డియాండ్రా సోరెస్

డియాండ్రా సోరెస్ (ఆంగ్లం: Diandra Soares; జననం 1979 ఆగస్టు 13) ఒక భారతీయ మోడల్, ఫ్యాషన్ డిజైనర్, టెలివిజన్ హోస్ట్. ఆమె ఎక్కువగా ర్యాంప్‌పై తన చూపులకు ప్రసిద్ధి చెందింది.[1] ఆమె 2014లో బిగ్ బాస్ 8 రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నది.

డియాండ్రా సోరెస్
2013లో డియాండ్రా సోరెస్
జననం (1979-08-13) 1979 ఆగస్టు 13 (వయసు 44)
వృత్తిమోడల్, ఫ్యాషన్ డిజైనర్, టెలివిజన్ హోస్ట్
టెలివిజన్బిగ్ బాస్ హిందీ సీజన్ 8

2017లో వెబ్ సీరీస్ అలీషాలో ఆమె ఎపిసోడిక్ పాత్ర అల్ఫియా రోమానీగా చేసింది. అలాగే, 2008లో, హిందీ చిత్రం ఫ్యాషన్లో ఆమె అతిధి పాత్ర పోషించింది.

ప్రారంభ జీవితం మార్చు

సోరెస్ మహారాష్ట్రలోని బాంద్రాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె కుటుంబానికి మోడలింగ్ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. బొంబాయిలో పాఠశాల విద్యను అభ్యసించిన తరువాత, ఆమె సెయింట్ జేవియర్స్ నుండి తన విద్యను కొనసాగించింది. మోడలింగ్‌లో డియాండ్రా సోరెస్ ను ప్రేరేపించిన మాజీ భారతీయ మోడల్ మధు సప్రే. మధు సప్రే ఫెమినా మిస్ ఇండియా 1992 విజేతగా నిలిచింది.

వ్యక్తిగత జీవితం మార్చు

డియాండ్రా సోరెస్రా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో గౌతమ్ గులాటీతో రిలేషన్‌షిప్‌లో ఉంది.[2] 2016లో, ఆమె వెబ్ సిరీస్ 'డూ ఇట్ లైక్ డియాండ్రా'లో ఉంది.

కెరీర్ మార్చు

మోడలింగ్ మార్చు

డియాండ్రా సోరెస్ 16 సంవత్సరాల వయస్సు నుండి మోడలింగ్ రంగంలో చురుకుగా ఉంది. ఆమె మొదటి అసైన్‌మెంట్ టిప్స్ అండ్ టోస్ కాగా, మొదటి షో మెక్‌డోవెల్స్. 1995లో, ఆమె మిస్ బాంబేగా కిరీటాన్ని పొందింది. అది దినేష్ సూటింగ్స్, విఐపి లింగరీస్, టిల్స్‌బరీ విస్కీ వంటి వివిధ ప్రముఖ బ్రాండ్‌ల నుండి కాంట్రాక్టులను పొందడంలో ఆమెకు సహాయపడింది. ఆమె తన కెరీర్‌లో గూచీ, లియోనార్డ్ ప్యారిస్, ఇమాన్యుయెల్ ఉంగారో, సోనియా రైకీల్ అండ్ మయామి ఫ్యాషన్ షోలచే నిర్వహించబడిన అనేక అంతర్జాతీయ ఫ్యాషన్ షోలకు నడిచింది.

ఆమె ర్యాంప్‌పై వాడి చూపుతో ప్రసిద్ది చెందింది. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో డిజైనర్లు ఆమెతో షోలను నిర్వహించారు. సెప్టెంబరు 2013లో, ఆమె తల గుండు చేయించుకుంది. ఇది మతపరమైన కారణాల వల్ల జరిగిందని, బట్టతల రావడం ద్వారా తాను ఆధ్యాత్మికంగా శక్తిని పొందినట్లు భావించానని సోరెస్ వ్యాఖ్యానించింది.[3] ఆమె బట్టతల తల అనేక ఫ్యాషన్ వారాల్లోకి తన ప్రవేశాన్ని నిరోధించవచ్చని కూడా చెప్పింది. బిగ్ బాస్ 8లో తన సెషన్‌లో ఆమె మరోసారి తల గుండు చేయించుకుంది.[4]

మీడియా మార్చు

2011లో జనాదరణ పొందిన సెలబ్రిటీ స్టంట్ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 4వ సీజన్‌లో ఆమె పోటీదారుగా ఉంది. ఆమె ప్రజాకర్షణ పొందిన పోటీదారులలో ఒకరిగా నిలిచింది. అక్కడ ఆమె చివరి వరకు నిలిచి సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.[5] సెప్టెంబరు 2014లో కలర్స్‌లో ప్రసారమైన ఎనిమిదో సీజన్‌లో ఆమె ఇండియన్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పోటీదారుగా మారింది.[6] ఆమె 12 వారాల తర్వాత 2014 డిసెంబరు 14న అంటే, 84వ రోజు హౌజ్ నుండి తొలగించబడింది.[7][8] 2016లో ఆమె 'డూ ఇట్ లైక్ డియాండ్రా' అనే వెబ్ సిరీస్‌ను రూపొందించింది.[9]

టెలివిజన్ మార్చు

సంవత్సరం ధారావాహిక పాత్ర నోట్స్ మూలాలు
2008 గెట్ గార్జియస్ 5 జడ్జ్
2011 ఫియర్ ఫ్యాకక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 4 పోటీదారు ఫైనలిస్ట్ (2వ రన్నరప్)
2012 ఝలక్ దిఖ్లా జా 5 గెస్ట్ షిబానీ దండేకర్‌కు మద్దతు ఇవ్వడానికి
2013 లైఫ్ మే ఏక్ బార్ పోటీదారు రోషెల్ రావ్ తో పాటు
2014 బిగ్ బాస్ 8 తొలగించబడిన రోజు 84
2015 ఫరా కి దావత్ అజాజ్ ఖాన్ & సంభవనా సేథ్‌తో పాటు [10]
కిల్లర్ కరోకే అట్కా తో లట్కా సనా ఖాన్, సారా ఖాన్ & మెహక్ చాహల్తో పాటు
2016 బిగ్ బాస్ 10 గెస్ట్ అమీర్ అలీతో పాటు [11]

మూలాలు మార్చు

  1. "Ex-Bigg Boss contestant Diandra Soares is a beach baby - Times of India". The Times of India. 16 August 2017.
  2. "Bigg Boss 8 contestants Diandra Soares and Gautam Gulati no longer in touch!". Daily News and Analysis. 27 June 2016. Retrieved 27 June 2016.
  3. "Bald is Beautiful for Supermodel Diandra Soares". 10 September 2013.
  4. "Snapshot: Diandra Soares goes bald; Gautam Gulati thinks it's a good look". 29 November 2014. Archived from the original on 1 December 2014.
  5. "Akshay Makes Diandra Inscribe KKK4 On Her Scalp". NDTV. 24 May 2011.[permanent dead link]
  6. Neha Maheshwri (21 September 2014). "Deepshikha Nagpal, Diandra Soares to enter Bigg Boss house". The Times of India. Retrieved 21 September 2014.
  7. "Bigg Boss 8: Diandra Soares evicted!". The Times of India. Retrieved 14 December 2014.
  8. "Bigg Boss 8: "I Am Not Pregnant" says Diandra Soares after being eliminated!". pinkvilla.com. Archived from the original on 13 February 2015. Retrieved 17 December 2014.
  9. "Do it Like Diandra". 2 August 2016.
  10. "Farah Ki Daawat: Pritam Singh, Diandra Soares, Praneet Bhatt, Ajaz Khan, Rahul Mahajan and Sambhavna Seth spice it up!". 1 March 2015.
  11. "Bigg Boss 10 January 1 preview: Salman Khan calls Swami Om 'dhongi', walks out after getting upset, Diandra makes a comeback to Bigg Boss". 1 January 2017.