ధీరావత్ రాగ్యానాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దేవరకొండ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

ధీరావత్ రాగ్యానాయక్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 - 2001
ముందు బద్దు చౌహాన్
తరువాత ధీరావత్ భారతి
నియోజకవర్గం దేవరకొండ

వ్యక్తిగత వివరాలు

జననం 1960
కొండ్రపోలు, దామెరచర్ల మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 2001
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ధీరావత్ భారతి

రాజకీయ జీవితం

మార్చు

డి.రాగ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 1989, 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి బద్దు చౌహాన్ చేతిలో ఓడిపోయాడు. ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరి అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నీనావత్ వశ్యానాయక్ పై 387 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచాడు.[2]

డి.రాగ్యానాయక్ 2001 డిసెంబర్‌ 29న మహబూబ్‌నగర్ జిల్లాలోని మద్దిమడుగులో ఓ జాతరలో పాల్గొనేందుకు వెళ్లగా నక్సల్స్‌ కాల్పులలో ఆయన మరణించాడు.[3]

మూలాలు

మార్చు
  1. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  2. Sakshi (2023). "దేవరకొండ నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  3. Eenadu (11 November 2023). "9 స్థానాల్లో.. 12 సార్లు ఉప ఎన్నికలు." Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.