డేనియల్ మనోహర్

తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు

డేనియల్ మనోహర్, తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1997-2007 మధ్యకాలంలో హైదరాబాద్ క్రికెట్ టీం తరపున[1] 73 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.

డేనియల్ మనోహర్
వ్యక్తిగత సమాచారం
జననం (1974-03-13) 1974 మార్చి 13 (వయసు 48)
హైదరాబాదు, తెలంగాణ
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1997-2007 హైదరాబాదు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్-క్లాస్ లిస్టు-ఏ
మ్యాచులు 73 36
చేసిన పరుగులు 4,009 1,287
బ్యాటింగ్ సరాసరి 33.68 37.85
100s/50s 8/20 2/8
అత్యధిక స్కోరు 144 131
బౌలింగ్ చేసిన బంతులు 4,083 390
వికెట్లు 65 13
బౌలింగ్ సరాసరి 32.30 26.92
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0
ఉత్తమ బౌలింగ్ 4/48 3/26
క్యాచులు/స్టంపులు 58/0 10/0
Source: [ఈ.ఎస్.పి.ఎన్. క్రాక్ ఇన్ఫో], 22 ఆగస్టు 2018 {{{year}}}

జననంసవరించు

డేనియల్ మనోహర్, 1974 మార్చి 13న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.

క్రికెట్ రంగంసవరించు

ఫస్ట్-క్లాస్సవరించు

1997-98 మధ్య ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2007 డిసెంబరు 25 నుండి 28 వరకు హైదరాబాదు నగరంలో ఉత్తర ప్రదేశ్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[2] 73 మ్యాచ్‌ల్లో 33.68 బ్యాటింగ్ సగటుతో 4,009 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 20 అర్థసెంచరీలు ఉన్నాయి. 144 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు. బౌలింగ్ లో 4,083 బంతులు వేసి 65 వికెట్లు తీశాడు.

లిస్టు-ఎసవరించు

1997-98 మధ్య లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2007 ఫిబ్రవరి 13న హైదరాబాదు నగరంలో ఆంధ్ర క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[3] 36 మ్యాచ్‌ల్లో 37.85 బ్యాటింగ్ సగటుతో 1,287 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 8 అర్థసెంచరీలు ఉన్నాయి. 131 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు. బౌలింగ్ లో 390 బంతులు వేసి 13 వికెట్లు తీశాడు.

మూలాలుసవరించు

  1. "Daniel Manohar". ESPN Cricinfo. Retrieved 2022-08-28.
  2. "Full Scorecard of U. Pradesh vs Hyderabad Group B 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.
  3. "Full Scorecard of Andhra vs Hyderabad South Zone 2006/07 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.

బయటి లింకులుసవరించు