ముడావత్ బద్దు చౌహాన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేవరకొండ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

బద్దు చౌహాన్

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 నుండి 1999
నియోజకవర్గం దేవరకొండ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ సీపీఐ
సంతానం గౌతమ్ చౌహాన్, ఝాన్సీ లక్ష్మీ
నివాసం లక్ష్మీనగర్ కాలనీ, కొత్తపేట, ఎల్‌బీనగర్, హైదరాబాద్

జననం, విద్యాభాస్యం మార్చు

బద్దు చౌహాన్ వరంగల్ జిల్లా, కొరివి మండలం, కంచర్లగూడెం గ్రామంలో 1951లో తుపియా చౌహాన్, చోమ్లీ దంపతులకు జన్మించాడు.[3] ఆయన ఎంఏ, బీఈడీ వరకు చదివాడు. ఆయన విద్యార్థి దశలో అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్)లో పనిచేశాడు.

ఇతర పదవులు మార్చు

ఆయన అనంతరం సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా, రాష్ట్ర గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, వ్యవసాయ సంఘం నాయకుడిగా పనిచేశాడు.

పోటీ చేసిన నియోజకవర్గాలు మార్చు

సంవత్సరం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు ఫలితం
1985 దేవరకొండ ఎస్టీ రిజర్వుడు ముడావత్ బద్దు చౌహాన్ సి.పి.ఐ 46525 విజయలక్ష్మి భారత జాతీయ కాంగ్రెస్ 21404 గెలుపు
1989 దేవరకొండ ఎస్టీ రిజర్వుడు ముడావత్ బద్దు చౌహాన్ సి.పి.ఐ 49414 డి.రాగ్యానాయక్ భారత జాతీయ కాంగ్రెస్ 44214 గెలుపు
1994 దేవరకొండ ఎస్.సి రిజర్వడ్ ముడావత్ బద్దు చౌహాన్ సి.పి.ఐ 56630 డి.రాగ్యానాయక్ స్వతంత్ర అభ్యర్థి 33557 గెలుపు

మూలాలు మార్చు

  1. Sakshi (27 November 2018). "హ్యాట్రిక్‌.. వీరులు!". Sakshi. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
  2. Sakshi (11 November 2013). "సీపీఐ మాజీ ఎమ్మెల్యే బద్దు చౌహాన్ కన్నుమూత". Sakshi. Archived from the original on 2 June 2021. Retrieved 2 June 2021.
  3. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.