07. Retrieved 2023-09-10.
  3. "The Digital Personal Data Protection Bill, 2023". PRS Legislative Research (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-10.