విలియం డి.కూలిడ్జ్

(డి.కూలిడ్జ్ విలియం నుండి దారిమార్పు చెందింది)

విలియం డి.కూలిడ్జ్ ( అక్టోబరు 23 1873 - ఫిబ్రవరి 3 1975 [1] అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. ఆయన X-కిరణం యంత్రాలపై అనేక ప్రయోగాలు చేశారు. ఆయన జనరల్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ లాబొరేటరీకి డైరక్టర్గా పనిచేశారు, కార్పొరేషన్ కు ఉపాధ్యక్షునిగా కూడా ఉన్నారు. ఆయన "సాగేగుణం గల టంగ్‌స్టన్"ను అభివృద్ధిచేయడంలో ప్రసిద్ధి పొందాడు. ఈ టంగ్‌స్టన్ విద్యుత్ బల్బులలో ముఖమైన భాగం.

విలియం డి.కూలిడ్జ్
William Coolidge (far left)
జననంఅక్టోబరు 23 1873
Hudson, Massachusetts
మరణం1975 ఫిబ్రవరి 3(1975-02-03) (వయసు 101)
Schenectady, New York
నివాసంయునైటెడ్ స్టేట్స్
జాతీయతఅమెరికన్
రంగములుఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
చదువుకున్న సంస్థలుUniversity of Leipzig
Massachusetts Institute of Technology
ప్రసిద్ధిhis contributions to the incandescent electric lighting and the X-rays art
ముఖ్యమైన పురస్కారాలుIEEE Edison Medal

ప్రారంభ సంవత్సరాలు

మార్చు

కూలిడ్జ్ మసాచుసెట్ట్స్ యందలి హడ్సన్ సమీపంలోని ప్రదేశంలో జన్మించారు. ఆయన 1891 నుండి 1896 లో మసాచుసెట్ట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లో చేరే వరకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. లాబొరేటరీ అసిస్టెంట్ గా పనిచేసిన సంవత్సరం తరువాత ఆయన జర్మనీ లొ ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లారు, అచట డాక్టరేట్లను పొందారు. ఆయన 1899 నుండి 1905 వరకు ఎం.ఐ.టి వద్ద రసాయన శాస్త్ర విభాగంలో గల ఆర్థర్ ఎ నోయ్స్ వద్ద రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేశారు.

సాగే గుణం గల టంగ్‌స్టన్

మార్చు

కూలిడ్జ్ 1905 లో కొత్త పరిశోధనా ప్రయోగశాలలో జనరల్ ఎలక్ట్రిక్స్ సంస్థ వద్ద పరిశోధకునిగా పనినేయుటకు వెళ్లారు. అచట ఆయన అనేక ప్రయోగాలను నిర్వహించారు. ఆయన పరిశోధన విద్యుత్ బల్బులలో ఫిలమెంటుగా ఉపయోగించే లోహంగా "టంగ్‌స్టన్" ఉపయోగించుటకు దోహదపడింది. ఆయన టంగ్‌స్టన్ లో సాగేగుణం గలదానిని అభివృద్ధి చేసారు. ఈ పరిశోధన ఫలితంగా విద్యుత్ బల్బు లోని ఫిలమెంటును సులువుగా తీగలుగా మలచవచ్చు. దానిని టంగ్‌స్టన్ ఆక్సైడు ద్వారా శుద్ధి చేయవచ్చు. 1911 మొదట్లో "జనరల్ ఎలక్ట్రిక్" ఈ క్రొత్త రకం ఫిలమెంట్ తో బల్బులను మార్కెట్ లో విడుదల చేసింది. దీనిఫలితంగా ఆ సంస్థకు ముఖమైన అదాయ వనరుగా ఈ బల్బుల అమ్మకం దోహదపడింది. ఆయన 1913 లో ఆయన క్రొత్త ఆవిష్కరనకు పేటెంట్ (US#1,082,933) కొరకు దరఖాస్తు చేసి పొందాడు. అదే విధంగా 1928 లో యు.ఎస్. లోని కోర్టు తాను తయారుచేసిన 1913 లోని పేటెంట్ విలువైన ఆవిష్కరణగా గుర్తించింది.[2][3]

X-కిరణ నాళం అభివృద్ధి

మార్చు

1913 లో ఆయన కూలిడ్జ్ నాళాన్ని ఆవిష్కరణ చేసాడు. అభివృద్ధి చెందిన కాథోడుతో కూడిన X-కిరణ నాళం అనేక ఎక్స్ - కిరణ యంత్రాలలో ఉపయోగించడాం వలన శరీరంలో చాలా అంతర భాగాలలో ఉన్న కాన్సర్ కణితులను కూడా కచ్చితంగా గుర్తించుటకు తోడ్పడింది. ఈ కూలిడ్జ్ నాళంలో టంగ్‌స్టన్ను ఫిలమెంట్గా ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించుట వైద్యరంగంలోని రేడియాలజీ విభాగంలో ప్రముఖ అభివృద్ధికి దోహదపడింది. ఈ నాళం యొక్క ప్రాథమిక డిసైన్ ను ప్రస్తుతం కూడా ఉపయోగిస్తున్నారు. ఆయన మొట్టమొదటి భ్రమణం చేసే ఆనోడు X-కిరణ నాళాన్ని ఆవిష్కరణ చేశారు. ఆయన 1913 లో యు.ఎస్. పేటెంట్ కోసం దరఖాస్తు చేసి 1916 లో పొందారు.

అవార్డులు

మార్చు

అంతిమ జీవితం

మార్చు

Coolidge became director of the GE research laboratory in 1932, and a vice-president of General Electric in 1940, until his retirement in 1944. He continued to consult for GE after retirement.

పేటెంట్ హక్కులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Suits, C. G. "National Academy of Sciences Memorial Biography". National Academy of Sciences. Archived from the original on 2008-03-13. Retrieved 2008-05-09.
  2. General Electric Co. v. De Forest Radio Co., 28 F.2d 641, 643 (3rd Cir. 1928)
  3. Lakshman D. Guruswamy, Jeffrey A. McNeely, Protection of global biodiversity: converging strategies. Duke University Press, 1998, p.333.
  4. James E. Brittain History William D. Coolidge and Ductile Tungsten in IEEE Industry Applications Magazine, Sept/Oct 2004, page 10
  • M.F. Wolff, "William D. Coolidge: shirt-sleeves manager", IEEE Spectrum, vol. 21, no. 5 (May 1984), pp. 81–85.
  • J.E. Brittain, "William D. Coolidge and ductile tungsten", IEEE Industry Applications Magazine, vol. 10, no. 5 (September/October 2004), pp. 9–10.
  • J.E. Brittain, "Electrical Engineering Hall of Fame: William D. Coolidge", Proc. IEEE, vol. 94, no. 11 (November 2006), pp. 2045–2048.

ఇతర లింకులు

మార్చు