డెన్మార్క్‌లో హిందూమతం

డెన్మార్క్‌లో హిందూమతం మైనారిటీ మతం. 2020 నాటికి డెన్మార్క్ లో 30,000 (0.5%) మంది హిందువులు ఉన్నారు. [1]

Hindu goddess Kali, National Museum, Copenhagen
కోపెన్‌హాగన్ లోని నేషనల్ మ్యూజియంలో హిందూ దేవత కాళి.

చరిత్ర

మార్చు

శ్రీలంకలో తీవ్రమవుతున్న ఘర్షణ కారణంగా 1983లో శ్రీలంక తమిళ మూలానికి చెందిన హిందువులు మొదటగా డెన్మార్కు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది పురుషులు. వారిని శరణార్థులుగా వర్గీకరించారు. ఆ తరువాత వారు పెళ్ళి చేసుకోవడం గాని, తాము వదలి వచ్చిన కుటుంబాన్ని తెచ్చుకోవడం గానీ చేసారు. దాదాపు సగం మంది తమిళులకు డేనిష్ పౌరసత్వం మంజూరు చేసారు.

శ్రీలంక తమిళ మూలానికి చెందిన ఈ హిందువులు సమీప భవిష్యత్తులో శ్రీలంకలో వివాదానికి ఎటువంటి పరిష్కారం దొరకదని గ్రహించారు. వారు డెన్మార్క్‌లో తమ సాంస్కృతిక, మతపరమైన ఆచారాలలో కొన్నింటిని పునర్నిర్మించడం లేదా పునర్వ్యవస్థీకరించడం ప్రారంభించారు.

జనాభా వివరాలు

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
201012,000—    
201511,400−5.0%
201717,100+50.0%
202030,000+75.4%
సంవత్సరం శాతం మార్పు
2010 0.2% -
2015 0.2% -
2017 0.3% +0.1%
2020 0.5% +0.2%

2010 అంచనా ప్రకారం డెన్మార్క్ లో సుమారు 12,000 హిందువులు ఉన్నారు.

శ్రీలంక, భారతీయ మూలాలున్నవారు డెన్మార్క్‌లోని హిందువులలో ఎక్కువ మంది ఉన్నారు. 2017లో మొత్తం 57 లక్షల జనాభాలో సుమారు 18,000–19,000 మంది హిందువులు ఉన్నారు. మొత్తం జనాభాలో ఇది 0.3%.

డానిష్ జాతి సమాజంలో హిందూ మతం కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. డానిష్ జాతీయుల్లో దాదాపు 2,000 మంది హిందూ-సంబంధ సమూహాలకు గాని, హిందూ-ప్రేరేపిత సమూహాలకు గానీ చెందినవారు. [2]

దేవాలయాలు

మార్చు

డెన్మార్క్‌లో ఐదు హిందూ దేవాలయాలు ఉన్నాయి. రెండు వినాయకుడి ఆలయాలు, మిగతావి దేవత అభిరామికి చెందినవి. ISKCON దేవాలయాలు కూడా ఉన్నాయి.

హిందూ సమాజం

మార్చు

డెన్మార్క్‌లో 9 నమోదైన హిందూ సమూహాలు ఉన్నాయి, [3] వాటిలో హిందూ స్వయంసేవక్ సంఘ్ అనే సంస్థ ఒకటి. [4]

2011లో, పశ్చిమ కోపెన్‌హాగన్‌లోని ఒక హిందూ దేవాలయంపై ముస్లిం యువకుల బృందం దాడి చేసి, రాళ్లు విసిరి కిటికీలను పగలగొట్టింది. ఒక పోలీసు అధికారి వచ్చి, జరిగిన నష్టాన్ని గమనించి వెళ్లిపోయాడు. అరగంట తర్వాత, దాడికి పాల్పడిన అదే గుంపు మరింత మందితో వచ్చి, మళ్లీ రాళ్లు విసిరి, తోటలోకి ప్రవేశించి, తులసి గదిలో వీధికి ఎదురుగా ఉన్న అన్ని కిటికీలను బద్దలు కొట్టింది. [5] [6]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Religions in Denmark". Archived from the original on 2021-12-03. Retrieved 2021-12-04.
  2. "Hinduism in Denmark - Hinduism - Oxford Bibliographies - obo". www.oxfordbibliographies.com (in ఇంగ్లీష్). Archived from the original on 2019-04-02. Retrieved 2019-04-05.
  3. United States Department of State (2017). "DENMARK 2017 INTERNATIONAL RELIGIOUS FREEDOM REPORT" (PDF). www.state.gov. Archived from the original (PDF) on 2018-05-29. Retrieved 2019-04-05.
  4. "Indians celebrate desi festivals in Denmark". The Times of India. Retrieved 2019-04-05.
  5. Keralam, Haindava (2011-12-20). "Muslims attack Hare Krishna temple in Denmark". Haindava Keralam (in మలయాళం). Archived from the original on 2021-12-31. Retrieved 2019-04-05.
  6. "Muslims attack Hare Krishna temple in Denmark". en.europenews.dk. 15 December 2011. Archived from the original on 2019-02-02. Retrieved 2019-02-02.