డోరా బీల్ సరస్సు
డోరా బీల్ అస్సాం లోని రాంపూర్ వద్ద ఉన్న ఒక చిత్తడి నేల కలిగిన సరస్సు. ఇది పలాష్‌బరి రెవెన్యూ సర్కిల్ పరిధిలో ఉన్న రెండవ గ్రామం. దీని చుట్టుపక్కల రాజపుఖురి, నహీరా, భకత్‌పారా, తేజ్‌పూర్, రాంపూర్, మజ్‌పారా, కుల్దుంగ్, ధంటోలా, బోర్తారి వంటి గ్రామాలు ఉన్నాయి.
విస్తీర్ణం
మార్చు1971-సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, ఈ సరస్సు మొత్తం వైశాల్యం 297.96 ఎకరాలు. అయితే, 2005 లో ల్యాండ్ సాట్ ఇమేజరీ ప్రకారం ఇది 278.41 ఎకరాలకు తగ్గిపోయింది.[1]
నీటి వనరులు
మార్చుఈ సరస్సు కుల్సీ నది ద్వారా నిండి, ఎక్కువైన నీరు తిరిగి కుల్సీ నదిలో కలుస్తాయి.
నివాసం
మార్చుఅంతరించిపోతున్నటువంటి దక్షిణాసియా డాల్ఫిన్ (ప్లాటానిస్టా గంగెటికా)కు ఈ డోరా బీల్ ప్రధాన నివాసం. ఈ అంతరించిపోతున్న డాల్ఫిన్ లు (అస్సామీ భాషలో జిహు అని పిలుస్తారు) మొత్తం బ్రహ్మపుత్ర డెల్టాలోని సుబన్సిరి నది, కుల్సీ నదిలలో మాత్రమే సంతానోత్పత్తి చేస్తాయి.[2]
డోరా బీల్ పండుగ
మార్చుడోరా బీల్ పేరుతో అక్కడి ప్రజలు దేశీయ చేప జాతుల ఉత్పత్తిని ఉద్దేశించి చర్చించడానికి డోరా బీల్ ఒడ్డున ఒక వార్షిక పండుగ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ ప్రాథమికంగా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఈ పండుగ ప్రకృతిని రక్షించే, గౌరవించే సందేశాన్ని కలిగి ఉంటుంది.[3]
మూలాలు
మార్చు- ↑ "Save Dora Beel – Save River Dolphin". Northeast Now (in ఇంగ్లీష్). Retrieved 12 November 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Summary of Dolphin habitat zone of river Kulsi" (PDF). Sodh Ganga –a reservoir of Indian theses (in ఇంగ్లీష్). Retrieved 12 November 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Dora Beel fest from today". The Assam Tribune (in ఇంగ్లీష్). Archived from the original on 12 నవంబరు 2020. Retrieved 12 November 2020.