డెన్వర్ నగరం మరియు కౌంటీ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొలరాడో రాష్ట్రానికి రాజధాని. కొలరాడో రాష్ట్రంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాలలో డెన్వర్ నగరానిది రెండవ స్థానం. మొదటి స్థానం ఇ ఎల్ పాసో కౌంటీ ఇది 2010లో జనసాంధ్రతలో డెన్వర్‌ను అధిగమించింది. డెన్వర్ సౌత్ ప్లాట్ రివర్ వెల్లీ (దక్షిణ ప్లాట్ నదీలోయ ) లో హై ప్లెయిన్స్ (హై మైదానాలు) కు పశ్చిమ కొసలో రాకీ మౌంటెన్స్‌ యొక్క ఫ్రంట్ రేంజ్ (ప్రథమ శ్రేణి) కి కొంచెం తూర్పుగా ఉపస్థితమై ఉంది. డెన్వర్ డౌన్‌టౌన్ జిల్లా చెర్రీచెక్ మరియు సౌత్ ప్లాట్ రివర్ సంగమ ప్రాంతంలో రాకీ మౌంటెన్స్ ఫూట్ హిల్స్ (పర్వత దిగువ) కు సుమారు 12 మైళ్ళ దూరంలో ఉంటుంది. డెన్వర్ నగరానికి మైల్ హై సిటీ అనే మారు పేరు ఉంది. సముద్రమట్టానికి ఇది సరిగ్గా 1 మైల్ (1.6 కిలోమీటర్లు లేక 5,280 అడుగులు లేక 1,609.344 మీటర్లు) ఎత్తులో ఉండడమే ఇందుకు కారణం.

డెన్వర్ నగర జనాభా 600,158. జనసంఖ్యా పరంగా ఇది యు.ఎస్ నగరాలలో 27వ స్థానంలో ఉంది. డెన్వర్ 10వ కౌంటీ అయిన డెన్వర్ అరోరా బ్రూమ్‌ఫీల్డ్ కో మెట్రో పాలిటన్ స్టాటిస్టికల్ ఏరియా యొక్క 2009 జనసంఖ్య 2,552,195. ఇది జనసంఖ్యలో యు.ఎస్ మెట్రో పాలిటన్ స్టాటిస్టికల్ ఏరియాలలో 21వ స్థానంలో ఉంది. 12వ డెన్వర్ - అరోరా- బౌల్డర్ కంబైన్డ్ స్టాటిస్టికల్ ఏరియా 2009 జనసంఖ్య అంచనా 3,110,436. ఇది యు.ఎస్ మెట్రో పాలిటన్ స్టాటిస్టికల్ ఏరియాలలో 16వ స్థానంలో ఉంది. ఫీనిక్స్ తరువాత డెన్వర్ 500 మైళ్ళ (680 కిలోమీటర్లు) వ్యాసం కలిగిన మౌంటెన్ వెస్ట్ మరియు సౌ వెస్ట్ ప్రాంతంలో అధిక జనసాంధ్రత కలిగిన నగరం . రెండు రాష్ట్రాలకు చెందిన 18 కౌంటీలు కలిగిన ఫ్రంట్ రేంజ్ అర్బన్ కారిడార్‌లో డెన్వర్ అధిక జనాభా కలిగిన నగరం. 2009లో ఫ్రంట్ రేంజ్ అర్బన్ కారిడార్‌ జనాభా 4,328,406.

చరిత్రసవరించు

భౌగోళిక స్వరూపంసవరించు

వతావరణంసవరించు

పరిసర ప్రాంతాలుసవరించు

ఉద్యానవనాలు మరియు పునరుత్తేజంసవరించు

జనాభాసవరించు

ప్రభుత్వంసవరించు

ఆర్ధికరంగంసవరించు

మాధ్యమంసవరించు

ఆకాశవాణి కేంద్రంసవరించు

ప్రచురణా మాధ్యమంసవరించు

ప్రయాణ వసతులుసవరించు

నగర వీధులుసవరించు

రహదార్లుసవరించు

సాధారణ ప్రయాణీకులుసవరించు

విమానాశ్రయాలుసవరించు

విద్యారంగంసవరించు

సంస్కృతి మరియు సమకాలీన జీవితంసవరించు

క్రీడలుసవరించు

సోదర నగరాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=డెన్వర్&oldid=2171133" నుండి వెలికితీశారు