డిసెంబరం
డిసెంబరం ( ఆంగ్లం :Barieria cristata) అనేది అకంథేసి కుంటుంబానికి చెందిన మొక్క. వీటిని గొబ్బిపూలు, పెద్ద గోరింట అని కూడా అంటారు. ఫిలిప్ఫైన్స్ వయొలెట్, బ్లూబెల్ బర్లేరియా అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయనామం బర్లేరియా క్రిస్టేటా.[1]
Philippine violet | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | B. cristata
|
Binomial name | |
Barleria cristata |
విస్తరణ, సహజావరణం
మార్చుఈ మొక్కలు దక్షిణ చైనా నుండి భారతదేశం, మయన్మార్ వరకు విస్తరించి ఉన్నాయి. వీటిని గ్రామాలలో, ఉద్యానవనములలో అలంకారమైన మొక్కలుగా పెంచుతారు. పొడి వాతావరణంలో ఇవి పెరుగుతాయి. ఇవి హవాయి లో సహజ సిద్ధమైన వాతావరణంలో పెరుగుతాయి. ఫిజీ దేశంలో వీటిని "టోంబితి" గా సుపరిచితమైన మొక్క. క్రిస్టమస్ ద్వీపంలో ఈ పొద సముద్రపు మట్టం నుండి సుమారు 100 మీటర్ల వరకు రహదారి, చెదురుమదురు ప్రాంతాలలో చురుకైన జాతులుగా పెరుగుతుంది.[2]
వర్ణన
మార్చుఇది ఒక పొద 60-100 సెం.మీ పొడవుగా పెరుగుతుంది. ఆకులు ఉపరితలంపై ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, దిగువ ఉపరితలంపై లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అవి సున్నితమైన అండాకారంగా ఉంటాయి. పువ్వులు 5 సెం.మీ పొడవు, వైలెట్, పింక్ లేదా తెల్ల రంగులో గరాటు ఆకారంలో ఉంటాయి. పండ్లు సుమారు 1.5 సెం.మీ పొడవు దీర్ఘవృత్తాకార గుళికలు. అవి పరిపక్వత చెందిన తరువాత నిగనిగలాడుతూ కనిపిస్తాయి.
వివిధ రకాల వీక్షణా చిత్రాలు
మార్చు-
Barleria cristata shrub.
ఉపయోగాలు
మార్చుపల్లెటూళ్లలో ఇళ్లముందు, రోడ్లపక్కన ఎక్కువగా కనిపించే మొక్క ఇది. ఈ పూలను ఎక్కువగా మాలలు కట్టి జడలో అలంకరించుకోవడానికీ, దేవుడికి అర్పించడానికీ వాడతారు. ఇది థాయ్‌లాండ్ లో ఔషథ మూలికగా ఉపయోగిస్తున్నారు. ఇది మూత్రసంబంధిత వ్యాధులు, రక్త శుద్ధీకరణ వంటి వాటిలో ఔషథంగా వాడుతారు.[ఆధారం చూపాలి] దక్షిణ భారతదేశంలోని తమిళనాడు లో వీటిని "డిసెంబర్ పూ" లేదా "డిసెంబర్ పూలు" గా పిలుస్తారు. ఇవి డిసెంబరు నెలలో విస్తారంగా పూస్తున్నందున అలా పిలుస్తారు. వీటిని మహిళలు తలలో అలంకారంగా ధరిస్తారు. ఆకు రసాన్ని కాలిన గాయాలకు వాపు తగ్గడానికి రాస్తారు. దీని గింజలను పాము కాటుకు విరుగుడుగా వాడతారు.
పెంపకం
మార్చువీటికి చీడపీడలు తక్కువ. తేమగా ఉన్న చోట చక్కగా పెరుగుతాయి. అయితే నీళ్లు నిలవకూడదు. పూలు పూసిన వెంటనే కత్తిరిస్తూ ఉంటే మంచిది. ఎండల్లో తప్ప సంవత్సరం అంతా పూసే ఈ మొక్క డిసెంబరు మాసంలో విపరీతంగా పూస్తుంది. దీన్ని అప్పుడప్పుడూ కత్తిరిస్తూ ఉంటే క్రమపద్ధతిలో, గుబురుగా పెరుగుతుంది. అలాగే కత్తిరించి వేర్వేరు ఆకారాల్లో పెంచుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు ఆశించకుండా అప్పుడప్పుడూ ఆకు కషాయం చల్లుతూ ఉంటే సరిపోతుంది. అక్టోబరు నుంచి రెండు వారాలకోసారి పాలీఫీడ్ వంటి సమగ్ర ఎరువును నీళ్లలో కలిపి పోస్తుంటే బాగా పూస్తుంది. వర్మీకంపోస్టు, ఎముకలపొడి, వర్మీవాష్ వంటి సేంద్రియ ఎరువులను ఉపయోగించినా ఫరవాలేదు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "ఈనాడు పత్రికలో ఆర్టికల్". Archived from the original on 2017-07-21. Retrieved 2017-07-22.
- ↑ "Pacific Island Ecosystems at Risk (PIER)". Archived from the original on 2009-03-24. Retrieved 2009-03-31.
ఇతర లింకులు
మార్చు- Barleria cristata Archived 2009-03-24 at the Wayback Machine