డీమాంటీ కాలనీ 2
డీమాంటీ కాలనీ 2 2024లో విడుదలైన సినిమా. ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్‌పై బి.సురేశ్ రెడ్డి, బి.మానస రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అజయ్.ఆర్.జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. అరుల్‌నిధి, ప్రియ భవాని శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 24న విడుదల చేయగా, సినిమా ఆగస్ట్ 23న విడుదలైంది.[3][4][5]
డీమాంటీ కాలనీ 2 | |
---|---|
దర్శకత్వం | ఆర్. అజయ్ జ్ఞానముత్తు |
రచన | ఆర్. అజయ్ జ్ఞానముత్తు వెంకీ వేణుగోపాల్ వెంకీ వేణుగోపాల్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | హరీష్ కన్నన్ |
కూర్పు | కుమారేష్ డి. |
సంగీతం | సామ్ సి.ఎస్ |
నిర్మాణ సంస్థలు | BTG యూనివర్సల్ వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ జ్ఞానముత్తు పట్టరాయ్ |
పంపిణీదార్లు | రెడ్ జెయింట్ మూవీస్ |
విడుదల తేదీ | 15 ఆగస్టు 2024 |
సినిమా నిడివి | 144 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹15–20 కోట్లు [2] |
బాక్సాఫీసు | ₹ 85 కోట్లు [2] |
కథ
మార్చుసామ్... శామ్యూల్ రిచర్డ్ (సర్జనో ఖాలిద్) మరణించి ఆరేళ్లు. క్యాన్సర్ నుంచి సర్వైవ్ అయిన అతను ఆత్మహత్యకు పాల్పడటాన్ని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) జీర్ణించుకోలేదు. భర్త ఎందుకు అలా చేశాడని తెలుసుకోవడం మొదలు పెట్టగా, అతని ఆత్మతో మాట్లాడే ప్రయత్నంలో ఒక లైబ్రరీలో ఒక పుస్తకం చదవడం వల్లే ఆ పుస్తకం ఆరేళ్లకొకసారి కొంతమందిని చంపుతుందని తెలుస్తుంది. ఆ మరణాలు ఆపడానికి డెబీ ప్రయత్నిస్తుంది. అప్పుడు శ్రీనివాస్ (అరుళ్ నిధి), అతని కవల సోదరుడు రఘునందన్ (అరుళ్ నిధి) గురించి తెలుస్తుంది. వాళ్ల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని గుర్తిస్తుంది. దుష్ట శక్తి నుంచి శ్రీనివాస్, రఘునందన్ సోదరులను డెబీ, ఆమె మావయ్య రిచర్డ్ (అరుణ్ పాండియన్) కాపాడారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[6]
నటీనటులు
మార్చు- అరుల్‌నిధి
- ప్రియ భవాని శంకర్
- అరుణ్ పాండియన్
- ముత్తు కుమార్
- సర్జనో ఖాలిద్
- అర్చనా రవిచంద్రన్
- మాస్టర్ రెహాన్ అష్రాఫ్
- త్సెరింగ్ దోర్జీ
- ఆంటి జాస్కెలినెన్
- శామ్యూల్
- ప్రియదర్శిని రాజ్‌కుమార్
- రణేష్
- కలైయరసన్ (అతిధి పాత్ర)
- రవి వెంకట్రామన్
- సెంథి కుమారి
- సౌందర్య మహేష్ బాబు
- ఆర్టిస్ట్ మహేశ్వరన్
- మాస్టర్ అల్లం
- వెట్టై ముత్తుకుమార్
- మీనాక్షి గోవిందరాజన్
- అర్చన రవిచంద్రన్
- ఎం.ఎస్ భాస్కర్ (అతిధి పాత్ర)
- రమేష్ తిలక్ విమల్ (అతిధి పాత్ర)
- సనంత్ (అతిధి పాత్ర)
- అభిషేక్ జోసెఫ్ జార్జ్ సాజిత్ (అతిధి పాత్ర)
- హెలెన్ టేలర్ ఎమిలీ డెమోంటే (అతిధి పాత్ర)
మూలాలు
మార్చు- ↑ "Demonte Colony 2 clears censorship formalities". Cinema Express. 28 July 2024. Archived from the original on 18 August 2024. Retrieved 28 July 2024.
- ↑ 2.0 2.1 "'Demonte Colony 2' OTT release date: When and where to watch Arulnithi and Ajay Gnanamuthu's horror drama". The Times of India. 17 September 2024. Archived from the original on 17 September 2024. Retrieved 18 September 2024.
- ↑ Eenadu (19 August 2024). "చిన్న సినిమాలు.. రీ-రిలీజ్‌లు.. ఇవే ఈ వారం సినిమా ముచ్చట్లు". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
- ↑ Chitrajyothy (22 August 2024). "తెలుగులోనూ ఆదరిస్తారు". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
- ↑ Eenadu (26 September 2024). "ఈ వారం ఓటీటీలో క్రేజీ చిత్రాలు.. అలరించే వెబ్‌సిరీస్‌లు". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ Sakshi (22 August 2024). "హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ-2 రివ్యూ.. ఆడియన్స్‌ను భయపెట్టిందా?". Retrieved 14 October 2024.