డైక్లోరిన్ హెప్టాక్సైడ్

డైక్లోరిన్ హెప్టాక్సైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన సమ్మేళనం.ఈ రసాయనపదార్థం యొక్క రసాయన సంకేత పదం Cl2O7.ఈ క్లోరిన్ ఆక్సైడ్, పెర్క్లోరిక్ ఆమ్లం యొక్క నిర్జలస్థితి(anhydride).

డైక్లోరిన్ హెప్టాక్సైడ్
పేర్లు
IUPAC నామము
Dichlorine heptoxide
ఇతర పేర్లు
Chlorine(VII) oxide; Perchloric anhydride; (Perchloryloxy)chlorane trioxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10294-48-1]
పబ్ కెమ్ 123272
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:52356
SMILES O=Cl(=O)(=O)OCl(=O)(=O)=O
ధర్మములు
Cl2O7
మోలార్ ద్రవ్యరాశి 182.901 g/mol
స్వరూపం colorless oil
సాంద్రత 1900 kg m−3
ద్రవీభవన స్థానం −91.57 °C (−132.83 °F; 181.58 K)
బాష్పీభవన స్థానం 82 °C (180 °F; 355 K)
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు oxidizer, contact explosive[1]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

ఉత్పత్తి మార్చు

నిర్జలీకరణ కారకమైన ఫాస్పరస్‌పెంటాక్సైడ్ సమక్షములో పెర్క్లోరిక్‌ఆమ్లాన్ని జాగ్రత్తగా డిస్టిలేసన్ చెయ్యడంద్వారా డైక్లోరిన్ హెప్టాక్సైడ్‌ను ఉత్పత్తి చెయ్యవచ్చును.

2HClO4 + P4O10 → Cl2O7 + H2P4O11

ఈ మిశ్రమం నుండి క్లోరిన్(VII)ఆక్సైడును డిస్టిలేసను ద్వారా వేరుపరచవచ్చును.క్లోరిన్, ఓజోన్ మిశ్రమం పై కాంతిని ప్రకాశింప చెయ్యడం వలన డైక్లోరిన్ హెప్టాక్సైడ్‌ను ఉత్పత్తి చెయ్యవచ్చును. డైక్లోరిన్ హెప్టాక్సైడ్ నెమ్మదిగా జలవిశ్లేషణ చెందటం వలన తిరిగి పెర్క్లోరిక్ ఆమ్లంగా పరివర్తన చెందును.

అణునిర్మాణం మార్చు

డైక్లోరిన్ హెప్టాక్సైడ్ ఒక ఉష్ణ గ్రాహకము. అనగా ఈ పదార్థం అంతర్గతంగా అస్థిరమైనది.

2Cl2O7 → 2Cl2 + 7O2 (ΔH = −135 kJ/mol)

డైక్లోరిన్ హెప్టాక్సైడ్ సంయోగపదార్ధ అణునిర్మాణం Cl-O-Cl బంధం 118.6°కోణంతో కొద్దిగా వంపు కలిగి, C2అణువు సౌష్టవంకలిగి ఉండును.అంతిమ/చివరి Cl-O పరమాణువుల మధ్యదూరం 1.709 Å, Cl=O ల బంధదూరం1.405 Å.సమ్మేళనం అణువులో పరమాణువులు సమయోజనీయబంధం కలిగి ఉన్నను,సమ్మేళనంలో క్లోరిస్ అత్యధికంగా +7 ఆక్సీకరణ స్థాయి కలిగి ఉన్నది.

రసాయన చర్యలు మార్చు

క్లోరిన్ టెట్రాక్లోరైడు ద్రావణంలో ప్రాథమిక, ద్వితీయశ్రేణి అమీను(amines)లతో డైక్లోరిన్ హెప్టాక్సైడ్ రసాయన చర్య వలన N-పెర్క్లోరిల్స్(N-perchloryls)ఏర్పడును.

2 RNH2 + Cl2O7 → 2 RNHClO3 + H2O2 R2NH + Cl2O7 → 2 R2NClO3 + H2O

డైక్లోరిన్ హెప్టాక్సైడ్‌తో అల్కీనులు(alkenes )చర్య జరపడంచే అల్కైల్‌ పెర్క్లోరేటులు ఏర్పడును.ఉదాహరణకు టెట్రాక్లోరైడు ద్రావణంలో ప్రొపేన్ తో చర్య వలన ఐసో ప్రొపైల్ పెర్క్లోరేట్ , 1-క్లోరో-2 ప్రొపైల్ పెర్క్లోరేట్ లను ఏర్పరచును.డైక్లోరిన్ హెప్టాక్సైడ్ ఒకబలమైన ఆమ్ల ఆక్సైడ్,

భద్రత మార్చు

డైక్లోరిన్ హెప్టాక్సైడ్ ఒక బలమైన క్లోరిన్ ఆక్సైడ్ అవడంవలన, ఇది బలమైన ఆక్సీకరణి, ప్రేలుడు స్వభావం ఉన్న పదార్థం.ఈ రసాయనపదార్థం మంటను తాకటం వలన, లేదా యాంత్రికఘాతం వలన లేదా అయోడిన్‌తో సంపర్కం వలన విస్పొటన చెందును.చల్లగాఉన్నప్పుడు సల్ఫర్/గంధకం ,ఫాస్పరస్/భాస్వరం, కాగితం పై ఎటువంటి ప్రభావం చూపించాడు.మూలక క్లోరిన్ మనుషుల మిద ఎటువంటి ప్రభావం చూపునో డైక్లోరిన్ హెప్టాక్సైడ్ వలన కూడా అటువంటి ప్రభావమే ఉంటుంది.

మూలాలు మార్చు

  1. Holleman, Arnold F.; Wiberg, Egon (2001). Inorganic chemistry. Translated by Mary Eagleson, William Brewer. San Diego: Academic Press. p. 464. ISBN 0-12-352651-5.